Hyderabad Spa Centres : స్పా ముసుగులో సీక్రెట్‌గా వ్యభిచారం.. గుట్టురట్టు చేసిన పోలీసులు

హైదరాబాద్ లో గుట్టుగా సాగుతున్న వ్యభిచారాన్ని మరోసారి రట్టు చేశారు పోలీసులు. స్పా ముసుగులో సీక్రెట్ గా సాగుతున్న దందాను బట్టబయలు చేశారు. పలువురు నిందితులను అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ పరిధిలోని స్పాలపై పోలీసులు దాడులు చేశారు. వ్యభిచారానికి పాల్పడుతున్న యువతులను అదుపులోకి తీసుకున్నారు.

Hyderabad Spa Centres : స్పా ముసుగులో సీక్రెట్‌గా వ్యభిచారం.. గుట్టురట్టు చేసిన పోలీసులు

Hyderabad Spa Centres : హైదరాబాద్ లో గుట్టుగా సాగుతున్న వ్యభిచారాన్ని మరోసారి రట్టు చేశారు పోలీసులు. స్పా ముసుగులో సీక్రెట్ గా సాగుతున్న దందాను బట్టబయలు చేశారు. పలువురు నిందితులను అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ పరిధిలోని స్పాలపై పోలీసులు దాడులు చేశారు. వ్యభిచారానికి పాల్పడుతున్న యువతులను అదుపులోకి తీసుకున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

హైదరాబాద్ పరిధిలో చాలా రకాల మసాజ్ సెంటర్లు వెలిశాయి. అయితే, కొందరు మాత్రం ఈ స్పా లు, మసాజ్ సెంటర్ల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. మసాజ్ థెరపిస్టుల పేరుతో కొంతమంది యువతులను నియమించుకుని క్రాస్ మసాజ్ కు పాల్పడుతూ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. దీని గురించి పక్కా సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు మెరుపు దాడులు చేశారు.

Also Read..Girl Gang Rape Drama : బాబోయ్.. ప్రియుడిని దక్కించుకునేందుకు గ్యాంగ్ రేప్ డ్రామా ఆడిన యువతి

నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ఈ సెలూన్ అండ్ స్పాలను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. బంజారాహిల్స్ లోని స్పాలో వివిధ ప్రాంతాల నుంచి యువతులను రప్పించి వీరికి మసాజ్ థెరపిస్ట్ అనే పేరు తగిలించి క్రాస్ మసాజ్ కు పాల్పడుతున్నట్లుగా పోలీసుల తనిఖీల్లో వెల్లడైంది. మొత్తం స్పా సెంటర్లను పోలీసులు సీజ్ చేశారు. కొందరు నిర్వాహకులు పోలీసులకు చిక్కగా మరికొందరు పరారీలో ఉన్నారు.

Also Read..Woman Bites Lips : తిక్క కుదిరింది.. అత్యాచారం చేయబోయిన యువకుడి పెదవి కొరికేసిన మహిళ