HYD CP CV Anand : ఆ సినిమాలు చూసి దోపిడీ చేశారు : సికింద్రాబాద్ బంగారు షాపు చోరీ కేసులో సంచలన విషయాలు

సిద్ధి వినాయక బంగారు షాపులో చోరీ సినిమా స్టైల్లో జరిగిందని.. దొంగలు ఆ సినిమాలను చూసి చోరీ చేశారని సీవీ ఆనంద్ వెల్లడించారు.

HYD CP CV Anand : ఆ సినిమాలు చూసి దోపిడీ చేశారు : సికింద్రాబాద్ బంగారు షాపు చోరీ కేసులో సంచలన విషయాలు

Hyderabad CP CV Anand

HYD CP CV Anand : సికింద్రాబాద్ లో కొన్ని రోజుల క్రితం సిద్ధి వినాయక బంగారు షాపులో జరిగిన చోరీని పోలీసులు ఛేధించారు. సినిమా స్టైల్లో దొంగలు దోపిడీ చేశారని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. సిద్ది వినాయక జ్యువెలరీ షాప్ లోకి వెళ్లిన దొంగలు తెలివిగా ఐటీ రైడ్స్ అని చెప్పి దోపిడి చేశారని 2013లో బాలివుడ్ నటుడు అక్షయ్ కుమార్ 2013లో నటించిన ‘స్పెషల్ 26’ ఈ సినిమాకు రీమేక్ గా వచ్చిన సూర్య నటించిన గ్యాంగ్ సినిమా చూసి ఈ చోరీ చేశారని సీవీ ఆనంద్ వెల్లడించారు.

మే 27 (2023)న సిద్ధి వినాయక బంగారు నగల షాపులో జరిగిన చోరీని ఛేదించామని తెలిపారు. షాప్ లోకి వెళ్లిన దొంగలు ఐటీ రైడ్స్ అని చెప్పి.. నకిలీ ఐడీ కార్డ్ చూపించి దోపిడి చేశారని..17 గోల్డ్ బిస్కెట్లు తో పరారు అయ్యారని తెలిపారు. ఇటువంటి చోరీ ఎప్పుడు జరగలేదని తెలిపారు.CDR తో పాటు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసి కేసును ఛేదించామని..నిందితులు మహారాష్ట్ర కి చెందిన సాంగ్లి జిల్లాకు చెందిన వారిగా గుర్తించామని తెలిపారు.

ఈ చోరీ కేసులో 10 మందిలో నలుగురిని ఇప్పటికే అరెస్ట్ చేశామని..పరారీలో ఉన్న మిగిలిన ఆరుగురి కోసం గాలిస్తున్నామన్నారు. అరెస్ట్ చేసిన వారి నుంచి 7 గోల్డ్ బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నామని..ఇంకా మిగిలిన నిందితులు నుండి 10 బిస్కెట్లు స్వాధీనం చేసుకోవాల్సి ఉందని తెలిపారు. అక్షయ్ కుమార్ నటించిన స్పెషల్ 26, సూర్య నటించిన గ్యాంగ్ సినిమా చూసి ఈ దోపిడీ కి పాల్పడ్డారు ఈ కేసులో రెహ్మాన్, జకీర్, ప్రవీణ్ యాదవ్, ఆకాష్ అరుణ్ ను అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ ముఠా ఐటీ ఆఫీసర్ అని చెప్పి, నకిలీ ఐడీ కార్డ్ చూపించి దోపిడీ చేశారని తెలిపారు.