Thane: ఇద్దరు భార్యల వద్ద సింపతీ కొట్టేయడానికి కిడ్నాపింగ్ డ్రామా ఆడిన భర్త

సీసీటీవీ పుటేజీ ద్వారా ఆటో డ్రైవర్‭ను గుర్తించిన పోలీసులు.. అతడిని విచారించగా.. ముగ్గురు వ్యక్తులు తన ఆటోను ఒకరోజు అద్దెకు తీసుకున్నారని చెప్పాడు. వారి ముగ్గుర్ని గుర్తించి విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆటోలో తీసుకెళ్లిన కొద్ది దూరంలోనే బుర్ఖాలో వచ్చిన సందీప్ తన స్కూటీ తీసుకెళ్లాడట. రెండవ భార్య తల్లి 50 వేల రూపాయలు ఇచ్చి తనను కిడ్నాప్ చేయించిందనే డ్రామా ఆడబోయాడు. కానీ, అడ్డంగా దొరికిపోయాడు.

Thane: ఇద్దరు భార్యల వద్ద సింపతీ కొట్టేయడానికి కిడ్నాపింగ్ డ్రామా ఆడిన భర్త

Kalyan man fakes his own kidnapping to gain wives’ sympathy

Thane: ఇద్దరు భార్యలు ఉన్నా.. ఎవరి దగ్గర నుంచీ సరైన ఆదరణ లభించలేదు. ఎలాగైనా సరే ఇద్దరి నుంచి సింపతీ కొట్టేయాలని చూసిన ఆ భర్త.. ఒక కడ్నాప్ స్కెచ్ వేసుకుని తనను తానే కిడ్నాప్ చేయించుకున్నాడు. విషయం తెలియని భార్య.. పరుగు పరుగున పోలీసుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసింది. సీసీటీవీ పుటేజీలు చూసి, కొందరిని విచారించిన అనంతరం ఆ వ్యక్తి నాటకం బయట పడింది. మహారాష్ట్రలోని ఠాణె జిల్లా కల్యాణ్‭లో జరిగిందీ దారుణం. అనంతరం తన స్నేహితులతో కలిసి షాహపూర్‭లో ఉన్న అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

సందీప్ గైక్వాడ్ (36) అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు. మొదటి భార్యతో విడాకులు అయితే కాలేదు కానీ, దూరంగా ఉంటున్నాడు. గుళ్లో పెళ్లి చేసుకున్న సునిత గైక్వాడ్ (32) అతడితోనే ఉంటోంది. అయితే అక్టోబర్ 14న కల్యాణ్‭లోని కోల్సేవాడి పోలీస్ స్టేషన్‭లో తన భర్తను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేసింది. తాము గుడి దగ్గర స్కూటీ పార్క్ చేయగానే ముగ్గురు వ్యక్తులు ఒక ఆటోలో వచ్చి, తన భర్తను కొట్టి తీసుకెళ్లారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

అయితే సీసీటీవీ పుటేజీ ద్వారా ఆటో డ్రైవర్‭ను గుర్తించిన పోలీసులు.. అతడిని విచారించగా.. ముగ్గురు వ్యక్తులు తన ఆటోను ఒకరోజు అద్దెకు తీసుకున్నారని చెప్పాడు. వారి ముగ్గుర్ని గుర్తించి విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆటోలో తీసుకెళ్లిన కొద్ది దూరంలోనే బుర్ఖాలో వచ్చిన సందీప్ తన స్కూటీ తీసుకెళ్లాడట. రెండవ భార్య తల్లి 50 వేల రూపాయలు ఇచ్చి తనను కిడ్నాప్ చేయించిందనే డ్రామా ఆడబోయాడు. కానీ, అడ్డంగా దొరికిపోయాడు.

Bangladesh: దొంగతనం అయితే చేశాడు కానీ.. ఎలా తప్పించుకోవాలో తెలీక పోలీసులకు ఫోన్ చేసి సాయం కోరిన దొంగ