మిస్టరీ ఏంటీ : ఎన్నారై డెంటిస్ట్ ప్రీతిరెడ్డి హత్య.. ఆ తర్వాత అతను కూడా

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఆదివారం ఉదయం  అకస్మాత్తుగా మాయమైన భారత సంతతికి చెందిన డెంటిస్ట్ ప్రీతిరెడ్డి(32) శవమై కన్పించింది.

10TV Telugu News

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఆదివారం ఉదయం  అకస్మాత్తుగా మాయమైన భారత సంతతికి చెందిన డెంటిస్ట్ ప్రీతిరెడ్డి(32) శవమై కన్పించింది.

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఆదివారం(మార్చి-3,2019) ఉదయం  అకస్మాత్తుగా మాయమైన భారత సంతతికి చెందిన డెంటిస్ట్ ప్రీతిరెడ్డి(32) శవమై కన్పించింది. తూర్పు సిడ్నీలోని కింగ్స్ ఫోర్డ్ లోని స్ట్రాచన్ స్ట్రీట్ లో పార్క్ చేసి ఉన్న ఆమె కారులోనే మంగళవారం(మార్చి-5,2019) రాత్రి 9:30గంటల సమయంలో శరీరంపై కత్తిపోట్లతో సూట్ కేసులో కుక్కి ఉన్న  ప్రీతి రెడ్డి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆమె శరీరంపై చాలా కత్తి పోట్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ప్రీతి రెడ్డి మాజీ ప్రియుడు హర్ష్ నర్డేకూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని బుధవారం న్యూ సౌత్వేల్స్ పోలీసులు తెలిపారు.
Also Read : ఎట్టా ఇచ్చారు : ఆకాశంలో భూమి.. నకిలీ మనుషులు.. రూ.2 కోట్ల బ్యాంక్ లోన్

అతడు ఉద్దేశ్యపూర్వకంగానే తన కారుని యాక్సిడెంట్ కు గురిచేసుకున్నట్లు తెలిపారు.పెన్ రిత్ లో దంతవైద్యురాలిగా పనిచేస్తున్న ప్రీతి రెడ్డి.. సెయింట్ లియోనార్డ్స్ లో జరిగే డెంటల్ కాన్ఫరెన్స్ లో పాల్గొనేందుకు కారు డ్రైవ్ చేసుకుని వెళ్లింది.ఆదివారం ఆమె మాజీ ప్రియుడితో కలిసి సీబీడీలోని మార్కెట్‌ స్ట్రీట్‌లోని ఓ హోటల్‌లో దిగారు.

ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో తన తల్లిదండ్రులతో మాట్లాడిన ప్రీతి రెడ్డి.. బ్రేక్ ఫాస్ట్ తర్వాత ఇంటికి వస్తానని చెప్పింది. ఉదయం 2:15గంటల సమయంలో జార్జి స్ట్రీట్ లోని మెక్ డొనాల్డ్స్ లోని లైన్ లో ఆమె నిలబడి ఉన్నట్లు సీసీ పుటేజిలో కనిపించింది. ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను కాంటాక్ట్ చేశారు. 24 గంటలు ఆమె ఆచూకీ దొరకలేదు.
Also Read : దబిడిదిబిడే : బాలకృష్ణనే అడ్డుకున్న మహిళలు

36 గంటల తర్వాత తన కారులోనే శవంగా కనిపించటం సంచలనంగా మారింది. ప్రీతి రెడ్డి హత్య వెనక ఆమె మాజీ ప్రియుడి హస్తమున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. లేక హత్యలో వేరే కోణాలు ఉన్నాయా అనే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.