బ్లాక్ మార్కెట్లో కరోనా మందులు… 8మందిని అరెస్ట్ హైదరాబాదు పోలీసులు

  • Published By: nagamani ,Published On : July 15, 2020 / 12:01 PM IST
బ్లాక్ మార్కెట్లో కరోనా మందులు… 8మందిని అరెస్ట్ హైదరాబాదు పోలీసులు

కాదేదీ అనర్హం దోపిడికి అన్నట్లుగా ఈ కరోనా కాలంలో మోసగాళ్లు డబ్బులు దండుకుంటున్నారు. అవినీతి భూతం కోరలతో ప్రజల ప్రాణాలతో చెలగాలాడుతున్నారు. కరోనా మెడిసిన్ అని ప్రచారం చేస్తూ బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న గుట్టు బట్టబయలు చేశారు హైదరాబాద్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.

కరోనా మెడిసిన్ ను బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నారనే విషయంపై పక్కా సమాచారంతో హైదరాబాద్ పోలీసులు రంగరంలోకి దిగారు. కమిషనర్ అంజనీకుమార్ ఆధ్వర్యంలోని పోలీసుల బృందం పాతబస్తీలో దాడులు చేసి అంతర్రాష్ట్ర బ్లాక్ మార్కెట్ ముఠాను అరెస్ట్ చేశారు. ఈ దాడుల్లో ఎనిమిది మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి రూ.35 లక్షల విలువైన అత్యంత కీలకమైన మెడిసిన్ ను స్వాధీనం చేసుకున్నామని కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు.రూ.35వేల విలువైన డ్రగ్ ను రూ.2లక్షలకు విక్రయిస్తున్నారని తెలిపారు.

ఆ మందుల్లో అత్యధికంగా ఫాబిఫ్లూ (ఫావిపిరావిర్), స్డాండర్డ్ క్యూకోవిడ్-19 ఎల్జీఎం, రెమ్ డెసివిర్ వంటి యాంటీ వైరల్ డ్రగ్స్ ఉన్నట్టు గుర్తించారు. రూ.35 వేల విలువైన ఇంజెక్షన్ ను ఈ ముఠా రూ.40 వేలకు విక్రయిస్తున్నట్టు తెలుసుకున్నారు. వారి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న వాటిలో కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు కూడా ఉన్నాయి.

ఈ ముఠాకు వెంకట సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఆధ్వర్యంలో నడుస్తోందని పోలీసులు గుర్తించారు. మెడికల్ రిప్రజంటేటివ్స్ ద్వారా ఈ కరోనా ఔషధాలను మార్కెట్లోకి పంపిస్తున్నారని, ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లో బ్లాక్ మార్కెటింగ్ కు సహకరించవద్దని మెడికల్ డిస్ట్రిబ్యూటర్లకు, డీలర్లకు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ స్పష్టం చేశారు.