లాడ్జిలో దొంగ నోట్లు : కడప జిల్లాలో కలకలం

కడప జిల్లాలో దొంగ నోట్ల వ్యవహారం కలకలం రేపింది. దొంగ నోట్లు ముద్రిస్తున్న గ్యాంగ్ గుట్టురట్టయింది. నకిలీ నోట్లు ప్రింట్ చేస్తున్న గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదుగురు

  • Published By: veegamteam ,Published On : December 7, 2019 / 09:36 AM IST
లాడ్జిలో దొంగ నోట్లు : కడప జిల్లాలో కలకలం

కడప జిల్లాలో దొంగ నోట్ల వ్యవహారం కలకలం రేపింది. దొంగ నోట్లు ముద్రిస్తున్న గ్యాంగ్ గుట్టురట్టయింది. నకిలీ నోట్లు ప్రింట్ చేస్తున్న గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదుగురు

కడప జిల్లాలో దొంగ నోట్ల వ్యవహారం కలకలం రేపింది. దొంగ నోట్లు ముద్రిస్తున్న గ్యాంగ్ గుట్టురట్టయింది. నకిలీ నోట్లు ప్రింట్ చేస్తున్న గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.7.28లక్షల దొంగ నోట్లు, 9 కిలోల గంజాయి, ప్రింటర్, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు.

ఐదుగురు వ్యక్తుల్లో ఇద్దరు విదేశీయులు ఉన్నారు. నగరంలోని ఓ లాడ్జిలో ఈ దందా నడిపిస్తున్నారు. దొంగ నోట్ల ప్రింటింగ్ గురించి పక్కా సమాచారం అందుకున్న పోలీసులు రైడ్ చేసి పట్టుకున్నారు. దొంగ నోట్ల ముఠా గురించి జిల్లా ఎస్పీ అన్బురాజన్ వివరాలు వెల్లడించారు.

దొంగ నోట్ల ప్రింటింగ్ వ్యవహారం జిల్లాలో కలకలం రేపింది. ఇప్పటివరకు ఎన్ని ఫేక్ నోట్లు ఇలా చలామణిలోకి తెచ్చారో అని కంగారు పడుతున్నారు. తమ దగ్గరున్న కరెన్సీ నోట్లు అసలో నకిలినో అని కంగారు పడుతున్నారు. గ్యాంగ్ సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

ఇప్పటివరకు ఎంత కరెన్సీ ముద్రించారు? ఎక్కడెక్కడ చలమాణి చేశారు? ఈ గ్యాంగ్ లో ఇంకా ఎంతమంది ఉన్నారు? అసలు సూత్రధారి ఎవరు? ఇలాంటి వివరాలు తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు.