ఆర్టీసీ బస్సులో కాల్పులు : ఏపీ కానిస్టేబుల్ శ్రీనివాస్ అరెస్ట్

హైదరాబాద్ ఆర్టీసీ సిటీ బస్సులో కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. కాల్పులు జరిపిన వ్యక్తి పోలీస్ డిపార్ట్ మెంటులో పని చేస్తున్నాడు. ఏపీ సెక్యూరిటీ వింగ్ లో

  • Published By: veegamteam ,Published On : May 2, 2019 / 01:29 PM IST
ఆర్టీసీ బస్సులో కాల్పులు : ఏపీ కానిస్టేబుల్ శ్రీనివాస్ అరెస్ట్

హైదరాబాద్ ఆర్టీసీ సిటీ బస్సులో కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. కాల్పులు జరిపిన వ్యక్తి పోలీస్ డిపార్ట్ మెంటులో పని చేస్తున్నాడు. ఏపీ సెక్యూరిటీ వింగ్ లో

హైదరాబాద్ ఆర్టీసీ సిటీ బస్సులో కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. కాల్పులు జరిపిన వ్యక్తి పోలీస్ డిపార్ట్ మెంటులో పని చేస్తున్నాడు. ఏపీ సెక్యూరిటీ వింగ్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న శ్రీనివాస్ గా ఐడెంటిఫై చేశారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా శ్రీనివాస్ ని గుర్తించారు. శ్రీనివాస్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో విధులు నిర్వర్తిస్తున్నాడు. టాస్క్ ఫోర్స్ పోలీసులు శ్రీనివాస్ ను కూకట్ పల్లిలో అదుపులోకి తీసుకున్నారు. బస్సులో కాల్పులు జరిపిన ఘటన నగరంలో కలకలం రేపింది. ఈ కేసుని సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. గంటల వ్యవధిలోనే శ్రీనివాస్ ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

గురువారం (మే 2,2019) సికింద్రాబాద్ నుంచి మణికొండ వెళుతున్న బస్సు (47 L) నెంబర్ AP 28 Z 4468.. పంజాగుట్ట దగ్గరకు రాగానే ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సులో  తోటి ప్రయాణికులతో శ్రీనివాస్ ఘర్షణ పడ్డాడు. బస్సు దిగమన్నందుకు శ్రీనివాస్ కాల్పులకు తెగబడ్డాడు. గన్ నుంచి బయటకు వచ్చిన బుల్లెట్.. బస్సు టాప్ నుండి దూసుకెళ్లింది. ఈ ఘటనతో  బస్సులోని ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళకు గురయ్యారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరక్కపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. శ్రీనివాస్ కాల్పుల వ్యవహారంపై హైదరాబాద్ పోలీసులు ఏపీ డీజీపీ ఠాకూర్ కి సమాచారం ఇచ్చారు. దీనిపై ఆయన ఆరా తీశారు. జనాల మధ్య కాల్పులు జరపడం చాలా పెద్ద నేరం. దీంతో డీజీపీ దీన్ని సీరియస్ గా తీసుకున్నట్టు సమాచారం. కాల్పులు జరిపిన కానిస్టేబుల్ పై కఠిన చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది.