కోడలే కిల్లర్ : సైనేడ్ ఇచ్చి 14 ఏళ్లలో ఆరుగురి హత్య

కేరళలో సంచలనం సృష్టించిన సీరియల్ మర్డర్ల కేసు విచారణలో షాకింగ్ విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసు గురించి తెలుసుకుని అంతా షాక్ అవుతున్నారు. ఆస్తి కోసం

  • Published By: veegamteam ,Published On : October 7, 2019 / 02:29 PM IST
కోడలే కిల్లర్ : సైనేడ్ ఇచ్చి 14 ఏళ్లలో ఆరుగురి హత్య

కేరళలో సంచలనం సృష్టించిన సీరియల్ మర్డర్ల కేసు విచారణలో షాకింగ్ విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసు గురించి తెలుసుకుని అంతా షాక్ అవుతున్నారు. ఆస్తి కోసం

కేరళలో సంచలనం సృష్టించిన సీరియల్ మర్డర్ల కేసు విచారణలో షాకింగ్ విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసు గురించి తెలుసుకుని అంతా షాక్ అవుతున్నారు. ఆస్తి కోసం ఇంటి కోడలే ఆరుగురు కుటుంబ సభ్యులను హత్య చేసింది. 2002 నుంచి 2016 వరకు జరిగిన ఈ హత్యలన్నీ సహజ మరణాలుగా అంతా భావించారు. అయితే… హత్యలు జరుగుతున్న క్రమంలోనే… ఆస్తులన్నీ జోలీ పేరు మీదకి మారిపోయాయి. ఈ వరుస మరణాలపై ఆమె మొదటి భర్త సోదరుడు క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. దాంతో అసలు నిజం బయటపడింది. అవన్నీ సహజ మరణాలు కాదు మర్డర్లు అని తేలింది. సైనేడ్ ఇచ్చి వారిని చంపినట్లు తేల్చారు. అన్ని హత్యల వెనకా ఉన్నది జోలీయే.

ఆస్తి కోసం ఆరుగురు కుటుంబసభ్యులను చంపిన జోలీ ఉదంతంలో… కొత్త విషయాలు బయటపడుతున్నాయి. జోలీని వివాహమాడిన రెండో భర్త షాజూ… తనను కూడా మోసం చేసిందంటున్నాడు. తాను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పనిచేస్తున్నట్లు తనకు చెప్పిందని తెలిపాడు. అయితే… ఆమె నిట్‌లో ఏ ఉద్యోగమూ చెయ్యట్లేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. జరిగిన ఆరు హత్యలకూ తనకూ సంబంధం లేదంటున్న షాజూ… జోలీకి ఎక్కడెక్కడి నుంచో ఫోన్ కాల్స్ వచ్చేవని పోలీసులకు తెలిపాడు. జోలీ ఇకపై జైలు జీవితానికే పరిమితం అవుతుంది కాబట్టి… ఆమె ఇద్దరు పిల్లల్నీ తాను చూసుకుంటానంటున్నాడు షాజూ. 

ఆస్తి కోసమే జోలీ ఈ హత్యలు చేసినట్లు భావిస్తున్నట్లు తెలిపారు కేరళ పోలీసులు. 2002లో అత్త అన్మమ్మ, 2008లో మామ టామ్ థామస్, 2011లో భర్త రాయ్ థామస్, 2014లో అన్నమ్మ సోదరుడు మ్యాథ్యూ… 2016లో షాజూ భార్య సిలీ, అతడి కుమార్తె అల్ఫోన్సా చనిపోయారు. దర్యాప్తులో భాగంగా మృతి చెందిన కుటుంబ సభ్యుల సమాధుల్ని తవ్వి తీసి అటాప్సీ జరిపించారు. రిపోర్టుల్లో సైనేడ్ వల్లే వాళ్లంతా చనిపోయినట్లు తేలింది. ఆస్తి కోసం మామ టామ్ థామస్‌పై ఒత్తిడి తెచ్చిన జోలీ… భర్తతో పాటు ఐదుగురు కుటుంబ సభ్యుల్నీ ఒక్కొక్కరిగా చంపేసినట్టు పోలీసులు తేల్చారు. శనివారం(అక్టోబర్ 5,2019) ఉదయం జోలీని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి.

ఆస్తి వ్యవహారాలు చూసే అన్నమ్మను ఆస్తిపై హక్కు కోసం జోలీ చంపేసిందని తేల్చారు పోలీసులు. ఆస్తిలో మరింత వాటా కోసం అన్నమ్మ భర్త టామ్‌ను.. భర్తతో విబేధాలు రావడంతో రాయ్‌ థామస్‌ హత్యకు స్కెచ్‌ గీసినట్లు అనుమానిస్తున్నారు. ఇక రాయ్‌ మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌ చేయాలని ఒత్తిడి చేసినందువల్ల అన్నమ్మ సోదరుడు మేథ్యూని.. సిలీ భర్తను పెళ్లి చేసుకోవడం కోసం సిలీతోపాటు ఆమె కూతురు జూలీని హతమార్చినట్లు తెలుస్తోందని వివరించారు. అనుమానాస్పద మరణాలు కావడంతో వారి మృతదేహాల నుంచి డీఎన్‌ఏ శ్యాంపిల్స్‌ను వెలికి తీసి ఫొరెన్సిక్‌ లాబ్‌కు పంపించామన్నారు. ఈ మృతదేహాల్లోనూ విషపూరిత సైనేడ్‌ ఆనవాళ్లు ఉన్నాయన్నారు. రాయ్‌ థామస్‌ సైనేడ్‌ వల్ల చనిపోగా, జోలీ మాత్రం తన భర్త గుండెపోటుతో చనిపోయాడని చెప్పినట్లు తెలిపారు పోలీసులు.

