కారు కోసం కొడుకు డ్రామా : నాన్న.. నేను కిడ్నాప్ అయ్యా.. రూ.3 కోట్లు ఇవ్వు

నాన్న.. నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు.. అమ్మ నన్ను కాపాడండి.. రూ.3 కోట్లు ఇస్తేగానీ నన్ను వదిలిపెట్టరంట. వెంటనే డబ్బులు పంపి నన్ను ఈ కిడ్నాపర్ల నుంచి విడిపించండి..

  • Published By: sreehari ,Published On : April 4, 2019 / 08:19 AM IST
కారు కోసం కొడుకు డ్రామా : నాన్న.. నేను కిడ్నాప్ అయ్యా.. రూ.3 కోట్లు ఇవ్వు

నాన్న.. నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు.. అమ్మ నన్ను కాపాడండి.. రూ.3 కోట్లు ఇస్తేగానీ నన్ను వదిలిపెట్టరంట. వెంటనే డబ్బులు పంపి నన్ను ఈ కిడ్నాపర్ల నుంచి విడిపించండి..

నాన్న.. నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు.. అమ్మ నన్ను కాపాడండి.. రూ.3 కోట్లు ఇస్తేగానీ నన్ను వదిలిపెట్టరంట. వెంటనే డబ్బులు పంపి నన్ను ఈ కిడ్నాపర్ల నుంచి విడిపించండి.. తల్లిదండ్రులకు ఫోన్ చేసిన 19ఏళ్ల కుర్రాడి కిడ్నాప్ డ్రామా స్టోరీ ఇది. సాధారణంగా సినిమాల్లో ఇలాంటి సీన్లు ఎన్నో చూస్తుంటాం. ఈ కుర్రాడు కూడా ఇదే ఫాలో అయ్యాడేమో.. కిడ్నాప్ డ్రామా ప్లే చేశాడు. కన్నతల్లిదండ్రులను బ్లాక్ మెయిల్ చేయాల్సిన అంత అవసరం అతడికి ఏమి ఉంటుందనేగా మీ డౌట్.. ఇంతకీ ఈ కుర్రాడు కిడ్నాప్ డ్రామా ఎందుకు ఆడాల్సి వచ్చిందో తెలిస్తే షాక్ అవుతారు? మీరే కాదు విచారించిన పోలీసులు, అతడి తల్లిదండ్రులు కూడా షాక్ అయ్యారు. కిడ్నాప్ డ్రామా.. లగ్జరీ కారు కోసమటా? ఖరీదైన కారు కొనాలనే కలను ఈ కిడ్నాప్ డ్రామాతో నెరవేర్చుకోవాలనుకున్నాడు. కానీ, కథ అడ్డం తిరిగింది. ఫేక్ కిడ్నాప్ అని తేలిపోయింది. గూర్గావ్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.

అసలేం ఏం జరిగిందంటే.. గుర్గావ్ లోని క్రిష్ణా కాలనీకి చెందిన సందీప్ కుమార్ (19) ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీలో చేరగానే.. కోరినట్టు తల్లిదండ్రులు బైక్ కొనిచ్చారు. ఆ బైక్ మీదనే కాలేజీకి వెళ్తున్నాడు. ఇప్పుడు సందీప్ మనస్సులో కారు కొనాలే కోరిక బలంగా ఉంది. లగ్జరీ కారు కొనాలి? ఇంట్లో చెబితే కారు కొంటారో లేదో? అని తెగ ఆలోచించాడు. అప్పుడే పుట్టింది కిడ్నాప్ ఆలోచన. ఇలా అయితే తన కోసమైన డబ్బులు తెచ్చి ఇస్తారని అనుకున్నాడు. ముందుగా ప్లాన్ ప్రకారం.. క్రికెట్ అకాడమీకి వెళ్తున్నానంటూ మార్చి 29న ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. అప్పటి నుంచి కనిపించకుండా పోయాడు. కంగారుపడిన తల్లిదండ్రులు స్నేహితులను, బంధువులను ఆరా తీశారు. ఫలితం లేకపోవడంతో చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు సందీప్ కోసం విచారణ చేపట్టారు. ఇదే సమయంలో సందీప్.. ఓ వ్యక్తికి రూ.500 ఇచ్చి తన ఇంటికి ఫోన్ చేసి తనను కిడ్నాప్ చేసినట్టుగా చెప్పమన్నాడు. సందీప్ సోదరుడు నవీన్ కుమార్ కు ఫోన్ కాల్ చేయించి తాను కిడ్నాప్ అయినట్టుగా తల్లిదండ్రులను నమ్మించాడు. కొన్నిరోజుల పాటు భివాడీ ప్రాంతంలో ఉన్నాడు. ఆ తర్వాత తన మోటార్ సైకిల్ మీద సెక్టార్ 5 వరకు వెళ్లి అక్కడ ఓ టెంపుల్ దగ్గర ఆగాడు. అక్కడే తన బైక్ ను వదిలేశాడు. ఇక్కడే తనను కిడ్నాపర్లు కిడ్నాప్ చేసినట్టు డ్రామా ప్లే చేశాడు. రూ.3 కోట్లు ఇస్తేగానీ తనను వదిలిపెట్టరంటూ కట్టు కథలు అల్లినట్టు విచారణలో గూర్గవ్ పోలీసు పీఆర్ఓ సుభాష్ బొకన్ వెల్లడించాడు.

కిడ్నాప్ డ్రామా అనంతరం.. గూర్గావ్ కు సందీప్ తిరిగి వస్తుండగా.. ట్రాఫిక్ పోలీసు గుర్తించి అతడ్ని పట్టుకున్నాడు. స్థానిక పోలీసులకు అప్పగించాడు. పోలీసులు సందీప్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి రప్పించినట్టు పోలీసు అధికారి తెలిపారు. ఏం జరిగిందని.. సందీప్ ను ప్రశ్నించగా.. పోలీసులను కూడా తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించాడు. తనను ఎవరో కిడ్నాప్ చేశారని, ఆ తర్వాత తాను స్పృహా కోల్పోయి కింద పడి ఉన్నట్టు కట్టు కథ అల్లాడు. ఎక్కడో చెప్పమంటూ పోలీసులు ఘటనా స్థలానికి తీసుకెళ్తే.. అక్కడ సందీప్ చెప్పిన వివరాలు.. అంతకుమందు చెప్పిన వివరాలు సరిగా లేవు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో.. అసలు నిజం చెప్పేశాడు. లగ్జరీ కారు కొనేందుకు డబ్బులు కోసం ఇలా తాను కిడ్నాప్ డ్రామా ఆడినట్టు సందీప్ అంగీకరించాడు.