IIT Madras : ఐఐటీ మద్రాస్ లో మహిళా స్కాలర్ పై వేధింపులు

మద్రాస్ ఐఐటీలో ఒక  ఎస్సీ  మహిళా రీసెర్చ్ స్కాలర్ పై నాలుగేళ్లుగా జరుగుతున్న వేధింపుల పర్వం వెలుగుచూసింది. అడ్మినిస్ట్రేటివ్  విభాగానికి ఎన్ని సార్లు ఫిర్యాదుచేసినా నిందితులను అరెస్

IIT Madras : ఐఐటీ మద్రాస్ లో మహిళా స్కాలర్ పై వేధింపులు

IIT Madras : మద్రాస్ ఐఐటీలో ఒక  ఎస్సీ  మహిళా రీసెర్చ్ స్కాలర్ పై నాలుగేళ్లుగా జరుగుతున్న వేధింపుల పర్వం వెలుగుచూసింది. అడ్మినిస్ట్రేటివ్  విభాగానికి ఎన్ని సార్లు ఫిర్యాదుచేసినా నిందితులను అరెస్ట్ చేయకపోవటం పై విమర్శలు వెల్లువెత్తాయి.

2016 లో  ఐఐటీలో రీసెర్చ్‌ స్కాలర్‌గా చేరిన మహిళపై తోటి స్కాలర్‌ పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ సమయంలో ఫొటోలు తీశాడు. అతనికి ఇద్దరు ప్రొఫెసర్లుమద్దతిచ్చి ప్రోత్సహించారు.   కూర్గ్ పర్యటనకు వెళ్లినప్పుడు మహిళను శారీరకంగా మానసికంగా హింసించారు.   మహిళ ల్యాబ్ పరికరాలు వాడుకోనీయకుండా అడ్డం పడటం… పరిశోధన చేయనీయకుండా అడ్డుతగిలారు.

దారుణంగా ఆమెను దుర్భాషలాడారు. 2018, 2019లో జరిగిన అవమానాలను భరించిన ఆమె,  ఆతర్వాత  ఫిర్యాదు చేయటానికి సిధ్దపడి 2020లో ఫిర్యాదు చేసింది. దాంతో లైంగిక వేధింపుల  ఫిర్యాదుల అంతర్గత కమిటీ దర్యాప్తుకు ఆదేశించింది. ముగ్గురు సహచర విద్యార్థులు, ఒక ప్రొఫెసర్‌ ఆమెపట్ల అనుచితంగా ప్రవర్తించారని కమిటీ తేల్చింది.
Also Read : Instagram : భర్త అనుకుని సోషల్ మీడియాలో చాటింగ్…ప్రైవేట్ ఫోటోలు అడిగే సరికి…!
జాతీయ మహిళా కమిషన్‌ ఆదేశాలతో గతేడాది మైలాపూర్‌ మహిళా పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు ఎఫ్ఐఆర్ లో 8మంది పేర్లు నమోదు చేశారు. బాధితురాలు  పీహెచ్‌డీ  పూర్తి చేసి, ఆమెకు న్యాయం జరిగేదాకా నిందితుల పీహెచ్‌డీ  పూర్తి కాకుండా చూడాలని కమిటీ సిఫార్సు చేసింది.