ఖాకీ దుస్తులు ధరించిన ఉగ్రవాది: అఫ్జల్ గురు,కశ్మీర్ డీఎస్పీ మధ్య లింక్!

  • Published By: venkaiahnaidu ,Published On : January 16, 2020 / 11:09 AM IST
ఖాకీ దుస్తులు ధరించిన ఉగ్రవాది: అఫ్జల్ గురు,కశ్మీర్ డీఎస్పీ మధ్య లింక్!

కాశ్మీర్‌లో టెర్రరిస్టులతో పోలీస్ అధికారి చేతులు కలిపిన వ్యవహారం సంచలనం రేపుతోంది. డబ్బుల కోసం కక్కుర్తి పడి ఉగ్రవాదులకు సాయం చేసిన డీఎస్పీ దవీందర్ సింగ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గత శనివారం ఉగ్రవాదులతో కలిసి డీఎస్పీ కారులో ప్రయాణిస్తున్న సమయంలో పోలీసు ఉన్నతాధికారులు మాటు వేసి వారిని పట్టుకున్న విషయం తెలిసిందే. డీఎస్పీని అరెస్ట్ చేసిన పోలీసులు కీలక వివరాలను రాబట్టారు. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ సయ్యద్ నవీద్ ముస్తాఖ్, టెర్రరిస్ట్ రఫీని బనిహాల్ టన్నెల్‌ను సురక్షితంగా దాటించేందుకు డీఎస్పీ ఉగ్రవాదులతో 12లక్షల రూపాయలకు డీల్ కుదుర్చుకున్నట్లు విచారణలో తేలింది. రూ.12 లక్షల ఇస్తామనడంతో ఉగ్రవాదులను బనిహాల్ సొరంగాన్ని దాటించేందుకు అతడు సాయం చేశాడని ప్రాథమిక విచారణలో తేలింది. డీఎస్సీ వాహనంలో వెళ్తే ఎవరూ సెక్యూరిటీ సిబ్బంది ఎవరూ ఆపరని స్కెచ్ వేశారు. కానీ తనిఖీల్లో ముగ్గురూ అడ్డంగా దొరికిపోయారు. 

అయితే చాలా కాలం క్రితమే దేవేందర్ పై అరోపణలు వచ్చాయి. ఉగ్రవాదులకు సాయం చేస్తూ కశ్మీర్‌లో పౌరులను హింసిస్తున్నారని 2001లో విమర్శలు వచ్చాయి. అప్పుడే అతడిని అరెస్టు చేయాల్సి ఉండగా.. బదిలీతో సరిపెట్టారు. ఎస్‌ఓజీ డీఎస్పీ స్థాయి నుంచి సెంట్రల్‌ కశ్మీర్‌లో ఇన్‌స్పెక్టర్‌గా మార్చారు. అయితే ఆ తర్వాత దేవేందర్ ఆధ్వర్యంలో అనేక కస్టోడియల్‌ మరణాలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి.

2004లో తీహార్ జైలు నుంచి అప్జల్ గురు తన లాయర్ కు ఓ లేఖ రాశారు. అందులో పార్లమెంట్‌ దాడి జరగడానికి కొన్ని నెలల ముందు ఓ కేసులో దేవేందర్ తనను అరెస్టు చేసి తీవ్రంగా హింసించాడని,ఆ తర్వాత ఓ వ్యక్తిని ఢిల్లీకి రప్పించి అక్కడ అతడికి నివసించే ఏర్పాట్లు చేయాలని దేవేందర్ తనను ఆదేశించాడని అఫ్జల్ గురు తెలిపారు. 2001లో పార్లమెంట్ పై దాడి సమయంలో పోలీసుల కాల్పుల్లో మరణించిన ఒక తీవ్రవాదే దేవేందర్ సూచించిన ఆ వ్యక్తి అని అఫ్జల్ తెలిపారు. పార్లమెంట్‌ దాడి ఘటనలోనే దేవేందర్ సింగ్‌ పేరు చెప్పాడు అఫ్జల్ గురు. అయితే దానికి సరైన ఆధారాలు లేకపోవడంతో.. పోలీసులు దేవేందర్ పై చర్యలు తీసుకోలేకపోయారు. 

