JubileeHills Rape Case : రేప్ కేసు.. వెలుగులోకి కొత్త విషయాలు, బాలిక కుటుంబసభ్యులకు బెదిరింపులు

సంచలనం రేపిన జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసు విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

JubileeHills Rape Case : రేప్ కేసు.. వెలుగులోకి కొత్త విషయాలు, బాలిక కుటుంబసభ్యులకు బెదిరింపులు

JubileeHills Rape Case : తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసు విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటివరకు 17మంది సాక్షులను గుర్తించిన పోలీసులు.. ఏడుగురిని విచారించి స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు. మైనర్ బాలికను తీసుకెళ్లిన బెంజ్ కారును మైనర్ నడిపినట్లు గుర్తించిన పోలీసులు.. బెంజ్ కారు యజమానిపై కేసు నమోదు చేశారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

 

అత్యాచారం జరిగిన ఇన్నోవా.. వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మసి ఉల్లాఖాన్ కారుగా పోలీసులు తేల్చారు. డ్రైవర్ తో పాటు ఇన్నోవా కారు పంపితే డ్రైవర్ ను వెనక్కి పంపి కారును మైనర్లు నడిపినట్లు గుర్తించారు. బాలిక గొంతుపై గాట్లు ఉండడంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుకు ముందే బంజారాహిల్స్ లోని ఆశ హాస్పిటల్ లో మైనర్ బాలికకు సైకియాట్రిస్ట్ ద్వారా తల్లిదండ్రులు కౌన్సిలింగ్ ఇప్పించినట్లు పోలీసులు తెలిపారు.

JubileeHills Gang Rape : మైనర్లు కాదు మహా ముదుర్లు.. ఇంగ్లీష్ సినిమాలు, వెబ్ సిరీస్‌లోని అశ్లీల దృశ్యాలే ప్రేరణ

తమ కూతురిపై ఎవరో అఘాయిత్యానికి పాల్పడినట్లు అనుమానించిన తల్లిదండ్రులు.. బాలిక ను పబ్ కి తీసుకెళ్లిన హాదీను ప్రశ్నించారు. బాలికను తీసుకెళ్లింది ఎమ్మెల్యే బంధువు కుమారుడని చెప్పడంతో ఈ ఘోరం బయటపడింది. దీంతో నిందితులు, ఎమ్మెల్యే కొడుకు బాలిక కుటుంబసభ్యులను బెదిరించినట్లు పోలీసుల విచారణలో వెలుగుచూసింది. ఇన్నోవా కారులోనే తనను ఐదు మంది అత్యాచారం చేసినట్లు భరోసా కేంద్రంలో పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చింది బాలిక.

Jubilee Hills GangRape : ఇన్నోసెంట్‌గా కనిపించింది, అందరం కలిసే అత్యాచారం.. వెలుగులోకి మైనర్ల క్రూరత్వం