ఇలాంటి నేరస్థులకు ఇది సరైన ముగింపు

సామాన్య పౌరురాలిగా దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ పై నేనెంతో సంతోషించానన్నారు జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు రేఖాశర్మ. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

  • Published By: chvmurthy ,Published On : December 6, 2019 / 06:07 AM IST
ఇలాంటి నేరస్థులకు ఇది సరైన ముగింపు

సామాన్య పౌరురాలిగా దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ పై నేనెంతో సంతోషించానన్నారు జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు రేఖాశర్మ. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

సామాన్య పౌరురాలిగా దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ పై నేనెంతో సంతోషించానన్నారు జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు రేఖాశర్మ. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇలాంటి నేరస్థులకు ఇది సరైన ముగింపు అని ఆమె అన్నారు. దిశ నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన హైదరాబాద్ పోలీసులే మంచి న్యాయనిర్ణేతలు, ఏ పరిస్థితుల్లో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగిందో తనకు తెలియదని రేఖాశర్మ తెలిపారు. దిశ నిందితులకు మరణశిక్ష విధించాలని తాము డిమాండ్ చేశామన్నారు.

‘దిశ’  హత్యాచార నిందితులను పోలీసులు  శుక్రవారం, డిసెంబర్ 6 తెల్లవారుఝూమున ఎన్‌కౌంటర్‌ చేశారు. షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి వద్ద క్రైమ్‌ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా నిందితులు పారిపోవడానికి ప్రయత్నం చేయడంతో నలుగురు నిందితులను పోలీసులు కాల్చి చంపారు. కాగా 2019, నవంబర్ 27న వెటర్నరీ డాక్టర్ పై నలుగురు నిందితులు అత్యాచారం చేసిన అనంతరం హత్య చేసిన విషయం తెలిసిందే. అనంతరం మృతదేహాన్ని చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద కాల్చివేశారు. దిశ కేసులో నిందితులు నలుగురిని డిసెంబర్5, గురువారం నాడు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

కేసు విచారణలో భాగంగా …. దుర్ఘటన జరిగిన ప్రాంతంలో పోలీసులు నిందితులను తీసుకు వెళ్లి సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా… వారు పారిపోయేందుకు ప్రయత్నించారు. పట్టుకోటానికి యత్నించిన పోలీసులపై రాళ్లతో  దాడికి యత్నించారు. దీంతో పోలీసులు  వారిపై కాల్పులు జరపడంతో ప్రధాన నిందితుడుఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు  అక్కడికక్కడే మృతి చెందారు. శుక్రవారం తెల్లవారుజామున 3-30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.