అయితే 2006లో పర్వైజ్ బుఖారీ అనే జర్నలిస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దేవేందర్ కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. పార్లమెంట్ దాడికి ముందు నిర్బంధ గృహానికి తీసుకొచ్చిన అఫ్జల్‌ను తీవ్రంగా హింసించినట్లు దేవేందర్ స్వయంగా ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ఆ ఇంటర్వ్యూ విషయాలు ఎక్కడా పబ్లిష్ కాలేదు. అయితే ఆ తర్వాత అరుంధతీ రాయ్ రాసిన ఓ బుక్ లో ఆ ఇంటర్వ్యూ సమాచారం పబ్లిష్ అయింది. అరుధంతీరాయ్ రాసిన The Hanging of Afzal Guru and the Strange Case of the Attack on the Indian Parliament, with an introduction by Arundhati Roy బుక్ లో ఆ ఇంటర్వ్యూ సమాచారం గురించి ఈ విధంగా తెలుపబడింది.

పర్వేజ్ బుకారీ : మొహమ్మద్ అప్జల్ గురు మీకు ఎలా తెలుసు?

దేవేందర్ సింగ్ : ఘాజీ బాబా(2001లో పార్లమెంట్ దాడికి సూత్రధారి,జైషే మొహమ్మద్ టాప్ కమాండర్)కు అప్జల్ గురు టాప్ కొరియర్ అని నాకు ఓ సోర్స్ ద్వారా తెలిసింది. అప్జల్ గురు కోసం వెతికాను కానీ అతడిని పట్టుకోలేకపోయాను. అయితే బారాముల్లా జిల్లాలోని పఠాన్ ఏరియాలో అఫ్జల్ పనిచేస్తున్నాడని నా దృష్టికి రావడంతో పఠాన్ soG(స్పెషల్ ఆపరేషన్ గ్రూప్,జమ్మూకశ్మీర్ పోలీస్ కౌంటర్ ఇన్సర్జెన్సీ వింగ్)
ఇంచార్జ్ డీఎస్పీ వినయ్ గుప్తాను కాంటాక్ట్ చేశాను. ఆయన అప్జల్ గురుని పట్టుకున్నాడు. అప్జల్ ను విచారించిన తర్వాత వినయ్ నాకు నాకు ఫోన్ చేసి…అప్జల్ నుంచి ఎలాంటి సమాచారం రాబట్టలేకపోయానని చెప్పాడు. అప్పుడు నేను అప్జల్ ని విడుదల చేయవద్దు..బుడ్గామ్ జిల్లాలోని హుమ్ హమా దగ్గరున్న నా క్యాంప్ కి పంపించమన్నాను. ఆ విధంగా నాకు అప్జల్ తెలుసు.

పర్వేజ్ బుకారీ : మీ కస్టడీలో ఉన్న సమయంలో ఏం బయటపెట్టాడు?

దేవేందర్ సింగ్  : అప్జల్ ను విచారించాను. చాలా రోజులు నా క్యాంప్ లో ఉంచి టార్చర్ చేశాను. అయితే బుక్స్ లో ఎక్కడా అప్జల్ అరెస్ట్ గురించి రికార్డ్ చేయలేదు. నా క్యాంప్ లో అప్జల్ ని హింసించింది నిజమే. ఆ రోజుల్లో అది ప్రోసీజర్. అప్జల్ ముడ్డిల్ పెట్రోల్ పోశాము. కరెంట్ షాక్ ఇచ్చాము.కానీ వాడి నోటి నుంచి సమాచారం రాబట్టలేకపోయాను. తీవ్రంగా హింసించినప్పటికీ వాడు అసలు నాకు ఏం చెప్పలేదు. 
మేము అతనిని గాజీ బాబా కోసం తగినంతగా హింసించాము. కానీ అతను నోరు విప్పలేదు. ఆ రోజుల్లో అతను ‘భోండు’ లాగా కనిపించాడు, మీరు దీనిని ‘చూత్య’ రకం అని పిలుస్తారు. టార్చర్,ఇంటరాగేషన్, మరియు అనుమానితుల నోట్లో నుంచి నిజం రాబట్టడంలో నాకు ఖ్యాతి ఉంది. నా విచారణ నుండి ఎవరైనా శుభ్రంగా బయటకు వస్తే, మరెవరూ అతన్ని మరలా తాకరు. అతను మొత్తం డిపార్ట్మెంట్  మంచివాడిగా భావిస్తారు.

పర్వేజ్ బుకారీ : అయితే అప్జల్ వదిలేయబడ్డాడా?

