Jubilee Hills Rape Case : గ్యాంగ్ రేప్ కేసు.. నిందితుల లైంగిక సామర్థ్యంపై అందిన నివేదిక

సంచలనం రేపిన జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులకు నిందితుల పొటెన్సీ (లైంగిక సామర్థ్యం) టెస్ట్ రిపోర్ట్ అందించారు ఉస్మానియా ఆసుపత్రి డాక్టర్లు.

Jubilee Hills Rape Case : గ్యాంగ్ రేప్ కేసు.. నిందితుల లైంగిక సామర్థ్యంపై అందిన నివేదిక

Jubileehills Gang Rape Case

Jubilee Hills Rape Case : తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులకు నిందితుల పొటెన్సీ (లైంగిక సామర్థ్యం) టెస్ట్ రిపోర్ట్ అందించారు ఉస్మానియా ఆసుపత్రి డాక్టర్లు. నిందితులంతా లైంగిక సామర్థ్యం కలిగున్నారని నివేదికలో వెల్లడైంది. చార్జిషీటులో మెడికల్ రిపోర్టు కీలకం కానుంది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

అటు, నిందితులు బెయిల్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ కేసులో ఏ-1 నిందితుడు సాదుద్దీన్ నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. ఐదుగురు మైనర్లు జువైనల్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. నిందితులకు బెయిల్ ఇవ్వొద్దని జూబ్లీహిల్స్ పోలీసులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు.

కాగా.. బాలికపై అత్యాచారం కేసు మైనర్‌ నిందితుల్లో.. నేరం చేశామనే ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడం లేదని పోలీసులు చెబుతున్నారు. కరడుగట్టిన నేరస్థులు కూడా.. పోలీసు కస్టడీ, సీన్‌ రీ-కన్‌స్ట్రక్షన్‌, ఉన్నతాధికారులు విచారణకు జంకుతారని.. ఈ కేసులో మైనర్లు మాత్రం వీవీఐపీల పిల్లలు కావడంతో.. తమ బ్యాక్‌గ్రౌండ్‌ను చూసుకుంటూ తాపీగా ఉన్నట్లు తెలిసింది. ఎలాంటి కలవరం, తప్పు చేశామనే బాధ లేకుండా.. తమలో తాము పరస్పరం నిందలు వేసుకుంటున్నారని సమాచారం.

Sexual Harassment : ఏడాదిన్న‌ర‌గా లైంగిక వేధింపులు..బాలిక ఆత్మహత్య

అటు జువెనైల్‌ హోంలో మొత్తం 87 మంది బాలలు ఉండగా.. వీరు మాత్రం ఇతరులతో కలవకుండా.. తమలో తామే నిందారోపణలతో.. ముభావంగా ఉంటూ కాలం గుడుపుతున్నట్లు సమాచారం. జువెనైల్‌ హోంలో వారిని తమ తల్లిదండ్రులు కలవడానికి వచ్చినప్పుడు మాత్రం కంటతడి పెట్టుకుని, భోరున విలపించారని తెలుస్తోంది.

Jubilee Hills Rape Case : అంతా కలిసే అత్యాచారం, నిందితుల్లో కనిపించని పశ్చాత్తాపం

పోలీసు కస్టడీ విచారణలో ‘‘దొరికిపోతామనుకోలేదు’’ అని చెబుతూ.. కార్పొరేటర్‌ కుమారుడు, సాదుద్దీన్‌లదే తప్పని చెబుతూ.. పరస్పరం ఒకరిపై మరొకరు నిందలు వేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఐదుగురు మైనర్‌ నిందితులకు పబ్‌లోనే పరిచయం ఏర్పడినట్లు పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు.

‘‘సాదుద్దీన్‌ వారాంతాల్లో అమ్నేషియా పబ్‌కు వెళ్లేవాడు. అప్పుడప్పుడూ తన ఇంటి పక్కన ఉండే మైనర్‌ (ఏ-4)ను వెంట తీసుకెళ్లేవాడు. ఆ బాలుడు మరో మైనర్ ‌(ఏ-3)కి పబ్‌ సంస్కృతిని పరిచయం చేశాడు. ఏ-3కి ఐదో నిందితుడైన మైనర్‌ బంధువు. అక్కడే వీరికి కార్పొరేటర్‌ కుమారుడు పరిచయమయ్యాడు’’ అని ఓ అధికారి వివరించారు. ఆ పరిచయంతోనే.. కార్పొరేటర్‌ కుమారుడు ‘‘అమ్మాయి దొరికింది.. వచ్చేయండి’’ అని పిలవగానే.. నలుగురు మైనర్లు వెంట వెళ్లారని చెప్పారు. బాధితురాలు మైనర్‌ కావడంతో పోక్సో చట్టం ప్రకారం నిందితులకు కఠిన శిక్షలు పడే అవకాశాలున్నాయని పోలీసులు చెబుతున్నారు.