జయరాం హత్య కేసు : ఒక రోజు బ్రేక్

  • Published By: madhu ,Published On : February 21, 2019 / 09:24 AM IST
జయరాం హత్య కేసు : ఒక రోజు బ్రేక్

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్నారై జయరామ్ హత్య కేసు విచారణ కొనసాగుతోంది. ఫిబ్రవరి 21వ తేదీ గురువారం సాయంత్రం విచారణ ముగిసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాకేష్ రెడ్డి స్నేహితులను పోలీసులు విచారించారు. 8 మందిని విచారించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ (ఫిబ్రవరి 22వ తేదీ) ఉన్నందున విచారణ చేయలేమని బంజారాహిల్స్ పోలీసులు వెల్లడించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులను, అనుమానితులను ఎల్లుండి (ఫిబ్రవరి 23వ తేదీ) విచారిస్తామన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 60 మందిని విచారించినట్లు తెలిపారు. 

కొత్త కోణాలు : 
విచారిస్తున్న కొద్దీ కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. రౌడీషీటర్ నగేష్ అతని మేనల్లు విశాల్‌కు హత్యకు సంబంధం ఉందని పోలీసులు తేల్చారు. వీరిద్దరినీ అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. హత్య చేస్తాడని ముందే తెలిసినా నగేష్ ఆపలేదని…..జయరామ్‌ను ఊపిరాడకుండా చేసి రాకేష్ చంపేశాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మొత్తంగా కేసులో నలుగురి ప్రమేయం ఉందని భావిస్తున్నారు.

శ్రిఖా చౌదరి, సంతోష్ రావులు ఎక్కడికి వెళ్లారు : 
మరోవైపు శ్రిఖా చౌదరి పాత్రపై కూడా పోలీసులు మరోసారి దృ‌ష్టి పెట్టారు. జయరామ్‌ని హత్య చేసిన రోజు…సంతోష్ రావ్‌తో లాంగ్ డ్రైవ్‌కి వెళ్లినట్లు శ్రిఖా చౌదరి వెల్లడించడంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా ఫిబ్రవరి 21వ తేదీ గురువారం బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయానికి సంతోష్ రావు విచారణకు హాజరయ్యాడు. ఇతడిని పోలీసులు విచారిస్తున్నారు. శ్రిఖా..సంతోష్ రావులు ఎక్కడకు వెళ్లారనే దానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు. 

పోలీసుల ప్రమేయం : 
పోలీసుల ప్రమేయం ఉందనే ఆరోపణలతో ఫిబ్రవరి 20వ తేదీ బుధవారం ఏసీపీ మల్లారెడ్డి, రాయదుర్గం సీఐ రాంబాబులను విచారించారు. జూబ్లిహిల్స్ ఇన్స్‌పెక్టర్ పాత్ర కూడా తెరపైకి వచ్చింది. అంతకంటే ముందు శ్రిఖా చౌదరి ఇతరులను పోలీసులు విచారించారు. ఇక రాకేష్ రెడ్డి ఆర్థిక లావాదేవీలు..రియల్ ఎస్టేట్ బిజినెస్ గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.

రాకేష్..రియల్ ఎస్టేట్ సంబంధాలు : 
రాకేష్‌కి పరిచయం ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం కూపీ లాగుతున్నారు. వారిని కూడా పీఎస్‌కి పిలిపించి విచారిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ శివారులో ల్యాండ్ సెటిల్‌మెంట్లు చేస్తున్నాడని..ఇందుకు కొంతమంది పోలీసులు సహకరించారని దర్యాప్తులో తేలింది. రియల్ ఎస్టేట్ దందా పేరిట పలువురిని మోసం చేసినట్లు తేలింది. 53 ఎకరాల కబ్జాలో 6 ఎకరాలు కబ్జా చేయాలని రాకేశ్ రెడ్డి ప్రయత్నం చేశాడని డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. దీనికి ఎండ్ కార్డు ఎప్పుడు పడుతుందో ? 

Read Also:జియో ఎఫెక్ట్ : BSNL డేటా సునామీ ఆఫర్
Read Also:విన్నర్ ఎవరంటే: కొండచిలువ, మొసలి బిగ్ ఫైట్ చూశారా?
Read Also:దేశం అంటే ఇదే : రూ.6 లక్షల బిక్షాటన డబ్బు.. అమర జవాన్లకు