దేవేందర్ సింగ్ : మా ఎస్పీ ఆశిక్ హుస్సేన్ బుఖారీ నాకు ఫోన్ చేసిన తర్వాత అఫ్జల్‌ను కలవమని తన సొంత బావ అల్తాఫ్ మరియు అఫ్జల్ సోదరుడు ఐజాజ్ గురులను శిబిరానికి పంపారు. మా ఎస్పీ… ‘మీరు అతన్ని ఏ విధంగానూ నేరాల్లో పాల్గొన్నాడని కనిపెట్టకపోతే, మీరు అతన్ని ఎందుకు విడుదల చేయకూడదు?అని చెప్పారు. అయితే చిత్రహింసల గాయాలను నయం కానివ్వండి,తర్వాత అతడు విడుదల అవుతాడు అని నేను ఎస్పీకి చెప్పాను. అఫ్జల్ టార్చర్ చేసిన కారనంణా బాగా గాయాలపాలయ్యాడు. అతడు గాయాల నుంచి కోలుకున్న తర్వాత పఠాన్ SOG క్యాంప్ కి తిరిగి పంపించారు.  ఆ తర్వాత అక్కడి నుంచి అప్జల్ రిలీజ్ అయ్యాడు.

పర్వేజ్ బుకారీ : అప్జల్ ఆరోపించిన విధంగా ఆ తర్వాత మీకు అతడితో గానీ లేదా అతడి కుటుంబసభ్యులతో కానీ ఏమైనా కాంటాక్ట్ ఉందా?

దేవేందర్ సింగ్ : పఠాన్ కోట్ క్యంప్ కి తిరిగి అప్జల్ ని పంపిన తర్వాత అతడితో ఏరకంగా కాంటాక్ట్ లేదు. ఏమీ లేదు. అప్జల్ గురు తమ్ముడు అయిజాజ్ ని ఒకసారి కలిశాను. మా ఎస్పీ ఒకసారి అయిజాజ్ ను మా క్యాంప్ కి పంపించాడు అప్పుడు అతడిని చూశాను. నాకు అప్జల్ కుటుంబసభ్యులతో ఎప్పుడూ ఎలాంటి కాంటాక్ట్ లేదు.

పర్వేజ్ బుకారీ : ఒక వ్యక్తిని ఢిల్లీకి తీసుకెళ్ళి సహాయం చేయమని మీరు ఒక తారిక్ సమక్షంలో కోరినట్లు అఫ్జల్ తన లేఖలో ఆరోపించారు?

దేవేందర్ సింగ్ : అది అబద్దం. నాకు తారిఖ్ లేదా మొహమ్మద్ తెలియదు. కానీ నాకు వారి గురించి తెలుసు. నేను కౌంటర్ మిలిటెన్సీలో పనిచేస్తున్నప్పటి నుంచి తారిఖ్ మరియు మొహమ్మద్ లు వారి తలపై 5లక్షల రివార్డ్ తో A కేటగిరీ వాంటెడ్ మిలిటెంట్లుగా ఉన్నవాళ్లని తెలుసు. నాకు వాళ్లు తెలిసి లేదా వాళ్లని పట్టుకుంటే వాళ్లని నేను విడుదల చేసి ఉండేవాడినని మీరు అనుకుంటున్నారా? ఇది సంక్షిప్త కథ. వారు ఉగ్రవాదం కోసం పాకిస్తాన్ నుండి ఇక్కడికి వస్తారు. నేను వారిని కలిసినట్లయితే, నేను వారిని వదిలిపెట్టేవాడినని మీరు అనుకుంటున్నారా? అఫ్జల్ క్షమాపణ కోరుకుంటున్నాడు. ఇలాంటి కథను ఇవ్వడం ద్వారా కాశ్మీరీ ప్రజల మరియు భారత ప్రభుత్వం యొక్క సానుభూతిని పొందాలనుకుంటున్నాడు.

పర్వేజ్ బుకారీ : అఫ్జల్ తన లేఖలో వాళ్లు ఉన్నప్పుడు మీరు అతనితో మరియు ఇతర వ్యక్తి మరియు మొహమ్మద్ తో టచ్ లో ఉన్నారని ఆరోపించారు?

దేవేందర్ సింగ్ : అది నిజం కాదు. నా దగ్గర అతని ఫోన్ నెంబర్ ఎప్పుడూ లేదు. అతనిని ఎప్పుడూ ఫోన్ చేయలేదు. నన్ను ఎందుకు అనుమానిస్తున్నారు. అఫ్జల్‌కు లేదా మరే వ్యక్తికి వచ్చిన కాల్స్ అన్నీ మరెవరినుంచైనా వచ్చినవి కావచ్చు. 2000 సంవత్సరంలో అఫ్జల్ ను నా క్యాంప్ నుంచి పఠాన్ క్యాంప్ కి పంపించాం. 2001 ఫిబ్రవరిలో హుమ్ హమా sOG క్యాంప్ నుంచి CIK(కౌంటర్ ఇంటెలిజెన్స్ కశ్మీర్)హరినివాస్ కు నేను ట్రాన్స్ ఫర్ అయ్యాను. నేను హుమ్ హమా
SOG శిబిరంలో ఉన్నప్పుడు, అక్కడ STD డయలింగ్ సౌకర్యం లేదు. నా బదిలీ తర్వాత నేను కూడా ఆ శిబిరాన్ని సందర్శించలేదు. నేను అఫ్జల్‌కు అక్కడి నుండి ఫోన్ చేస్తే దాన్ని ఎవరు ప్రామాణీకరిస్తారు?

