బీ అలర్ట్ : మరో దాడి జరగొచ్చంటూ నిఘా వర్గాల వార్నింగ్

  • Published By: veegamteam ,Published On : February 21, 2019 / 07:27 AM IST
బీ అలర్ట్ : మరో దాడి జరగొచ్చంటూ నిఘా వర్గాల వార్నింగ్

జమ్ము కశ్మీర్ : పుల్వామా ఉగ్రదాడి దేశాన్ని వణికించేసింది. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల సమయంలో నిఘా వర్గాలు మరో వార్నింగ్ ఇచ్చాయి. పుల్వామాను మించిన భారీ దాడికి జైషే మహ్మద్ ప్లాన్ వేసిందని.. ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. పాకిస్థాన్‌లోని జైషే మహ్మద్‌కు చెందిన ఓ సోషల్ మీడియా గ్రూప్‌లోని కోడ్‌ను నిఘా వర్గాలు చేధించటం ద్వారా ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చాయి. తాన్‌జీమ్ అనే ఓ చిన్న ఉగ్రవాద గ్రూపు ద్వారా ఈ సమాచారం వెల్లడైంది.

ఈసారి చౌకీబల్, తాంగ్‌ధర్ రూట్లలో ఈ దాడులు జరగనున్నట్లు నిఘా వర్గాలు కేంద్రాన్ని అలర్ట్ చేశాయి. ఆర్మీకి కూడా సమాచారం ఇచ్చాయి. ఈ రూట్లలో ఐఈడీ దాడులు జరిగే ప్రమాదం ఉన్నట్లు అంచనా వేస్తున్నాయి. దీనికోసం తాన్‌జీమ్ ఓ ఆకుపచ్చ రంగు స్కార్పియోను సిద్ధం చేసిందని.. దాని ద్వారా ఆత్మాహుతి దాడి జరిగే ప్రమాదం ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. 

పుల్వామాలో 300 కిలోల ఆర్డీఎక్స్‌తో జరిగిన దాడి ఓ ఆటబొమ్మలాంటిదని.. 500 కిలోల పేలుడుకు సిద్ధంగా ఉండండి అని ఆ మెసేజ్ లో రాసి ఉండటం గమనార్హం. కశ్మీరీలను లక్ష్యంగా చేసుకోవడం భద్రతా బలగాలు మానుకోవాలని..ఇది కేవలం ఆరంభం మాత్రమే అని ఉగ్రవాదులు హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. 

ఈ దాడుల కోసం 2018 డిసెంబరులో ముగ్గురు ఆత్మాహుతి సభ్యులతో సహా 21 మంది ఉగ్రవాదులు కశ్మీర్‌లోకి చొరబడినట్లు వార్నింగ్ ఇచ్చాయి. ఓ ఆత్మాహుతి దాడి సభ్యుడైన అదిల్ అహ్మద్ దర్ పుల్వామా దాడిలో పాల్గొన్నాడని తెలిపారు. మరో ఇద్దరు మానవ బాంబులుగా మారి దాడికి సిద్ధంగా ఉన్నట్టు ఇంటిలిజెన్స్ వర్గ అధికారి తెలిపారు. సో.. బీల అలర్ట్