కూతుర్ని చంపితే శిక్ష ఎంత పడుతుందని లాయర్ అడిగి మరీ హత్య చేశాడు

  • Published By: nagamani ,Published On : June 8, 2020 / 11:34 AM IST
కూతుర్ని చంపితే శిక్ష ఎంత పడుతుందని లాయర్ అడిగి మరీ హత్య చేశాడు

ఓ దుర్మార్గపు తండ్రి కన్న కూతుర్ని హతమార్చాలనుకున్నాడు. అలా చంపితే తనకు శిక్ష ఎక్కువ పడుతుందా? తక్కువ పడుతుందా?అని లాయర్ ని అడిగి మారీ కూతుర్ని దారుణంగా చంపేశాడు. అత్యంత అమానవీయ ఘటన ఉత్తర ఇరాన్‌లో చోటుచేసుకుంది. 

కుమార్తెను హత్య చేస్తే ఎంత శిక్ష పడుతుందని ఆ కసాయి తండ్రి ముందుగానే లాయర్‌ను అడిగిమరీ కుమార్తెను దారుణంగా హతమార్చాడు. బిడ్డ సంరక్షకుడిగా ఉన్నవారు హత్య చేస్తే 3 నుంచి పదేళ్ల జైలు శిక్ష పడుతుందని చెప్పడంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు అతడు. 

ఉత్తర ఇరాన్‌లోని పచ్చని కొండల నడుమ ఉన్న ఓ చిన్న గ్రామం. 37 ఏళ్ల రెజా అష్రాఫీ తన కుటుంబంతో నివసిస్తున్నాడు. అతనికి రోమినా అనే 14 ఏళ్ల కూతరు ఉంది. ఆమె 29 ఏళ్ల వ్యక్తిని ప్రేమించింది. ఇది అష్రాఫీకి నచ్చలేదు. కూతుర్ని తీవ్రంగా మందలించాడు. తిట్టాడు. బెల్టుతో ఇష్టమొచ్చినట్లు కొట్టాడు. ఓ సారి ఎలుకల మందు తెచ్చి అది తిని ఆత్మహత్య చేసుకోమని బెదిరించాడు.అయినా రోమినా వినలేదు.  తండ్రీ కూతుళ్లకుమధ్య చాలాసార్లు పెద్ద పెద్ద గొడవలయ్యాయి. అతన్నే పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పింది. 

దీంతో తన పరువు తీస్తోందని ఉగ్రుడైపోయాడు అష్రాఫీ. రోమినాను గదిలో బంధించాడు. అతనికి  ఫోన్ చేయకుండా లాక్కున్నాడు.  అయినా రోమినా తన పట్టువీడలేదు. ఓరోజు తండ్రి నుంచి తప్పించుకుని ప్రియుడి వద్దకు వెళ్లిపోయింది. 

విషయం తెలుసుకున్న అష్రాఫీ ఛండశాసనుడైపోయాడు. కూతురు ప్రేమించానని చెబుతున్న వ్యక్తి మీద కిడ్నాప్‌ కేసు పెట్టాడు. కానీ రోమినా తన ప్రియుడి తరపునే మాట్లాడుతూ..నాకు అతనంటే ఇష్టం తన ఇష్టపూర్వకంగా అతని దగ్గరకు వచ్చాచని పోలీసులకు తెగేసి చెప్పింది. దీంతో పోలీసులు ఏమీ చేయలేక కేసు కొట్టివేశారు. 

