“Jamunda Official” Gang in instagram : ఓ వర్గం యువతులే టార్గెట్ గా.. రోడ్డుపై యువకుడితో కనిపిస్తే అంతే..

ఇన్స్టా గ్రామ్ వేదికగా “జముండా అఫిషియల్” అనే పేరుతో ఓ ముఠా ఓ వర్గం అమ్మాయిలను టార్గెట్ చేసి వేధింపులకు పాల్పడుతున్నారు. అభ్యకర వీడియోలు, ఫోటోలు తీసి వేధింపులకు పాల్పడుతున్నారు.

“Jamunda Official” Gang in instagram : ఓ వర్గం యువతులే టార్గెట్ గా.. రోడ్డుపై యువకుడితో కనిపిస్తే అంతే..

“Jamunda Official” Gang in instagram

“Jamunda Official” Gang in instagram : హైదరాబాద్‌లో హత్యలు,రేప్ లు..సైబర్ నేరాలు..డ్రగ్స్ మాఫియా, సెక్స్ రాకెట్ ఇలా ఎన్నో నేరాలతో పాటు మరో కొత్త తరహా నేరం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇన్స్టా గ్రామ్ వేదికగా “జముండా అఫిషియల్” అనే పేరుతో కొంతమంది ఓ వర్గం అమ్మాయిలను టార్గెట్ చేసినట్లుగా సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఇన్స్టా గ్రామ్ లో “జముండా అఫిషియల్” అనే అకౌంట్ పేరు ఓ ముఠా.. ఒక వర్గానికి చెందిన యువతులను టార్గెట్ చేస్తు వీడియోలు పోస్ట్ చేస్తోంది.

రోడ్లపై ఎక్కడైనా ఓ యువతి యువకుడితో కనిపిస్తే వీడియోలు తీస్తూ ఇన్స్తా లో పోస్ట్ లు పెడుతున్నారు.సదరు మహిళ పై అభ్యంతర పోస్ట్ లు చేస్తూ.. తమ కమ్యూనిటీనీ డామేజ్ చేస్తున్నారంటూ మహిళకు ట్యాగ్ లైన్ ఇస్తు పోస్ట్ లు చేస్తున్నారు. అబ్బాయిలతో ఉన్న ఫోటోలు పెట్టి అసభ్యకర పోస్టులు పెడుతోంది ఓ ముఠా. ఈ ముఠా ఆగడాలు ఎంతగా ఉన్నాయంటే ఏదో సంఘ సేవ చేస్తున్నట్లుగా 900లమంది కలిసి ఇటువంటి ఘనకార్యాలకు పాల్పడుతున్నారు. 900లమంది యువకులు రోడ్లపై వీడియోలు తీసే పనిలో ఉన్నట్లుగా వెలుగులోకి వచ్చింది. జుముండా అఫిషియల్ ఇన్ స్టా గ్రామ్ లో అకౌంట్ పై మూడు కేసులు నమోదు చేశారు పోలీసులు.

జముండ అఫిషియల్ కు ఇన్ స్టాలో 12 వేల ఫాల్లోవర్లు ఉన్నారు. మొత్తం 900 మంది యువకుల వీడియోలు తీసే పనిలో ఉన్నారని స్టేటస్ పెట్టాడు అడ్మిన్. వీరి ఆగడాలు తట్టుకోలేక పలువురు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఝాముండ పేజ్ పై ఇప్పటివరకు 3 కేసులు నమోదు చేసారు సైబర్ క్రైమ్ పోలీసులు. 506, 509 , 354(d) అండ్ ఐటీ యాక్ట్ (64) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. పేజ్ నిర్వాహకుల పూర్తి డేటా ఇవ్వాలని ఇన్ స్టాగ్రామ్ కు లేఖ రాశారు హైదరాబద్ పోలీసులు.