Hyderabad Terror Attack Plan : దసరా టార్గెట్‌గా హైదరాబాద్‌లో భారీ విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర

హైదరాబాద్ లో ఉగ్రవాద కుట్ర భగ్నం కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. ఉగ్ర కుట్ర కేసును సిట్.. సీసీఎస్ కు బదిలీ చేయడంతో ఎఫ్ఐఆర్ లో కీలక అంశాలను నమోదు చేసింది సీసీఎస్.

Hyderabad Terror Attack Plan : దసరా టార్గెట్‌గా హైదరాబాద్‌లో భారీ విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర

Hyderabad Terror Attack Plan : హైదరాబాద్ లో ఉగ్రవాద కుట్ర భగ్నం కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. ఉగ్ర కుట్ర కేసును సిట్.. సీసీఎస్ కు బదిలీ చేయడంతో ఎఫ్ఐఆర్ లో కీలక అంశాలను నమోదు చేసింది సీసీఎస్. అబ్దుల్ జాహిద్ ను ఏ-1గా, సమీవుద్దీన్ ను ఏ-2గా, హాజీ హసన్ ను ఏ-3గా ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. అలాగే నిందితులతో పాటు ఏడుగురిపై 1967 యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో ముగ్గురు నిందితులను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ విచారిస్తోంది. ముగ్గురు నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నారు.

దసరా ఉత్సవాలే టార్గెట్ గా హైదరాబాద్ లో ఉగ్రకుట్రకు ప్లాన్ చేశారు నిందితులు. జాహిద్ నేతృత్వంలో భారీ విధ్వంసానికి కుట్ర పన్నారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థకు రిక్రూట్ మెంట్ ప్రయత్నాలు చేశారు. అలాగే లష్కరే తోయిబా ఉగ్రవాది ఘోరీ ఆదేశాల మేరకు హైదరాబాద్ లో కుట్రపన్నినట్లుగా పోలీసులకు సమాచారం ఉంది. అటు నిందితుల పాస్ పోర్టు, బ్యాంక్ లావాదేవీలు తనిఖీ కూడా చేస్తున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఇక బ్యాంకు ఖాతాల నుంచి భారీగా నగదు బదిలీ అయినట్లుగా పోలీసులు గుర్తించారు. అలాగే జాహిద్ కు పాకిస్తాన్ నుంచి భారీగా నిధులు అందినట్లుగా పోలీసులు తేల్చారు. అయితే ఈ నిధులు ఎవరెవరికి వెళ్లాయి? అన్న కోణంలో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. అలాగే జాహిద్ కాల్ లిస్ట్ ను పోలీసులు సేకరిస్తున్నారు. దాని ఆధారంగా ఉగ్రవాద సానుభూతిపరుల వివరాలను రాబడుతున్నారు.

జాహిద్ తో సమావేశం అయిన 9మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే షెడ్యూల్ ప్రకారమే పథక రచన చేసినట్లుగా అనుమానం వ్యక్తమవుతోంది. 2002, 2004, 2009లో దేశవ్యాప్తంగా జరిగిన పేలుళ్లలోనూ జాహిద్ హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే లష్కరే తోయిబా సంస్థ అనుబంధంగా జాహిద్ టీమ్ లో చేరిన వారి వివరాలు సేకరిస్తున్నారు. హైదరాబాద్ లో ఇప్పటికే పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించిన జాహిద్ అండ్ టీమ్.. హ్యాండీ గ్రనేడ్ ను నిర్మానుష్య ప్రాంతంలో ట్రయల్ కూడా చేశారు. వీరికి హ్యాండ్ గ్రనేడ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.