కానీ  పోలీసులు మాత్రం రోమినాకు కౌన్సెలింగ్ ఇస్తూ..తండ్రితో వెళ్లమని చె్ప్పారు. ఇంటికి వెళ్తే తండ్రి తనను చంపేస్తాడని భయపడింది. అయినా నువ్వు మైనర్ వి అని చెప్పి పోలీసులు రోమినాను తండ్రితోనే పంపించారు. ఇంటికి వెళ్లిన కొన్ని రోజుల తరువాత రోమినాను ఇంట్లో బంధించి అత్యంత దారుణంగా కత్తితో  గొంతు కోసి చంపేశాడు అప్రాపీ. చంపే ముందు అప్రాపీ తనకు తెలిసిన లాయర్ దగ్గరకెళ్లి మైనర్ ని  చంపితే శిక్ష ఎంత పడుతుంది. ఎన్ని సంవత్సరాలు పడుతుంది అని అడిగాడు.దానికి లాయర్ 3 నుంచి 10 సంవత్సరాలు పడొచ్చు అని చెప్పాడు.  ఆ తరువాత కొన్ని రోజులకు కూతుర్ని గొంతు కోసి చంపేశాడు. 

తరువాత పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈ ఘటనపై మహిళలు, పిల్లల హక్కుల సంఘాలు దారుణంగా ఖండించాయి. పరువు పేరుతో ఇటువంటి హత్యలు హేయమని నినదించారు. ఇటువంటి ఘటనలో న్యాయపరమైన మార్పులు చేసి శిక్షల్ని కఠినం చేయాలని డిమాండ్  చేస్తున్నారు. 

ఇటువంటి హత్యలు  సామాజిక, మత, చట్ట పరమైన వైఫల్యాలపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది.  దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ సుప్రీం నాయకుడు అయతోల్లా అలీ ఖమేనీ, రోమినా హత్యను తీవ్రంగా ఖండించారు. స్త్రీలను వేధింపులకు గురిచేసే ఏ వ్యక్తికైనా ‘కఠినమైన శిక్ష’ విధించాలని పిలుపునిచ్చారు. దేశంలో ఇటువంటి రోమినాలో రక్షణ లేకుండా ఉన్నారని అబోద్లాజాదే ట్వీట్ చేశారు.  

అయితే ఇరాన్‌లో హత్య చేసిన వ్యక్తికి ‘కంటికి కన్ను’ అనే షరియా ఆదేశం ప్రకారం మరణశిక్ష విధిస్తారు. కానీ ఇస్లామిక్ చట్టం ఆధారంగా శిక్షాస్మృతి, తన బిడ్డను చంపినందుకు ఒక సంరక్షకుడికి మరణశిక్ష నుంచి మినహాయింపు లభిస్తుంది. ఇరాన్‌లో పిల్లల తల్లితండ్రులని చట్టపరమైన సంరక్షకులుగా పేర్కొంటారు. అయితే తన బిడ్డను చంపిన తల్లి మరణశిక్షను ఎదుర్కొంటుంది. కానీ తండ్రికి మాత్రం తేలిక పాటి శిక్షలతో సరిపెడుతుంది. ఇది లింగ వివక్షకు పరాకాష్ట అనే విమర్శలు ఉన్నాయి.   

ఇరాన్ మహిళలు న్యాయవాదులు, వైద్యులు, పైలట్లు, ఫిల్మ్ డైరెక్టర్లు మరియు ట్రక్ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. వారు 60 శాతం విశ్వవిద్యాలయ సీట్లు కలిగి ఉన్నారు మరియు శ్రామిక శక్తిలో 50 శాతం ఉన్నారు. వారు పదవికి పోటీ చేయవచ్చు, మరియు వారు పార్లమెంట్ మరియు మంత్రివర్గంలో సీట్లు కలిగి ఉంటారు. అలాగే ఆంక్షలు కూడా ఉన్నాయి. మహిళలు తమ జుట్టుగానీ..కనీసం చేతులు గానీ కనిపించకుండా ముసుగు వేసుకోవాలి. దేశం విడిచి ఎక్కడికైనా వెళితే వారి కూడా పురుషులు కచ్చితంగా ఉండాల్సిందే. అలాగే మహిళలు బైటకు విడాకులు అడగాలంటే కూడా ఆయా ఇంటిలోని పురుషులు అనుమతి ఉండాల్సిందే.

Read:పాకిస్తాన్ లో లక్షకు పైగా కరోనా కేసులు నమోదు