Hyderabad : లంగర్‌హౌస్ మర్డర్ కేసులో నిందితులు అరెస్ట్

హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీసుస్టేషన్ పరిధిలో ఈనెల 11న జరిగిన హత్య కేసును పోలీసులు చేధించారు. నిందితులను అరెస్ట్ చేశారు.

Hyderabad : లంగర్‌హౌస్ మర్డర్ కేసులో నిందితులు అరెస్ట్

Langar House Murder Case

Hyderabad :  హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీసుస్టేషన్ పరిధిలో ఈనెల 11న జరిగిన హత్య కేసును పోలీసులు చేధించారు. నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు జాంగీర్, అశ్రాఫ్ అనే ఇద్దరూ ఒక పౌల్ట్రీ ఫారం‌లో డిసిఎం డ్రైవర్‌లుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరిద్దరి మధ్య డబ్బుల విషయంలో విభేదాలు వచ్చి జాంగిర్ హత్యకు దారితీసింది.

ఇటీవల డబ్బుల విషయంలో జాంగిర్, అశ్రాఫ్‌ను హెచ్చరించాడు. అశ్రాఫ్ అది మనసులో పెట్టుకొని తన మిత్రులకు… జాంగిర్ నన్ను చంపేస్తా.. అంటున్నాడు అని ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. దీంతో ఆశ్రాఫ్ స్నేహితులు హిమాయత్,షఫీ,అబిబ్‌లు కలిసి జాంగిర్ కు ఫోన్ చేసి చాంద్రాయణగుట్టకు రావలసిందిగా కోరారు. జాంగిర్ సరే అని చెప్పి కొద్దిసేపు తర్వాత లంగర్ హౌస్ పిల్లర్ నెంబర్ 96 వద్ద ఉన్నాను రండి అని చెప్పాడు.

దీంతో వీరు అశ్రాఫ్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి అక్కడికి చేరుకునీ జంగిర్‌తో మాట్లాడుతూ గొడవకు దిగారు. వీరి మధ్య మాట మాట పెరిగి వీరితో తెచ్చుకున్న కత్తితో జాంగిర్‌ను అతి దారుణంగా నరికి చంపారు. నిందితులు నలుగురిని లంగర్ హౌస్ పోలీసులు అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనపరచుకొన్నారు.నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు లంగర్ హౌస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.