ప్రియాంక హత్యపై ఫేస్ బుక్ లో అనుచిత వ్యాఖ్యలు : వ్యక్తిపై కేసు  

వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యోదంతంపై ఫేస్ బుక్ లో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై మూడు కమిషనరేట్ల పరిధిలో కేసు నమోదు అయింది.

  • Published By: veegamteam ,Published On : December 1, 2019 / 06:09 AM IST
ప్రియాంక హత్యపై ఫేస్ బుక్ లో అనుచిత వ్యాఖ్యలు : వ్యక్తిపై కేసు  

వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యోదంతంపై ఫేస్ బుక్ లో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై మూడు కమిషనరేట్ల పరిధిలో కేసు నమోదు అయింది.

వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యోదంతంపై ఫేస్ బుక్ లో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై మూడు కమిషనరేట్ల పరిధిలో కేసు నమోదు అయింది. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆ వ్యక్తి కోసం సైబరాబాద్ పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు ఇలాంటి వ్యక్తిని నడిరోడ్డుపై ఉరితీయాలంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్ లు వైరల్ గా మారుతున్నాయి. 

యావత్తుదేశం ప్రియాంక హత్యాచార ఘటను ఖండిస్తూ, ఆమె కుటుంబానికి బాసటగా నిలిస్తే, ఫేస్ బుక్ ట్విట్టర్ లో స్మైలీ నాని అనే పేరుతో ఉన్న వ్యక్తి ఈ ఘటనపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక హత్యను ఖండిస్తూ, కటుంబానికి సానుభూతి ప్రకటిస్తూ పెట్టిన పోస్టులకు రివర్స్ పోస్టులు పెట్టాడు. నలుగురు దుండగులు చేసిన చర్యను సమర్థించడమే కాకుండా మహిళలపైకూడా అగౌరవంగా మాట్లాడుతూ పెట్టిన పోస్టింగ్ లపై సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతుంది. అతను కనిపిస్తే నలుగురు నిందితుల కంటే ముందుగా అతన్ని నడిరోడ్డుపై ఉరితీయాలంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

అతను ఉపయోగించిన వొల్గర్ ల్యాంగేజ్, కామెంట్స్ చూసిన వ్యక్తులు సోషల్ మీడియాలో అతనిపై విరుచుకుపడుతున్నారు. పోలీసు స్టేషన్ లో అతనిపై కేసు నమోదు అయింది. సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి, అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అతన్ని తప్పకుండా పట్టుకుంటామని చెబుతున్నారు. యావత్తు దేశం ప్రియాంక రెడ్డికి మద్దతుగా నిందితులను ఉరితీయాలని డిమాండ్ చేస్తుంటే.. హేయమైన కామెంట్స్ పెట్టిన వ్యక్తిని పట్టుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.