హైదరాబాద్ లో మహిళ పట్ల అసభ్య ప్రవర్తన.. ఇద్దరిపై కేసు నమోదు

హైదరాబాద్ లో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరిపై కేసు నమోదు అయింది. కూతురితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు వ్యక్తులపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Edited By: veegamteam , January 28, 2020 / 02:27 AM IST
హైదరాబాద్ లో మహిళ పట్ల అసభ్య ప్రవర్తన.. ఇద్దరిపై కేసు నమోదు

హైదరాబాద్ లో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరిపై కేసు నమోదు అయింది. కూతురితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు వ్యక్తులపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

హైదరాబాద్ లో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరిపై కేసు నమోదు అయింది. కూతురితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు వ్యక్తులపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ జిల్లాకు చెందిన మహిళ (35) భర్తతో కలిసి బంజారాహిల్స్‌ రోడ్‌ నం.11, గౌరీశంకర్‌నగర్‌లో నివాసం ఉంటుంది. జనవరి 25వ తేదీ రాత్రి ఏడేళ్ల వయస్సున్న కూతురుతో కలిసి స్నేహితురాలి ఇంటికి వెళ్లి.. తిరిగి ఇంటికి వస్తుంది. 

ఈక్రమంలో బంజారాహిల్స్‌ రోడ్‌ నం. 13లో వెనక నుంచి స్కూటీపై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను అడ్డగించి.. చేయి పట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించారు. వారిలో ఒకరు ఆమె చేతిలోని సెల్‌ఫోన్‌ లాక్కుని నెంబర్‌ డయల్‌ చేసుకోగా, మరో వ్యక్తి బాలికను బైక్‌పై ఎక్కించుకుని తీసుకువెళ్లాడు. ఆమె కేకలు వేయడంతో ఆమెను వదిలి పరారయ్యాడు. 

ఇంటికి వచ్చి చూడగా కూతురిని ఇంటివద్ద దింపి వెళ్లినట్లు తేలింది. ఈ ఘటనపై బాధితురాలు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.