ఇంటర్‌ విద్యార్థిని రాధికను అద్దెకున్న యువకుడే హత్య చేశాడా?

కరీంనగర్‌ నడిబొడ్డున జరిగిన ఇంటర్‌ విద్యార్థిని రాధిక మర్డర్‌ మిస్టరీగా మారింది. రాధిక ఇంట్లో రెండేళ్ల కింద ఓ యువకుడు అద్దెకు ఉండేవాడు. అతడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

  • Published By: veegamteam ,Published On : February 11, 2020 / 04:14 AM IST
ఇంటర్‌ విద్యార్థిని రాధికను అద్దెకున్న యువకుడే హత్య చేశాడా?

కరీంనగర్‌ నడిబొడ్డున జరిగిన ఇంటర్‌ విద్యార్థిని రాధిక మర్డర్‌ మిస్టరీగా మారింది. రాధిక ఇంట్లో రెండేళ్ల కింద ఓ యువకుడు అద్దెకు ఉండేవాడు. అతడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

కరీంనగర్‌ నడిబొడ్డున జరిగిన ఇంటర్‌ విద్యార్థిని రాధిక మర్డర్‌ మిస్టరీగా మారింది. రాధికను హతమార్చింది ఎవరన్నది పోలీసులు ఇంకా తేల్చలేదు. అయితే దర్యాప్తు మాత్రం చేస్తున్నారు. కీలక ఆధారాలతో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ముత్త కొమురయ్య ,ఓదెమ్మల కూతురు రాధిక ఇంట్లో  ఉండగా గుర్తు తెలియని వ్యక్తి గొంతు కోసి హతమార్చాడు. కూరగాయల కత్తితో హత్య చేశాడు. అనంతరం ఇంట్లోని లక్ష రూపాయల నగదు, నాలుగు తులాల బంగారం కూడా ఎత్తుకెళ్లినట్టు తెలుస్తోంది.

తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు
తమ బిడ్డను ఎందుకు చంపారో తెలియడం లేదని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తమ కూతురిని చంపాల్సిన అవసరం ఎందుకొచ్చిందో తెలియక బోరుమన్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డను అన్యాయంగా చంపడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. నిందితులను వెంటనే అరెస్ట్‌ చేయాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

రాధిక ఇంట్లో రెండేళ్ల క్రితం అద్దెకు యువకుడు
రాధిక ఇంట్లో రెండేళ్ల కింద ఓ యువకుడు అద్దెకు ఉండేవాడు. అతడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇంటి చుట్టూ కాంపౌండ్‌ గోడ ఉండటం, కొత్త వారు ఇంట్లోకి వచ్చే పరిస్థితి లేకపోవడంతో తెలిసినవారే ఈ హత్య చేసి ఉంటారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆ యువకుడు తన కూతురితో స్నేహంగా ఉండటం నచ్చకపోవడంతో రాధిక తల్లిదండ్రులు అతడిని ఇల్లు ఖాళీ చేయించారు. పాత పరిచయంతో ఆ యువకుడు తరచూ రాధికతో తరచూ ఫోన్‌లో మాట్లాడేవాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఆ యువకుడే ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి వచ్చి హతమార్చి ఉంటాడని భావిస్తున్నారు. మరింత స్పష్టత కోసం సీసీటీవీ ఫుటేజీలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.

నిందితుడిని అరెస్టు చేయాలని మంత్రి గంగుల ఆదేశం
రాధిక హత్య విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని డీసీపీలు చంద్రమోహన్, శ్రీనివాస్‌ను ఆదేశించారు. పోలీస్‌ కమిషనర్‌ కమలాసన్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. రాధిక కుటుంబానికి 25 వేలు తక్షణ సాయంగా అందజేశారు.