పర్వేజ్ బుకారీ : అజ్జల్ ఆరోపించినట్లుగా అతడి విడుదల కోసం మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చారా?

దేవేందర్ సింగ్ : లేదు. నేను డబ్బు తీసుకోవాలనుకున్నా, మా SP గారి  బావమరిది అతని [అఫ్జల్] విడుదలను కోరుతున్నందున నేను తీసుకోలేను. అదే సమయంలో అతని కుటుంబం నుండి మరెవరూ డబ్బు తీసుకోలేదని నేను హామీ ఇవ్వలేను.

పర్వేజ్ బుకారీ : అఫ్జల్ చేసిన ఆరోపణల వెలుగులో, మీరు ఉపయోగించబడి ఉండవచ్చని మీరు అనుకుంటున్నారా?

దేవేందర్ సింగ్ : ఇది నాకు క్లిష్ఠమైన సమయం. నా ఉన్నతాధికారులు నా పేరును క్లియర్ చేస్తారని నేను ఆశిస్తాను. కానీ నా డిపార్ట్మెంట్ నుండి ఇంతవరకు ఎవరూ ముందుకు రాకపోవడం విచారకరం. నేను ఎవరిచేతనైనా కానీ ఉపయోగించబడ్డాను అన్న అనుమానం నాకు ఉన్నప్పటికీ, నేను మౌనంగా ఉండే రకం కాదు. పటాన్ SOG శిబిరానికి తిరిగి అప్పగించిన తరువాత నేను అఫ్జల్ లేదా అతని కుటుంబ సభ్యులతో మాట్లాడలేదు, చూడలేదు లేదా కలుసుకోలేదని నేను పునరుద్ఘాటించాలనుకుంటున్నాను.

పర్వేజ్ బుకారీ : అప్పుడు మీ పేరు అఫ్జల్ లేఖ మరియు అతని భార్య ఖాతాల్లో ఎందుకు ఉంది?

దేవేందర్ సింగ్ : SOG లో పనిచేసినందున నేను బాధితుడిగా ఉన్నాను. చాలా జాతీయవాదంగా ఉన్నందుకు. ప్రతిఫలంగా నేను ఏమి పొందుతున్నాను? చెడ్డ పేరు మరియు కుట్రదారు. ఇది నిజంగా దురదృష్టకరం.  అలాగే, మీతో ఇంటర్వ్యూలో ఉండటానికి, నన్ను విచారించడం ఎవ్వరూ మరచిపోలేరు.

పర్వేజ్ బుకారీ : మీరు అఫ్జల్ లేఖను కూడా చూసారు. చేతివ్రాత మరియు సంతకం అతనిది అని మీరు అనుకుంటున్నారా?

దేవేందర్ సింగ్ : సంతకం అతడిదే అయి ఉండవచ్చు. కానీ చేతిరాత మాత్రం అప్జల్ ది కాదు.  నాకు తెలుసు ఎందుకంటే అతను వేరేవాళ్ల పిల్లలకు బోధిస్తున్నప్పుడు అతడి చేతిరాతను నేను చూశాను. అదంతా సృష్టించబడినది.

పర్వేజ్ బుకారీ : మీరు దాన్ని జాగ్రత్తగా చూశారా?

దేవేందర్ సింగ్ : అవును.నిస్సందేహంగా

పర్వేజ్ బుకారీ : మీరు అఫ్జల్ ని హ్యాండిల్ చేశారు. పార్లమెంట్ దాడిలో అతడు ఇన్వాల్వ్ అయ్యే విధమైన వ్యక్తి అని మీరు అనుకుంటున్నారా?

దేవేందర్ సింగ్ : ఓ వ్యక్తిని అక్కడికి తీసుకెళ్లి వారికి సహాయం చేశాను అని అతడు చెబుతూ ఉన్నాడు. కారు కొనడానికి వాళ్లకి సహాయం చేశాను అంటూ చెప్తున్నాడు. తను ఎందుకు ఇలా చేసాడు అనేది అతనికి బాగా తెలుసు. అతను మన చేత బంధించబడినప్పుడు ఇవన్నీ బయటికొచ్చి ఉండేవి. అతను దానిని తెలుసుకోలేడు.