Jubilee Hills Gang Rape Case : జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. మరోసారి బాలిక స్టేట్‎మెంట్ రికార్డు.. కీచకులను గుర్తించింది

షీ టీమ్స్ సమక్షంలో బాలిక స్టేట్ మెంట్ తీసుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటోస్ ను బాధితురాలికి చూపించగా.. తనపై లైంగిక దాడి చేసిన వారిని ఆమె గుర్తించింది.

Jubilee Hills Gang Rape Case : జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. మరోసారి బాలిక స్టేట్‎మెంట్ రికార్డు.. కీచకులను గుర్తించింది

Jubilee Hills Gang Rape Case

Jubilee Hills Gang Rape Case : జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో పోలీసుల దర్యాఫ్తు కొనసాగుతోంది. ఈ కేసులో పోలీసులు మరోసారి బాధితురాలి స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు. షీ టీమ్స్ సమక్షంలో బాలిక స్టేట్ మెంట్ తీసుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటోస్ ను బాధితురాలికి చూపించగా.. తనపై లైంగిక దాడి చేసిన వారిని ఆమె గుర్తించింది.

బెంజ్ కారులో తనతో నలుగురు అసభ్యంగా ప్రవర్తించినట్లు స్టేట్ మెంట్ ఇచ్చింది. ఇప్పటికే బెంజ్ కారులో ఎమ్మెల్యే కొడుకు కూడా ఉన్నట్లు వీడియో వైరల్ అయ్యింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే కొడుకుని ఈ కేసులో ఆరవ(ఏ-6) నిందితుడిగా ఎఫ్ఐఆర్ లో చేర్చాలని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై మరోసారి లీగల్ ఒపీనియన్ తీసుకోవాలని నిర్ణయించారు. ఇక నిందితులు వాడిన ఇన్నోవాలో స్వాధీనం చేసుకున్న ఆధారాలను FSLకి పంపారు పోలీసులు.

అమ్నీషియా పబ్ అత్యాచారం కేసు రిమాండ్‌ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. బాధిత బాలికతోపాటు మరో బాలికను నిందితులు వేధించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో కార్పొరేటర్ కుమారుడే కీలక సూత్రధారిగా పోలీసులు చెబుతున్నారు.

Jubilee Hills Gang Rape Case : జూబ్లీ‌హిల్స్ గ్యాంగ్‌ రేప్ కేస్ : మరో బాలికపైనా వేధింపులు

”సాదుద్దీన్‌ మాలిక్‌, కార్పొరేటర్‌ కొడుకు కలిసి పబ్ లోనే ఇద్దరు మైనర్ బాలికలను వేధింపులకు గురి చేశారు. వారి వేధింపులు భరించలేక ఇద్దరూ కలిసి బయటకు వచ్చారు. బాలికల వెనకాలే సాదుద్దీన్ గ్యాంగ్ వచ్చింది. బయటకు వచ్చిన ఒక బాలిక వేరుగా క్యాబ్ తీసుకుని వెళ్లిపోయింది. పబ్ ముందే నిలబడ్డ బాధిత బాలికను కార్పొరేటర్ కొడుకు ట్రాప్ చేశాడు.

ఇంటి దగ్గర దించుతామని బాలికను నమ్మించారు. మాజీ ఎమ్మెల్యే మనవడు ఉమేర్‌ఖాన్‌కు చెందిన బెంజ్‌ కారులో తీసుకెళ్లారు. ఆ కారులో అమ్మాయితో కలిసి నలుగురు ప్రయాణించారు. పబ్ నుంచి నేరుగా కాన్సూ బేకరీ వరకు గ్యాంగ్ వెళ్లింది. పబ్ నుంచి బేకరీకి వెళ్లే లోపే బెంజ్‌ కారులోనే అమ్మాయితో గ్యాంగ్ అసభ్యకరంగా ప్రవర్తించింది. అరాచకాలు భరించలేక కాన్సూ బేకరి నుంచి బాధిత బాలిక వెళ్లిపోతానని చెప్పింది.

బాలికను మళ్లీ బెంజ్‌ కారులో ఎక్కించుకుని కొద్దిదూరం ప్రయాణించారు. ఎమ్మెల్యే కుమారుడికి ఫోన్ కాల్ రావటంతో మధ్యలోనే దిగి వెళ్లిపోయాడు. ఆ తర్వాత బెంజ్‌ కారులో పెట్రోల్ అయ్యిపోయిందని చెబుతూ సాదూద్దీన్ గ్యాంగ్ డ్రామాలు ఆడింది. వెనుకాలే మరో ఇన్నోవాలో వక్ఫ్‌బోర్డు చైర్మన్ కుమారుడు వచ్చాడు. ఆ తర్వాత బాలికను ఇన్నోవాలోకి తరలించారు. బంజారాహిల్స్‌లో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బాలికపై ఆ గ్యాంగ్ అత్యాచారానికి పాల్పడింది.

Sexual Assault : హైదరాబాద్‌లో ఆగని అత్యాచార ఘటనలు..నగరంలో మరో రెండు దారుణాలు

అత్యాచారం తర్వాత నిందితులు బేకరీకి వచ్చారు. ఎంజాయ్ చేశామని గ్రూప్ ఫోటో దిగి ఇన్‌స్టాలో పోస్టు చేశారు. బేకరీ నుంచి నిందితులు ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు. కేసు నమోదు కాగానే హైదరాబాద్ నుంచి నిందితులు పారిపోయారు. ఇన్నోవా కారును వక్ఫ్‌బోర్డు చైర్మన్ ఫాంహౌస్‌లో నిందితులు దాచారు’’ అని పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే ఒక మేజర్ సహా మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.