బిగ్ డెసిషన్ : ఐటీ గ్రిడ్స్ ఆఫీస్ సీజ్

ఏపీ ప్రజల వ్యక్తి గత సమాచారాన్ని చౌర్యం చేసిన  హైదరాబాద్  మాదాపూర్ అయ్యప్ప సొసైటీ లోని ఐటీ  గ్రిడ్ కార్యాలయాన్ని సిట్ అధికారులు శుక్రవారం సీజ్ చేశారు.

  • Published By: chvmurthy ,Published On : March 8, 2019 / 12:36 PM IST
బిగ్ డెసిషన్ : ఐటీ గ్రిడ్స్ ఆఫీస్ సీజ్

ఏపీ ప్రజల వ్యక్తి గత సమాచారాన్ని చౌర్యం చేసిన  హైదరాబాద్  మాదాపూర్ అయ్యప్ప సొసైటీ లోని ఐటీ  గ్రిడ్ కార్యాలయాన్ని సిట్ అధికారులు శుక్రవారం సీజ్ చేశారు.

హైదరాబాద్:  తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించి, రాజకీయ దుమారం రేపిన  డేటా చోరీ కేసులో  హైదరాబాద్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీ లోని ఐటీ  గ్రిడ్ కార్యాలయాన్ని సిట్ అధికారులు శుక్రవారం సీజ్ చేశారు.  ఇప్పటికే కార్యాలయంలో  సోదాలు జరిపిన అధికారులు, సంస్ధలోని హార్డ్  డిస్క్ ను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం  మిగిలిన కంప్యూటర్లు  స్వాధీనం చేసుకుని  కార్యాలయాన్ని సీజ్   చేశారు.  కార్యాలయం వద్దకు ఇతరులెవరూ రాకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

గతంలో  స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్ లో డేటాను నిపుణుల సాయంతో డీ కోడింగ్ చేయిస్తున్నారు.   మరో వైపు డేటా చౌర్యం కేసుపై అటు ఆంధ్రాలో, ఇటు తెలంగాణ లో  కూడా   ప్రభుత్వాలు సిట్ ను  ఏర్పాటు చేసాయి. మరోసారి విచారణకు తమ ముందుకు హాజరుకావాలని సంస్థ ఉద్యోగులకు  తెలంగాణ సిట్‌ నోటీసులు జారీచేసింది.  ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఐటీ గ్రిడ్ డైరెక్టర్ అశోక్ కోసం సైబరాబాద్ పోలీసులు, సిట్ బృందం తీవ్రంగా గాలిస్తోంది. 
Also Read : డేటా చోరీ కేసులో సిట్ దర్యాప్తు : ఐటీ గ్రిడ్స్ ఎండీ అశోక్ కోసం గాలింపు