Hyderabad Crime : కొండాపూర్‌లో నిండు గర్భిణి హత్య .. వేటకొడవలితో నరికి చంపిన ఆడపడుచు భర్త

కొండాపూర్ లో నిండు గర్భిణిని దారుణంగా హత్య చేశాడు ఆడపడుచు భర్త. నిండు గర్భిణి అని కూడా చూడకుండా వేటకొడవలితో నరికి చంపిన ఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

Hyderabad Crime : కొండాపూర్‌లో నిండు గర్భిణి హత్య .. వేటకొడవలితో నరికి చంపిన ఆడపడుచు భర్త

Wife Kills Husband With Axe

Hyderabad Crime : హైదరాబాద్ మహానగరంలోని కొండాపూర్ లో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. నిండు గర్భిణిని దారుణంగా హత్య చేసిన ఘటన నగరంలో జరిగింది. నిండు గర్భిణి అని కూడా చూడకుండా వేటకొడవలితో నరికి చంపిన ఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. తన భార్యతో తనపై కేసు పెట్టించారనే కక్షతో విచక్షణ మరిచిన మృతురాలి ఆడపడుచు భర్త ఇంటికొచ్చి వేటకొడవలితో నరికి దారుణంగా హత్య చేశాడు. తన భార్యతో తనపై పోలీసు కేసు పెట్టించారని కక్ష పెంచుకున్న శ్రీరామకృష్ణ అనే వ్యక్తి బావమరిది ఇంట్లో లేకపోయేసరికి ఇంట్లోనే ఉన్న బావమరిది భార్యను నిండు గర్భిణి అని కూడా చూడకుండా పాశవికంగా హత్య చేశాడు.

పోలీసులు తెలిపిన తెలిపిన వివరాల ప్రకారం…రాజమండ్రికి చెందిన చెందిన వి.వెంకట రామకృష్ణ తన భార్య వాసంశెట్టి స్రవంతితో కలిసి కొంతకాలం క్రితం కొండాపూర్‌ ప్రాంతంలోని జేవీ హిల్స్‌ కాలనీ బీఆర్‌ టవర్స్‌ అపార్టుమెంట్‌లో నివసిస్తున్నాడు. వెంకట రామకృష్ణ ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి చైత్ర అనే 10 ఏళ్ల కూతురు ఉంది. భార్య స్రవంతి 8 నెలల గర్భిణి. తన చిన్నమ్మ కుమార్తె లక్ష్మీప్రసన్న వివాహం 2020లో పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం పేరుపాలెం గ్రామానికి చెందిన ఓ ప్రైవేటు సంస్థలో కాంట్రాక్ట్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న కావూరు శ్రీరామకృష్ణకు ఇచ్చి వివాహం జరిపించారు.వీరి వివాహానికి వెంకటరామకృష్ణ మధ్యవర్తిగా వ్యవహరించి వివాహం జరిపించాడు.

భార్య లక్ష్మీప్రసన్నతో విజయవాడలో శ్రీరామకృష్ణ కాపురం పెట్టాడు. కొంతకాలంపాటు వీరి వైవాహిక జీవితం బాగానే సాగింది. తరువాత తరువాత శ్రీరామకృష్ణ కాపురంలో గొడవలు మొదలయ్యాయి. అదనపు కట్నం శ్రీరామకృష్ణ భార్య లక్ష్మీప్రసన్నను వేధించేవాడు. శారీరకంగా..మానసికంగా వేధించేవాడు. దీంతో లక్ష్మీప్రసన్న భర్త వేధింపు భరించలేక పరిస్థితిని తన పుట్టింటివారికి చెప్పింది. దీంతో వెంకట రామకృష్ణ కల్పించుకుని బావకు చాలాసార్లు నచ్చజెప్పాడు. అయినా శ్రీరామకృష్ణ వినలేదు. భార్యను వేధించటం మానలేదు. ఈ వేధింపుల కాపురంపై 2021లో శ్రీరామకృష్ణ గ్రామానికి వెళ్లి అక్కడి పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టాడు. అందరు రామకృష్ణనే తప్పు పట్టారు. దీంతో రామకృష్ణ భార్యపై విరుచుకుపడ్డాడు. ఈ కోపంలో లక్ష్మీప్రసన్నను భర్త దగ్గరకు పంపించటం ఎందుకు కొన్ని రోజులు పోయాక పంపుదామనుకున్నారు. అలా ఆమెను చందానగర్‌లో పుట్టింట్లో ఉంచుకున్నారు. లక్ష్మీ ప్రసన్న కూడా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. అయినా ఆమెను రామకృష్ణ వేధిస్తునే ఉండేవారు. దీంతో లక్ష్మీ ప్రసన్న భర్త వేధింపులపై చందానగర్ పోలీసు స్టేషన్ లో భర్త..అత్తింటివారిపై కేసు పెట్టింది.

చందానగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని శ్రీరామకృష్ణకు నోటీసులు ఇచ్చారు. స్టేషన్ కు వచ్చి కలవమని ఆదేశించారు. దీంతో కక్ష పెంచుకున్న రామకృష్ణ పోలీసుస్టేషన్ లో కేసు పెట్టి మా ఇంటి పరువు తీస్తావా అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు. వెంకటరామకృష్ణే లక్ష్మీ ప్రసన్నతో తమపై కేసు పెట్టించాడని భావించిన వారిపై శ్రీరామకృష్ణ కక్ష పెంచుకున్నాడు. బావమరిదిని హత్య చేయాలనుకున్నారు. హఫీజ్‌పేటలోని ఓ హాస్టల్‌లో ఉంటున్న శ్రీరామకృష్ణ ఎర్రగడ్డలో వేటకొడవలిని కొన్నాడు. సెప్టెంబర్ 6న కొండాపూర్‌లో ఉంటున్న బావమరిది ఇంటికి వెళ్లాడు. అదే సమయంలో బావమరిది తన కుమార్తెను స్కూల్‌ నుంచి తీసుకొచ్చేందుకు బయటకు వెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా గర్భంతో ఉన్న స్రవంతి మాత్రమే ఉంది. రామకృష్ణ చేతిలో వేటకొడవలిని చూసి కేకలు వేస్తూ ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించింది. అంతే శ్రీరామకృష్ణ వేట కొడవలితో ఆమెపై దాడి చేశాడు. నిండు గర్భిణి అని కూడా చూడకుండా ఆమె తల వెనుక భాగం, భుజం మీద దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు.

రక్తపు మడుగులో పడి ఉన్న స్రవంతిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతు మృతి చెందింది. వెంటకరామకృష్ణ ఫిర్యాదు చేయటంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అపార్టుమెంట్‌లో లభించిన సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించిన అతడిని మరుసటి రోజు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.