Hyderabad Drugs : హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం.. పోలీసుల అదుపులో ముఠా సభ్యులు

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. నగరంలో మరో డ్రగ్స్ ముఠా పట్టుబడింది. ఈజీగా డబ్బులు సంపాదించవచ్చనే ఆలోచనతో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Hyderabad Drugs : హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం.. పోలీసుల అదుపులో ముఠా సభ్యులు

Hyderabad Drugs : హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. నగరంలో మరో డ్రగ్స్ ముఠా పట్టుబడింది. ఈజీగా డబ్బులు సంపాదించవచ్చనే ఆలోచనతో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కూకట్ పల్లి రంగనాముని చెరువు సమీపంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారితో పాటు కొనుగోలు చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు బాలానగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. నిందితుల నుంచి లక్ష రూపాయలు విలువైన 18గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ తో పాటు 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు బాలానగర్ డీసీపీ తెలిపారు.

హైదరాబాద్‌లో తరుచుగా డ్రగ్స్ గుప్పుమనడం కలకలం రేపుతోంది. మాదకద్రవ్యాలు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. స్మగ్లర్లు రెచ్చిపోతూనే ఉన్నారు. ఏదో రకంగా మాదకద్రవ్యాలను నగరానికి తీసుకొస్తున్నారు. యువత టార్గెట్‌ గా డ్రగ్స్ సప్లయ్ జరుగుతోంది. పోలీసులు ఎప్పటికప్పుడు కట్టడి చేస్తున్నా.. స్మగ్లర్లు మాత్రం సైలెంట్‌గా దందా కానిస్తున్నారు.

Also Read..Hyderabad Drugs Case : హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎక్సైజ్ శాఖ చరిత్రలోనే భారీ మొత్తంలో

పోలీసులు ఎంత నిఘా పెట్టినా.. డ్రగ్ మాఫియా రెచ్చిపోతోంది. హైదరాబాద్ కు భారీగా మత్తు పదార్ధాలు స్మగ్లింగ్ చేస్తోంది. ఈ క్రమంలో పోలీసులు నిఘా మరింత పెంచారు. పక్కా సమాచారంతో దాడులు చేస్తున్నారు. డ్రగ్స్ ముఠాల భరతం పడుతున్నారు. డ్రగ్స్ ముఠాల గుట్టు రట్టు చేసి కేటుగాళ్లను జైలుకి పంపుతున్నారు. నిన్నమొన్నటి వరకు విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ హైదరాబాద్ కు తెప్పించిన ముఠాలు ఇప్పుడు రూట్ మార్చి హైదరాబాద్ నుంచే విదేశాలకు సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

నగరంలో నిత్యం ఎక్కడో ఒక చోట డ్రగ్స్ ముఠాలు పట్టుబడుతున్నాయి. ఎంత కట్టడి చేస్తున్నా డ్రగ్స్ ముఠాల ఆగడాలకు అడ్డుకట్ట పడకపోవడం ఆందోళనకు గురి చేసే అంశం. రోజుల వ్యవధిలో కోట్లాది రూపాయల డ్రగ్స్ ను సీజ్ చేశారంటే.. మత్తు పదార్ధాల మాఫియా ఎంతగా బరి తెగిస్తుందో అర్థం చేసుకోవచ్చు.

Also Read..Hyderabad Drugs : ఏం తెలివి..! బ్యాంగిల్స్ మాటున డ్రగ్స్ సప్లయ్ .. హైదరాబాద్‌లో మరో భారీ డ్రగ్ ముఠా అరెస్ట్

డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాలు రూపుమాపేందుకు తెలంగాణ పోలీసులు ప్రత్యేక అధికారులను నియమించి ఎప్పటికప్పుడు ముఠాలను అరెస్ట్ చేస్తున్నారు. అయినా గుట్టు చప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాల నుండి డ్రగ్స్ అక్రమంగా హైదరాబాద్‌కు తరలించి సప్లయ్ చేస్తున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.