బాగ్దాదీ చావు నిజమే…కొత్త లీడర్ పేరు ప్రకటించిన ఐసిస్

  • Published By: venkaiahnaidu ,Published On : November 1, 2019 / 03:00 AM IST
బాగ్దాదీ చావు నిజమే…కొత్త లీడర్ పేరు ప్రకటించిన ఐసిస్

తమ ఉగ్రసంస్థ నాయకుడు అబు బకర్‌ అల్‌ బాగ్దాదీ చనిపోయినట్లు ఐసిస్ కన్ఫర్మ్ చేసింది. అమెరికా చేసిన ప్రకటన నిజమేనని ఐసిస్ తెలిపింది. ఐసిస్ కు కొత్త నాయకుడిని ఎన్నుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు గురువారం ఓ ఆడియోటేప్ ను రిలీజ్ చేసింది. అబు ఇబ్రహీం హష్మీ అల్-ఖురేషి అలియాస్ అబ్దుల్లా ఖర్షద్ ను తమ కొత్త నాయకుడిగా ఎన్నుకున్నట్లు రిలీజ్ చేసిన ఆడియోటేప్ లో ఐసిస్ తెలిపింది.

ఉగ్రవాద మార్గంలో ఇస్లాం రాజ్యస్థాపనే లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా దాడులకు తెగబడి బాగ్దాదీ చివరకు కుక్క చావు చచ్చినట్లు అక్టోబర్-27,2019న ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. సిరియాలో డెడ్ ఎండ్ టన్నెల్‌లో అమెరికా స్పెషల్ ఫోర్స్ ఆపరేటర్లు అబూ బకర్ ని గుర్తించారని,అమెరికా సేనలు దాడి చేయడం కంటే ముందే…అబూ బకర్ తనంట తానుగా సూసైడ్ వెస్ట్(కోటు)ధరించి తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడని ట్రంప్ ప్రకటించాడు. పేలడుతో అబూ బకర్ శరీరం ముక్కలు అయిపోయిందని ట్రంప్ తెలిపారు. డీఎన్ఏ టెస్టులు కూడా చేశామని.. చనిపోయింది బాగ్దాదియే అని తేలిందని తెలిపారు. 

అయితే అబు బకర్‌ అల్‌ బాగ్దాదీ స్థానాన్ని భర్తీ చేయబోయే ఉగ్రవాది, బాగ్దాదీ వారసుడిని కూడా హతమార్చినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అక్టోబర్-29,2019న  ప్రకటించారు. ఈ ఆపరేషన్‌ కూడా సక్సెస్ అయ్యినట్లుగా ట్రంప్ వెల్లడించారు. అయితే, ఐసిస్‌ అగ్రనేత స్థానాన్ని భర్తీ చేయబోయిన ఉగ్రవాది పేరును మాత్రం ట్రంప్‌ ప్రకటించలేదు. బాగ్దాదీ స్థానాన్ని ఇతనే భర్తీ చేస్తాడని నిఘా వర్గాల సమాచారం మేరకు ఆయనను అమెరికా సైన్యం మట్టుబెట్టినట్లు ట్రంప్‌ ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే.