క్రెడిట్‌ కార్డు లేకున్నా రూ.2లక్షల బిల్లు వచ్చింది, షాక్‌లో బాధితుడు

హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. అతడికి ఓ బ్యాంకు దిమ్మతిరిగే షాక్

  • Published By: naveen ,Published On : June 21, 2020 / 03:06 AM IST
క్రెడిట్‌ కార్డు లేకున్నా రూ.2లక్షల బిల్లు వచ్చింది, షాక్‌లో బాధితుడు

హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. అతడికి ఓ బ్యాంకు దిమ్మతిరిగే షాక్

హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. అతడికి క్రెడిట్ కార్డు బిల్లు వచ్చింది. అది కూడా ఏకంగా రూ.2.20లక్షల బిల్లు వచ్చింది. దీంతో ఆ వ్యక్తికి మైండ్ బ్లాంక్ అయ్యింది. కారణం ఏంటంటే, అసలు ఆ వ్యక్తి దగ్గర క్రెడిట్ కార్డే లేదు. అతడు ఎలాంటి క్రెడిట్ కార్డు వాడడు. వివరాల్లోకి వెళితే, ఎలాంటి క్రెడిట్‌ కార్డులు లేకుండానే రూ.లక్షల్లో క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించాలంటూ ఓ బ్యాంకు అధికారి నుంచి ఫోన్‌కాల్‌ రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

క్రెడిట్ కార్డు బకాయిలు చెల్లించాలని డిమాండ్:
ఆయన పేరు చెన్నకేశవులు. ఎస్సార్‌నగర్‌ లో ఉంటారు. చెన్నకేశవులుకి ఓ ఫోన్ కాల్ వచ్చింది. దాన్ని అతడు లిఫ్ట్ చేశాడు. ఆ పక్క నుంచి ఓ వాయిస్ వినిపించింది. నేను బ్యాంకు అధికారిని మాట్లాడుతున్నా అని చెప్పాడు. మీరు క్రెడిట్‌ కార్డు ద్వారా కొనుగోలు చేసిన రూ.2.20 లక్షలు వెంటనే చెల్లించాలని ఆ వ్యక్తి కోరాడు. దీంతో చెన్నకేశవులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. క్రెడిట్ కార్డు ఏంటి? బిల్లు ఏంటి? కొనుగోలు ఏంటి? అని బిత్తరపోయాడు. అసలు తనకు బ్యాంకు క్రెడిట్‌ కార్డే లేదని స్పష్టం చేశాడు. అయినా అవతలి వ్యక్తి వినిపించుకోలేదు. వెంటనే బకాయిలు చెల్లించాలన్నాడు. లేదంటే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వార్నింగ్ కూడా ఇచ్చాడు. 

పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు:
దీంతో మరింత బిత్తరపోయిన బాధితుడు శనివారం(జూన్ 20,2020) సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు. క్రెడిట్ కార్డు బిల్లు గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకసలు క్రెడిట్ కార్డు లేకున్నా, బిల్లు కట్టాలని ఫోన్ చేసి బెదిరించాడని వాపోయాదు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. అసలు చెన్నకేశవులుకి ఫోన్ చేసింది ఎవరు? అతడు నిజంగా బ్యాంకు అధికారేనా? ఎవరికో చేయాల్సిన కాల్ పొరపాటున చెన్నకేశవులుకి చేశాడా? వీటి గురించి ఆరా తీస్తున్నారు పోలీసులు.

Read: ప్రియుడితో భార్య రాసలీలలు – వద్దన్నందుకు భర్త హత్య