Jharkhand: అకౌంట్లోకి వచ్చిపడ్డ లక్ష రూపాయలు.. డ్రా చేసుకున్న వ్యక్తి అరెస్టు

ఝార్ఖండ్‌, సింఘ్‌భూమ్ జిల్లాకు చెందిన జీత్‌రాయ్ సమంత్ అనే వ్యక్తి అకౌంట్లోకి రెండేళ్లక్రితం పొరపాటున లక్ష రూపాయలు క్రెడిట్ అయ్యాయి. అప్పట్లో కోవిడ్ సందర్భంగా అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామీణ బ్యాంకుకు సంబంధించిన సర్వీస్ సెంటర్లో ఒక మహిళ లక్ష రూపాయలు డిపాజిట్ చేసింది.

Jharkhand: ఒక బ్యాంక్ అకౌంట్లో పడాల్సిన డబ్బులు పొరపాటున మరో అకౌంట్లో పడే ఘటనలు అప్పుడప్పుడూ జరుగుతుంటాయి. ఆ డబ్బులు ఎవరివో వాళ్లకు తిరిగి చెల్లిస్తే సమస్య లేదు. అలా కాకుండా డబ్బులు వాడుకుంటే మాత్రం కటకటాల పాలవ్వాల్సిందే. అందుకే నిదర్శనమే ఈ ఘటన.

Pan-Aadhaar Link: గుడ్ న్యూస్.. పాన్-ఆధార్ లింక్ గడువు పెంపు.. ఈ సారి ఎప్పటివరకంటే!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఝార్ఖండ్‌, సింఘ్‌భూమ్ జిల్లాకు చెందిన జీత్‌రాయ్ సమంత్ అనే వ్యక్తి అకౌంట్లోకి రెండేళ్లక్రితం పొరపాటున లక్ష రూపాయలు క్రెడిట్ అయ్యాయి. అప్పట్లో కోవిడ్ సందర్భంగా అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామీణ బ్యాంకుకు సంబంధించిన సర్వీస్ సెంటర్లో ఒక మహిళ లక్ష రూపాయలు డిపాజిట్ చేసింది. అయితే, గతంలో బ్యాంకు అధికారుల పొరపాటు వల్ల ఆమె ఆధార్ నెంబర్ సమంత్ బ్యాంక్ అకౌంట్‌తో లింకై ఉంది. ఇది తెలియని బ్యాంకు సిబ్బంది దీన్ని సరిచేయలేదు. దీనిపై ఆమె కూడా ఫిర్యాదు చేయలేదు. అదే సమయంలో ఆమె డిపాజిట్ చేసిన లక్ష రూపాయలు సమంత్ అకౌంటుకు వెళ్లిపోయాయి. తన అకౌంట్లోకి పొరపాటుగా డబ్బులు వచ్చినప్పటికీ, ఆ డబ్బుల్ని అతడు విత్ డ్రా చేసుకుని వాడుకున్నాడు.

Amaravati Capital Issue: అమరావతి రాజధాని కేసులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. విచారణ జూలైకి వాయిదా

దీనిపై ఆమె ఫిర్యాదు చేయగా బ్యాంకు అధికారులు స్పందించారు. విషయం ఆరా తీయగా జరిగిన పొరపాటు గుర్తించారు. అయితే, డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయిన సమంత్‌ను గుర్తించి, అతడిని లక్ష రూపాయలు తిరిగి చెల్లించాలి అని ఆదేశించారు. కానీ, అతడు ఎంతకాలమైనా డబ్బులు తిరిగి ఇవ్వలేదు. దీనిపై పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ అతడు స్పందించలేదు. దీంతో బ్యాంకు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తాజాగా అతడిని అరెస్టు చేశారు.

 

ట్రెండింగ్ వార్తలు