కారణం ఇదేనా…. ఘట్ కేసర్ కిడ్నాప్, రేప్ డ్రామా ఆడిన బీఫార్మసీ విద్యార్ధిని జీవితం విషాదాంతం

కారణం ఇదేనా…. ఘట్ కేసర్ కిడ్నాప్, రేప్ డ్రామా ఆడిన బీఫార్మసీ విద్యార్ధిని జీవితం విషాదాంతం

Hyderabad Ghatkesar kidnap drama B.Pharmacy student ends her life : హైదరబాద్, నగర శివారులోని ఘట్ కేసర్ లో పది రోజుల క్రితం కిడ్నాప్, అత్యాచారం డ్రామా ఆడిన బీ ఫార్మశీ విద్యార్ధిని జీవింతం అర్ధాంతరంగా ముగిసింది. తాను ఆడిన కిడ్నాప్ డ్రామా అంతా ఫేక్ అని పోలీసులు తేల్చటంతో మనస్తాపానికి గురైన యువతి మంగళవారం రాత్రి షుగర్ టాబ్లెట్ల్ వేసుకుని తనువు చాలించింది. కిడ్నాప్ డ్రామా తర్వాత పోలీసులు యువతిని రక్షించి ఆస్పత్రిలో చేర్పించారు.

అనంతరం కిడ్నాప్ డ్రామా గురించి ఆయువతిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినప్పటి నుంచి యువతి అమ్మమ్మ ఇంటివద్ద ఉంటోంది. ఈక్రమంలో యువతి మంగళవారం రాత్రి షుగర్ టాబ్లెట్లు వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. టాబ్లెట్లు వేసుకున్న చాలాసేపటి తర్వాత తన కుటుంబ సభ్యులకు, పోలీసులకు తనువు చాలిస్తున్నట్లు సమాచారం ఇచ్చింది.

వెంటనే వారు ఆమెను ఘట్ కేసర్ ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. ఆస్పత్రిలో చేర్చిన అనంతరం చికిత్స పొందుతూ యువతి బుధవారం ఉదయం కన్నుమూసింది. పోస్టుమార్టనిమిత్తం యువతి మృతదేహాన్నిగాంధీ ఆస్పత్రికి తరలించారు.

కారణం ఇదేనా…
మేడ్చల్ కండ్లకోయలో ఓ ప్రైవేట్ కాలేజీలో బీ ఫార్మశీ చదువుతున్న విద్యార్ధిని 10 రోజుల క్రితం కాలేజీనుంచి ఇంటికి తిరిగి వచ్చే క్రమంలో రాంపల్లి క్రాస్ రోడ్డు వద్ద కాలేజీ బస్సు దిగి ఆర్ఎల్ నగర్ వెళ్లేందుకు సెవెన్ సీటర్ ఆటో ఎక్కింది. అప్పటికే ఫోన్ చేసిన తండ్రికి మరి కొద్ది సేపట్లో ఇంటికి చేరుకుంటానని చెప్పింది.

ఆతర్వాత తల్లి ఫోన్ చేస్తే ఆటో డ్రైవర్ ఆటో ఆపకుండా కిడ్నాప్ చేసి తీసుకువెళ్తున్నాడని అరుస్తూ చెప్పింది. దీంతో భయపడిన తల్లి 100 కిఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. హైదరాబాద్లో దిశ ఘటన అనుభవంతో ఉన్నపోలీసులు వెంటనే పలు బృందాలుగా ఏర్పడి ఫిర్యాదు అందిన కొద్దిసేపట్లోనే అన్నోజిగూడ పరిసర ప్రాంతాల్లో బాలికను రక్షించి జోడిమెట్లలోని క్యూర్ హాస్పటల్ లో చేర్పించి చికిత్స అందించారు.

ఆస్పత్రిలో చేర్పినప్పుడు బాలికపై అత్యాచారం జరగలేదనే విషయం బయటపడింది. బాలిక చెప్పిన వివరాలతో పోలీసులు మొదట కిడ్నాప్, తర్వాత నిర్భయ చట్టం కింద వివిధ సెక్షన్లకింద కేసులు నమోదు చేసివిచారణ చేపట్టారు. సీన్ రీకనస్ట్రక్షన్ లో భాగంగా బాధితురాలు చెప్పిన వివరాలకు, క్షేత్రస్ధాయిలో వాస్తవాలకు విరుధ్దంగా ఉండటం, సీసీటీవీ ఫుటేజీలో బాలిక ఆటోదిగి నడుచుకుంటూ వెళ్లటం వంటివి పోలీసులు కనుగొన్నారు.

రెండో అంశంలో బాలిక చెప్పిన అనుమానిత ఆటో డ్రైవర్ సెల్ పోన్ సిగ్నల్స్ బాలిక దొరికిని అన్నోజిగూడ పరిసర ప్రాంతాల్లో లేకపోవటం…ఆటోకూడా ఘట్ కేసర్ వెళ్లకుండానే యామ్నాంపేట నుంచి తిరగి ఈసీఐఎల్, అక్కడి నుంచి మల్టీప్లెక్స్ ధియేటర్, ఆతర్వాత వైన్ షాపుకు వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజిలో ఆధారాలు దొరికాయి.

పోలీసులు ఈ ఆధారాలు చూపిస్తూ బాలికను ప్రశ్నించటంతో బాలిక కిడ్నాప్, అత్యాచారం డ్రామా ఆడినట్లు ఒప్పుకుంది. ఇంటికి వెళ్లే క్రమంలోనే తల్లి పదే పదే ఫోన్ కాల్స్ చేస్తుండటంతో అబధ్దం ఆడినట్లు ఒప్పకుంది. కరోనా సమయంలో ఆటో చార్జీల విషయంలో ఆటో డ్రైవర్ తో గొడవ పడినందున అతని పేరు చెప్పినట్లు సీపీ కూడా వివరించారు.

వాస్తవానికి ఆ బాలిక ఇంట్లోంచి వెళ్లిపోయేందుకు ఆర్నెల్లక్రితం ఒకసారి కిడ్నాప్ డ్రామా ఆడినట్లు తెలుస్తోంది. మరోసారి ఫిబ్రవరి 10వ తేదీ కూడా తనతోటి విద్యార్ధితో కిడ్నాప్ విషయం మాట్లాడిందని తేలింది. పోలీసులు ఇటీవల కేసును చేధించి విద్యార్ధిని కిడ్నాప్ డ్రామా ఆడటంతో కొంతమంది విమర్శలు చేయటం మొదలెట్టారు.