లాటరీ కింగ్ మార్టిన్ ఆస్తులపై ఐటీ కొరడా : 70 నివాసాల్లో ఒకేసారి సోదాలు

లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ ఆస్తులపై ఐటీ శాఖ కొరడా ఝుళిపించింది. ఆదాయ పన్ను శాఖ అధికారులు మార్టిన్ ఆస్తులకు సంబంధించిన 70 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరిపారు.

  • Published By: sreehari ,Published On : May 4, 2019 / 12:41 PM IST
లాటరీ కింగ్ మార్టిన్ ఆస్తులపై ఐటీ కొరడా : 70 నివాసాల్లో ఒకేసారి సోదాలు

లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ ఆస్తులపై ఐటీ శాఖ కొరడా ఝుళిపించింది. ఆదాయ పన్ను శాఖ అధికారులు మార్టిన్ ఆస్తులకు సంబంధించిన 70 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరిపారు.

లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ ఆస్తులపై ఐటీ శాఖ కొరడా ఝుళిపించింది. ఆదాయ పన్ను శాఖ అధికారులు మార్టిన్ ఆస్తులకు సంబంధించిన 70 నివాసాల్లో ఏకకాలంలో సోదాలు జరిపారు. చెన్నైలోని కోయింబత్తూరు, ముంబై, కోల్ కతా, గ్యాంగ్ టక్ సహా ఇతర ప్రాంతాల్లో నాలుగు రోజుల నుంచి ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. మార్టిన్ గ్రూపు సంస్థకు చెందిన ఆస్తుల్లో లెక్కలోలేని రూ.595 కోట్ల ఆస్తులు ఉన్నట్టు ఐటీ శాఖ గుర్తించింది. లాటరీ టికెట్లతో ప్రైజ్ లు గెలుచుకోవచ్చుంటూ నమ్మించి వ్యాపారుల నుంచి కోట్లాది రూపాయలను కొల్లగొట్టినట్టు మార్టిన్ పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. 

వివిధ పెట్టుబడుల్లో చెల్లించిన రూ.619 కోట్లపై పేమెంట్స్, రసీదులతో సర్దుబాటు చేసిన తర్వాత అదనంగా లెక్కలోలేని ఆదాయాన్ని ఆఫర్ చేసేందుకు ప్రయత్నించినట్టు సీనియర్ ఐటీ అధికారి ఒకరు తెలిపారు. ఐటీ సోదాల్లో లెక్కలోలేని రూ.8.25 కోట్ల నగదును గుర్తించామని, ఇందులో రూ.5.8 కోట్లను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. పట్టుబడిన నగదులో మిగిలిన సొమ్మును ప్రొహిబిటరీ ఆర్డర్ కింద ఉంచినట్టు తెలిపారు.

ఐటీ సోదాల్లో మార్టిన్ నివాసాల్లో లెక్కకు రాని.. రూ.24.57 కోట్ల విలువైన బంగారం, డైమండ్ జ్యుయెలరీ కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. మార్టిన్ ఆస్తులకు సంబంధించిన పలు నివాసాల్లో ప్రొహిబిటరీ ఆర్డర్ జారీ చేయగా.. సోదాల్లో పేపర్, ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లు చాలావరకూ స్వాధీనం చేసుకున్నట్టు ఐటీ అధికారి చెప్పారు. ఈ డ్యాక్యమెంట్లను ఇంకా పరిశీలించాల్సి ఉందని అన్నారు.  

మార్టిన్.. కాలేజీ ఉద్యోగి అనుమానాస్పద మృతి
లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ సొంత హోమియోపతి మెడికల్ కాలేజీలో అకౌంటెంట్ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి మృతిచెందాడు. 20ఏళ్లుగా ఇదే మెడికల్ కాలేజీలో అతడు ఉద్యోగం చేస్తున్నాడు. కోయింబత్తూరులోని మార్టిన్ ఆస్తులపై ఐటీ సోదాలు జరిపిన సమయంలో మెడికల్ కాలేజీ అకౌంటెంట్ పళనిసామిని అధికారులు తీసుకెళ్లారు. 
రెండు రోజుల క్రితం అతన్ని ఐటీ అధికారులు విచారించారు.

ఐటీ శాఖ విచారించిన అనంతరం.. పళనిసామి తన మణికట్టును కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం డిశ్చార్చి చేశారు. కానీ, పళనిసామి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. అకౌంటెంట్ మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం.. హత్య? లేదా ఆత్మహత్యా? అనేది నిర్ధారిస్తామని తెలిపారు.