Tamil Film Industry : తమిళ సినీ నిర్మాతల ఇళ్లపై ఐటీ దాడులు

తమిళ చలన చిత్ర రంగానికి చెందిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్షియర్ల  ఇళ్లలో ఆదాయపన్ను శాఖ ఈరోజు సోదాలు నిర్వహిస్తోంది.

Tamil Film Industry : తమిళ సినీ నిర్మాతల ఇళ్లపై ఐటీ దాడులు

Tamil Film Industry :  తమిళ చలన చిత్ర రంగానికి చెందిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్షియర్ల  ఇళ్లలో ఆదాయపన్ను శాఖ ఈరోజు సోదాలు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో సుమారు 40 ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. పన్నుఎగవేత కేసులో ఈసోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పది మంది ప్రముఖ నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్షియర్లు  కూడా ఈ జాబితాలో ఉన్నారు.

కలైపులి థ‌ను, ఎస్ఆర్ ప్ర‌భు, అన్బు చెచియాన్‌, జ్ఞాన‌వేల్ రాజా ఇండ్ల‌పై ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు సోదాలు నిర్వ‌హిస్తున్నారు. ఇవాళ ఉద‌యం 6 గంట‌ల నుంచి సెర్చ్ ఆప‌రేష‌న్ మొద‌లైంద‌ని అధికారులు తెలిపారు. అక్ర‌మ ఆస్తుల్ని సీజ్ చేస్తున్నారు.

ప్రధానంగా కోలీవుడ్ టాప్ పైనాన్షియర్ జీఎన్ అన్బు చెచియాన్ లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మధురైలోని 40 ప్రాంతాలు, చెన్నైలోని 10 ప్రాంతాలలో ఐటీ శాఖ దాడులు చేసింది. అన్బు చెచియాన్ కు చెందిన ఇళ్లు ఆఫీసులు, అతని వద్ద ఫైనాన్స్ తీసుకున్న నిర్మాతల ఇళ్లు ఆఫీసులలో ఈ సోదాలు జరుగుతున్నాయి. అన్బు చెచియాన్ ఇంటిపై ఐటీ శాఖ దాడులు చేయటం ఇది మూడోసారి.

2020 ఫిబ్రవరిలో నటుడు విజయన్ నటించిన బిగిల్ విడుదలైన తర్వాత చెన్నై లోని అన్బు చెచియాన్ ఇంటిపై ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించి రూ.65 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఆసమయంలో నటుడు విజయ్,నిర్మాత కళాపతి అఘోరం ఇళ్లలోనూ ఐటీ దాడులు జరిగాయి. తమిళంలో అధిక శాతం విజయవంతమైన చిత్రాలకు అన్బు చెచియాన్ ఫైనాన్స్ చేస్తున్నారు.

కాగా…. 2017 లో అన్బుచెచియాన్ వద్ద పైనాన్స్ తీసుకున్న అశోక్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇంతకు ముందు తన వద్ద ఫైనాన్స్ తీసుకున్న పలువురు నిర్మాతలు దర్శకులను అన్బు చెచియాన్ వేధించినట్లు వార్తలు వచ్చాయి. అన్బు చెచియాన్ నుండి తీసుకున్న పైనాన్స్ కు సంబంధించిన వివరాలు ఇవ్వాలని పలువురు ప్రముఖ నిర్మాతలకు ఆదాయపన్నుశాఖ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది.