వాట్సప్ వీడియో కాల్స్ తో కిలాడీ లేడీ బ్లాక్ మెయిల్

ఫేస్ బుక్ ద్వారా సంపన్ను కుటుంబానికి చెందిన ఒక యువకుడిని సెలక్ట్ చేసుకుని అతనితో స్నేహం చేసి,డబ్బుల కోసం అతడ్ని బ్లాక్ మెయిల్ చేస్తున్న కిలాడీ లేడీ ఉదంతం హైదరాబాద్ లో వెలుగు చూసింది.

వాట్సప్ వీడియో కాల్స్ తో కిలాడీ లేడీ బ్లాక్ మెయిల్

Hyderabad woman, black mail with whats app video calls : సోషల్ మీడియా వాడకం పెరిగాక చాలా మందికి కొత్త కొత్త ప్రెండ్స్ పరిచయం అవుతున్నారు. ఇందులో వ్యాపారాభివృధ్ది చేసుకునే వాళ్లు కొందరైతే….. విజ్ఞానాన్ని పెంచుకునే వాళ్లు మరి కొందరు. అందుకుతగ్గట్టే సోషల్ మీడియా ప్లాట్ ఫాం లు కుడా చాలా పుట్టుకొచ్చాయి. అలాంటి వాటిలో ఫేస్ బుక్ ఒకటి.

ఫేస్ బుక్ ద్వారా సంపన్ను కుటుంబానికి చెందిన ఒక యువకుడిని సెలక్ట్ చేసుకుని అతనితో స్నేహం చేసి,డబ్బుల కోసం అతడ్ని బ్లాక్ మెయిల్ చేస్తున్న కిలాడీ లేడీ ఉదంతం హైదరాబాద్ లో వెలుగు చూసింది. హైదరబాద్ లో సంపన్నకుటుంబానికి చెందిన యువకుడిని టార్గెట్ చేసి అతనితో స్నేహం చేసింది ఒక మహిళ.

తన స్ధాయికి తగ్గట్టు అతను పోస్టులు పెట్టేవాడు. వాటికి లైక్ లు కామెంట్లు పెట్టి ఒక మహిళ అతడితో పరిచయం పెంచకుంది, అతని ఫోన్ నెంబరు సంపాదించి అతడితో చాటింగ్ చేయటం, మాట్లాడటం మొదలెట్టింది. వాట్సప్ వీడియోకాల్ చేసి అతడ్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతూ ముగ్గులోకి దింపింది. ఈ పరిచయంలో అతడితో న్యూడ్ కాల్స్ చేయటం…. అతడ్ని న్యూడ్ గా ఉండమని కోరటం చేసేది. ఇద్దరూ న్యూడ్ గా ఉన్నప్పటి వాట్సప్ కాల్ ను అతనికి తెలియకుండా రికార్డు చేయటం మొదలెట్టింది.

కొన్నాళ్లకు ఆ వీడియోలను అతనికి పంపించి డబ్బులు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేయటం మొదలెట్టింది. డబ్బులు ఇవ్వకపోతేఈ వీడియోలను అతని భార్యకు, ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ పంపిస్తానంటూ బెదిరించింది. దీంతో భయపడి బాధితుడు మొదట ఆమెకు రూ. 22 వేలు ఇచ్చాడు. మళ్లీ ఫోన్ చేసి లక్షల్లో డబ్బులు కావాలాని అడగటం తో అతను శనివారం మార్చి6 న హైదరాబాద్ లోని సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేశాడు.