వ్యభిచార గృహలపై దాడి, ఆరుగురు మహిళలతో సహా 10 మంది అరెస్ట్

వ్యభిచార గృహలపై దాడి, ఆరుగురు మహిళలతో సహా 10 మంది అరెస్ట్

Hyderabad cops arrested 4 women, 6 men in brothal houses : హైదరాబాద్ లో వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్న రెండు వేర్వేరు చోట్ల పోలీసులు దాడులునిర్వహించి నలుగురు మహిళలతో సహా 10 మందిని అరెస్ట్ చేశారు.

జగద్గిరిగుట్టపోలీసు స్టేషన్ పరిధిలోని గాజుల రామారంలోని మహాదేవపురం కాలనీలో ఓ ఇంటిలో వ్యభిచారం నిర్వహిస్తున్నారని అందిన సమచారం మేరకు పోలీసులు శనివారం దాడులు జరిపారు. ఈ దాడుల్లో నలుగురు విటులతో పాటు ఇద్దరు మహిళలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సెల్ ఫోన్ ద్వారా విటులను ఆకర్షించి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వారివద్దనుంచి 5 సెల్ ఫోన్ల్ స్వాధీనం చేసుకుని నిర్వాహకులతో పాటు విటులపై కేసు నమోదు చేశారు.

కాగా….బాలానగర్ ఏరియాలోని కమల ప్రసూననగర్ లో ఒక ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. బాలానగర్ ఎస్వోటీ పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి ఇద్దరు మహిళలతో పాటు నిర్వాహకుడు హరీష్, విటుడు విజేందర్ లనుఅరెస్ట్ చేశారు. అనంతరం వారిని జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ కు తరలించారు. మహిళలను రెస్క్యూ హోం కు తరలించారు.