Fake Videos : ఆ వీడియోలు, ఆడియోలు, ఫొటోలు మీరూ షేర్ చేస్తున్నారా? అయితే జైలుకే..

నైట్ కర్ఫ్యూ ఇలా మొదలైందో లేదో అప్పుడే ఫేక్ వీడియోలు, ఆడియో క్లిప్పులు, పిక్స్.. వైరల్ గా మారాయి. నైట్ కర్ఫ్యూ తొలి రోజు నుంచే పోలీసులు కొడుతున్నారంటూ.. చాలామంది వివిధ ఆడియోలు, వీడియో క్లిప్స్, ఫొటోలు షేర్ చేస్తున్నారు. అవి నిజమో కాదో తెలుసుకోకుండా ఇతరులు వాటిని గుడ్డిగా ఫార్వర్డ్ చేస్తున్నారు. మీరు ఇలాగే చేస్తున్నారా? అయితే బీ కేర్ ఫుల్.. జైలుకి వెళ్లాల్సి ఉంటుంది.

Fake Videos : ఆ వీడియోలు, ఆడియోలు, ఫొటోలు మీరూ షేర్ చేస్తున్నారా? అయితే జైలుకే..

Fake Videos

Fake Videos telangana night curfew: తెలంగాణలో కరోనా కట్టడికి ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఆ సమయంలో అంతా ఇంట్లోనే ఉండాలి. ఎవరూ బయటకు రాకూడదు. అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.

నైట్ కర్ఫ్యూ ఇలా మొదలైందో లేదో అప్పుడే ఫేక్ వీడియోలు, ఆడియో క్లిప్పులు, పిక్స్.. వైరల్ గా మారాయి. నైట్ కర్ఫ్యూ తొలి రోజు నుంచే పోలీసులు కొడుతున్నారంటూ.. చాలామంది వివిధ ఆడియోలు, వీడియో క్లిప్స్, ఫొటోలు షేర్ చేస్తున్నారు. అవి నిజమో కాదో తెలుసుకోకుండా ఇతరులకు వాటిని గుడ్డిగా ఫార్వర్డ్ చేస్తున్నారు. మీరూ ఇలాగే చేస్తున్నారా? అయితే బీ కేర్ ఫుల్.. జైలుకి వెళ్లాల్సి ఉంటుంది.

ఇలాంటి ఫేక్ వార్తలు క్రియేట్ చేసే వారిపైన, షేర్ చేసే వారిపైన సైబర్ క్రైమ్ పోలీసులు ఫోకస్ పెట్టారు. కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అలాంటి వ్యక్తులపై ప్రత్యేక నిఘా పెట్టారు. కరోనా సహా వివిధ అంశాలపై వదంతులు, ఫేక్ వార్తలు క్రియేట్ చేయడమే కాదు వాటిని షేర్ చేయడమూ నేరం కింద పరిగణించనున్నారు.

సోషల్ మీడియా పుణ్యమా అని.. అంతా కన్ ఫ్యూజన్ గా ఉంది. ఏది నిజమో ఏది అబద్దమో తెలుసుకోవడం కష్టంగా మారింది. అది ఫేక్ అని తెలిసేసరికి ఆ వార్త వైరల్ అవుతోంది. ఈ మధ్య కాలంలో ఈ తరహా ఘటనలు అనేకం జరుగుతున్నాయి. సోషల్ మీడియా యూజర్లు.. తమకు వచ్చే వీడియోలు, ఫొటోలు, వార్తలు.. నిజనిర్ధారణ చేసుకోకుండానే గుడ్డిగా నమ్మేసి షేర్ చేస్తున్నారు. ఆ తర్వాత చిక్కుల్లో పడుతున్నారు. అందుకే, ఏదైనా షేర్ చేసే ముందు ఒకటికి పదిసార్లు క్రాస్ చెక్ చేసుకోవడం మంచిదని పోలీసులు అంటున్నారు.