జైపూర్ జైల్లో దారుణం : పాక్ ఖైదీని రాళ్లతో కొట్టి చంపారు

  • Published By: venkaiahnaidu ,Published On : February 20, 2019 / 12:12 PM IST
జైపూర్ జైల్లో దారుణం : పాక్ ఖైదీని రాళ్లతో కొట్టి చంపారు

జైపూర్ సెంట్రల్ జైల్లో దారుణం జరిగింది.  పుల్వామా దాడికి నిరసనగా  జైల్లో శిక్ష అనుభవిస్తున్న పాక్ కి చెందిన ఓ ఖైదీని తోటి భారత ఖైదీలు  దారుణంగా హింసించి చంపిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశమైంది.గూఢచర్యానికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో అరెస్ట్ అయిన పాకిస్తాన్ లోని సియల్కోట్ కి చెందిన షకిరుల్లా జైపూర్ సెంట్రల్ జైళ్లో శిక్ష అనుభవిస్తున్నాడు.  పుల్వామా దాడికి నిరసనగా బుధవారం(ఫిబ్రవరి-20,2019)  ఇద్దరు భారతీయ ఖైదీలు షకిరుల్లాని మొదట దారుణంగా హింసించి, ఆ తర్వాత రాళ్లతో కొట్టి చంపినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి జరిగిన రోజే షకిరుల్లాని చంపాలని వారు ప్రయత్నించినట్లు సమాచారం.  

పుల్వామా ద్వాడిని ఖండిస్తూ తమను కూడా పాక్ పై యుద్ధానికి పంపాలంటూ రెండు రోజుల క్రితం ప్రధానికి భారత జైళ్లల్లో శిక్షను అనుభవిస్తున్న కొందరు ఖైదీలు లేఖ రాసిన విషయం తెలిసిందే.  మే-21,2008లో జరిగిన భారత్-పాక్ ల మధ్య జరిగిన దౌత్య ఒప్పందం ప్రకారం…మంగళవారం(ఫిబ్రవరి-19,2019) పాక్ జైళ్లల్లో శిక్ష అనుభవిస్తున్న  537మంది భారతీయ ఖైదీల లిస్ట్ ను పాక్ ప్రభుత్వం ఇస్లామాబాద్ లోని భారత హైకమీషన్ కు అందజేసింది. వీరిలో 483మంది మత్స్యకారులు, 54 మంది సివిలియన్స్ ఉన్నారని ఫారిన్ ఆఫీస్(FO)ఓ ప్రకటనలో తెలిపింది.