కేరళలోని కోజికోడ్‌ జిల్లాలో పున్నమ్మది ఒక సంపన్న కుటుంబం. 2002 నుంచి 2016 వరకూ ఆ ఇంటికి చెందిన ఆరుగురు వ్యక్తులు ఒకే రీతిలో హఠాన్మరణానికి గురయ్యారు. వారివి సహజ మరణాలే అనుకున్నారంతా. కానీ వాస్తవం వేరు. ఆ వాస్తవం సుమారు 17 ఏళ్లపాటు మౌనంగా సమాధి అయిపోయింది. అయితే, నిప్పులాంటి నిజం ఆ సమాధుల్లో నుంచి తాజాగా బయటపడింది. నివ్వెరపరిచే విషయాలను కళ్లముందుంచింది. ఇంటి కోడలే యమపాశమైన సంగతి వెలుగులోకి వచ్చింది. ఆ కోడలి పేరే జోలీ. ఆమె పకడ్బందీగా వ్యూహం పన్ని ఈ హత్యలన్నీ చేసింది.

జోలీ ఓ ఆభరణాల సంస్థలో పనిచేసే మాథ్యూ అనే వ్యక్తి సాయంతో సైనేడ్‌ తెప్పించి ఆహార పదార్థాల్లో కలిపి 14 ఏళ్ల వ్యవధిలో ఆరుగురు కుటుంబసభ్యులను చంపేసింది. పోలీసుల విచారణలో ఆమె తన నేరాన్ని అంగీకరించింది. ఈ సులో ప్రధాన నిందితురాలైన జోలీ, మాథ్యూ, సైనేడ్‌ సరఫరా చేసిన ప్రాజిత్‌ కుమార్‌లను పోలీసులు అరెస్టు చేశారు.

జోలీ తొలి లక్ష్యం ఆమె అత్తగారు అన్నమ్మథామస్‌. మామ టామ్‌థామస్‌ చనిపోతే ఆస్తి ముందుగా అన్నమ్మ పరం అవుతుంది. కాబట్టి తొలుత 2002లో ఆమెకు ఆహారంలో సైనేడ్‌ కలిపి ఇచ్చింది. తిన్న తర్వాత ఆమె కుప్పకూలిపోయి మరణించారు. అన్నమ్మది సహజమరణమే అనుకున్నారంతా. ఆస్తిలో అధిక వాటా కొట్టేసేందుకు ఆ తర్వాత ఆరేళ్లకు టామ్‌ థామస్‌కూ సైనేడ్‌ ఇవ్వడంతో ఆయన చనిపోయారు. ఆయన మరణానికి గుండెపోటే కారణం అని అంతా అనుకున్నారు. తన స్నేహాలను వ్యతిరేకిస్తూ…తనతో సరిగా ఉండని భర్త రాయ్‌పై పీకలదాకా ద్వేషం పెంచుకుని, తర్వాతి లక్ష్యంగా ఆయనను ఎంచుకుంది జోలీ. 2011లో ఆమె పెట్టిన అన్నం తిన్న రాయ్‌థామస్‌ మరణించారు. శవ పరీక్షలో అతడి మృతికి విషం కారణమని తేలినప్పటికీ భర్తకు గుండెపోటు వచ్చినట్లు జోలీ వాదించింది. శవ పరీక్షకోసం పట్టుబట్టిన అన్నమ్మ సోదరుడు మాథ్యూపై ద్వేషం పెంచుకుంది. 2014లో మాథ్యూ సైతం అదే రీతిలో చనిపోయారు. అందరినీ ఒకే శ్మశానవాటికలో సమాధి చేశారు. 

మాథ్యూ మృతితో మరణాల పరంపర ఆగలేదు. 2016లో జోలీకి వరసకు మరిదయ్యే షాజూ రెండేళ్ల కుమార్తె ఆల్పైన్‌ మృతి చెందింది. చిన్నారి మరణించిన కొద్ది నెలలకే ఆల్పైన్‌ తల్లి సిలీ కూడా అలాగే చనిపోయింది. ఈ మధ్యలో ఆడపడుచు రెజీకి ఓ ఆయుర్వేద టానిక్‌లో విషపదార్థం కలిపి ఇచ్చినప్పటికీ ఆమె అస్వస్థతకు గురైనా ఎలాగో బతికిపోయారు. విషయం బయటకు వస్తే కుటుంబం పరువు పోతుందని తాను ఎవరికీ చెప్పలేదని రెజీ ఇప్పుడు వెల్లడించారు. సిలీ మరణం తర్వాత షాజూని వివాహమాడింది జోలీ. అయితే… ఈ మరణాలతో షాజూకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

ఆరుగురిని హత్య చేసిన తర్వాత.. వీలునామా ప్రకారం ఆస్తిని తనకు అప్పగించాలని జోలీ వాదన మొదలు పెట్టింది. దీంతో అమెరికాలో ఉన్న థామస్‌ రెండో కుమారుడు మోజోకు అనుమానం వచ్చింది. ఆస్తి కోరుతూ వదిన వేసిన వ్యాజ్యాన్ని సవాలు చేశారు. కుటుంబంలో మరణాల వెనక ఏదో మిస్టరీ ఉందంటూ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఆరా తీస్తే.. తీగలాగితే డొంక కదిలినట్లు వాస్తవం వెలుగుచూసింది. సమాధులను తవ్వి తీసి పరీక్షలు నిర్వహించగా మృతదేహాల్లో సైనేడ్‌ ఆనవాళ్లు బయటపడ్డాయి.

Image result for kerala murders