Jammukashmir Encounter: నలుగురు ఉగ్రవాదులను మట్టుపెట్టిన భద్రతా దళాలు

భారత భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్‌లలో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు జమ్మూకాశ్మీర్ పోలీసులు శనివారం తెలిపారు.

Jammukashmir Encounter: నలుగురు ఉగ్రవాదులను మట్టుపెట్టిన భద్రతా దళాలు

Kahsmir Police

Jammukashmir Encounter: జమ్మూ కాశ్మీర్‌లో భారత భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్‌లలో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు జమ్మూకాశ్మీర్ పోలీసులు శనివారం తెలిపారు. రాష్ట్రంలోని కుప్వారా జిల్లాలోని హంద్వారా వద్ద మరియు పుల్వామా, గందర్వాల్ జిల్లాల్లో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లలో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు చెందిన నలుగురు ఉగ్రవాదులు హతమవగా మరొకరు సజీవంగా పడ్డుబడ్డాడు.

Also read: H.M Amit Shah: సీబీఐ, ఎన్ఐఏ, ఎన్సీబీలు కూడా నేరాల డేటాబేస్‌లో చేరాలి: కేంద్ర హోంమంత్రి అమిత్ షా

పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో జైషే మహ్మద్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు, హమద్వారా, గందర్‌బల్‌లలో జరిగిన ఎన్కౌంటర్లలో లష్కరే తొయిబాకు చెందిన మరో ఇద్దరు హతమయ్యారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది సజీవంగా పట్టుబడ్డాడు. పుల్వామాలో, చేవల్‌కలన్ గ్రామంలో ఉగ్రవాదులు నక్కివున్నారన్న సమాచారంతో శుక్రవారం సాయంత్రం జమ్మూకాశ్మీర్ పోలీసులు, భారత భద్రతా దళాలు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించారు. “ఇందులో ఇప్పటివరకు ఇద్దరు జైష్ ఉగ్రవాదులు హతమయ్యారు, కుప్వారాలోని హంద్వారా ప్రాంతంలోని రాజ్‌వార్ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో మరొక ఉగ్రవాది హతమయ్యాడు. గందర్‌బాల్‌ ఎన్‌కౌంటర్‌లో నాలుగో ఉగ్రవాది హతమయ్యాడు” అని జమ్మూ కాశ్మీర్ ఐజీపీ శనివారం ఉదయం ట్విటర్ ద్వారా వెల్లడించారు.

Also read: Kamal Haasan : అరవింద్ కేజ్రీవాల్‌తో కమల్‌హాసన్ మీటింగ్.. తమిళ రాజకీయాల్లో నెలకొన్న ఆసక్తి..

కాశ్మీర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, విజయ్ కుమార్ తెలిపిన వివరాలు మేరకు శుక్రవారం సాయంత్రం 4-5 గంటల సమయంలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు ప్రారంభించారు. చేవల్‌కలన్ గ్రామంలో జరిగిన ఎన్కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందగా వారిలో ఒకరిని పాకిస్థాన్ బలపరిచిన జేఈఎం కమాండర్ కమాల్ భాయ్ గా గుర్తించారు. ఇతడు 2008 నుంచి చురుకుగా ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా కుల్గామ్ జిల్లా అదురా గ్రామ సర్పంచ్ షబీర్ అహ్మద్ మీర్ ను రెండు రోజుల క్రితం ఉగ్రవాదులు అతికిరాతకంగా హతమార్చారు. గత కొన్ని రోజులుగా కాశ్మీర్ లోయ పరిధిలో సాధారణ పౌరులను ఉగ్రవాదులు టార్గెట్ చేసుకున్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఉగ్రవాదుల ఏరివేతపై భద్రతా దళాలు మరింత ముందుకు సాగుతున్నాయి.