JubileeHills Gang Rape : మైనర్లు కాదు మహా ముదుర్లు.. ఇంగ్లీష్ సినిమాలు, వెబ్ సిరీస్‌లోని అశ్లీల దృశ్యాలు చూసి రేప్

వాళ్లు మైనర్లే.. కానీ, పక్కా ఉమనైజర్స్. కర్రకు చీర కట్టినా సొంగ కారుస్తారు. మూతి మీద మీసాలు కూడా సరిగా రాలేదు కానీ, వాళ్లకు అమ్మాయిలు కావాలి.(JubileeHills Gang Rape)

JubileeHills Gang Rape : మైనర్లు కాదు మహా ముదుర్లు.. ఇంగ్లీష్ సినిమాలు, వెబ్ సిరీస్‌లోని అశ్లీల దృశ్యాలు చూసి రేప్

Jubilee Hills Gang Rape Case

JubileeHills Gang Rape : తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు విచారణలో విస్తుపోయే షాకింగ్ కి గురి చేసే సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విచారణలో మైనర్లు చెబుతున్న విషయాలు పోలీసులను దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. వారు మైనర్లు కాదు మృగాళ్లు, మహా ముదుర్లు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

వాళ్లు మైనర్లే.. కానీ, పక్కా ఉమనైజర్స్. కర్రకు చీర కట్టినా సొంగ కారుస్తారు. మూతి మీద మీసాలు కూడా సరిగా రాలేదు కానీ, వాళ్లకు అమ్మాయిలు కావాలి. జూబ్లీహిల్స్ రేప్ కేసు విచారణలో మైనర్ల క్రూరత్వం బయటపడింది. పోలీసుల దిమ్మతిరిగిపోయే నిజాలను నిందితులు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇంగ్లీష్ సినిమాలు, వెబ్ సిరీస్ లోని అశ్లీల దృశ్యాల ప్రేరణతోనే రేప్ కు పాల్పడ్డామని పోలీసుల విచారణలో మైనర్లు చెప్పినట్లు సమాచారం. కోర్టు అనుమతితో విచారించిన పోలీసులకు మైనర్లు జరిగిందంతా చెప్పారు. అందరూ కలిసే అత్యాచారం చేశామని మైనర్లు అంగీకరించారు.(JubileeHills Gang Rape)

Minor Girls Gang Raped : పోర్న్ వీడియోలు చూసి ఘోరం.. ఇద్దరు చిన్నారులపై ఆరుగురు మైనర్లు గ్యాంగ్ రేప్

రేప్ కేసులో ఉన్న నిందితులంతా అసలు ఎలా కలుసుకున్నారు? వాళ్లంతా ఎప్పటి నుంచి స్నేహితులు? ఆ రోజు పబ్ లో ఏం చేయాలనుకున్నారు? బాలికపై అఘాయిత్యానికి ఎలా పాల్పడ్డారు? పబ్ దగ్గర విడిచిపెట్టిన తర్వాత బేస్ మెంట్ లో మరోసారి లైంగిక దాడికి ఎందుకు పాల్పడ్డారు. రేప్ కేసు క్రైమ్ కథా చిత్రాన్ని కళ్లకు కట్టినట్లుగా వివరించారు. ముగ్గురు మైనర్లను కస్టడీలోకి తీసుకుని విచారించిన పోలీసులు పలు కీలక విషయాలు రాబట్టారు. ముగ్గురిలో ఒకరు అసలు నోరు విప్పలేదు. మరో ఇద్దరు నిందితులు.. ఏం జరిగిందో పోలీసులకు వివరించారు.

అందరం అనుకునే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డామని నిందితులు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇంటర్ పరీక్షలు పూర్తైనప్పటి నుంచి మైనర్లంతా ఖాళీగా ఉంటున్నారు. దాదాపు ప్రతిరోజూ పబ్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. పార్టీల్లో కలుసుకుంటున్నారు. మే 28న అమ్నిషియా పబ్ కు వెళ్లారు. బాధిత బాలికతో పాటు మరో బాలికనూ పరిచయం చేసుకున్నారు.

మొదట డేటింగ్ కు వెళ్దామని అడగాలని అనుకున్నారు. వాళ్లు నవ్వుతూ మాట్లాడుతుండటం, పరిచయం చేసుకునే సమయంలో అమాయకంగా కనిపించడంతో ఇద్దరినీ బయటకు తీసుకెళ్లి లైంగిక దాడి చేయాలనుకున్నారు. అయితే, ముందుగా వాళ్లు ఎలా రియాక్ట్ అవుతారో తెలుసుకునేందుకు బాలికలతో అసభ్యంగా ప్రవర్తించారు. వాళ్లు పబ్ నుంచి బయటకు వెళ్లడంతో సాదుద్దీన్ తో పాటు మైనర్లు బయటకు వెళ్లారు. తర్వాత మాయ మాటలతో బాధిత బాలికను నమ్మించారు. కారులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి రేప్ చేశారు.

Jubilee Hills Rape Case : జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. ఒకరిపై మరొకరు చాడీలు చెప్పుకున్న మైనర్లు

తర్వాత పబ్ దగ్గర విడిచిపెట్టినప్పుడు బేస్ మెంట్ లో మరోసారి లైంగిక దాడికి చేశారు. అందరూ అనుకుని అత్యాచారం చేశారు. తమకు ఇంగ్లీష్ సినిమాలు, వెబ్ సిరీస్ లోని బూతు దృశ్యాలే అత్యాచారానికి ప్రేరణ అని పోలీసుల విచారణలో ఇద్దరు మైనర్ నిందితులు చెప్పినట్లు సమాచారం. తామంతా మైనర్లు కావడంతో పబ్ లోకి ఎంట్రీ ఉండదని, అందుకే మేజర్లు అయిన స్నేహితులు పార్టీలు ఇస్తే తాము పాల్గొని బిల్లు చెల్లిస్తామని పోలీసులతో చెప్పినట్లు తెలుస్తోంది.