Army Jawan Missing : ఆర్మీ జవాన్ మిస్సింగ్…ఆందోళనలో కుటుంబ సభ్యులు

కామారెడ్డి జిల్లా తిమ్మక్ పల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ కెంగర్ల నవీన్ కుమార్ కనపడకుండా పోవటం మిస్టరీగా మారింది.

Army Jawan Missing : ఆర్మీ జవాన్ మిస్సింగ్…ఆందోళనలో కుటుంబ సభ్యులు

Jawan Missing

Army Jawan Missing : కామారెడ్డి జిల్లా తిమ్మక్ పల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ కెంగర్ల నవీన్ కుమార్ కనపడకుండా పోవటం మిస్టరీగా మారింది. నవీన్ కుమార్ రాజస్థాన్లోని జోధ్పూర్‌లో ఆర్మీ జనరల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే గత నెల 4న సెలవు పై ఇంటికి వచ్చాడు. 25 రోజుల పాటు ఇంటి దగ్గర కుటుంబ సభ్యులతో గడిపిన జవాన్ 29వ తేదీ తిరిగి విధుల్లో చేరేందుకు బయలుదేరాడు.

కామారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్లడానికి నవీన్ కుమార్ రాత్రి బస్సు ఎక్కాడు. తెల్లవారుఝూము నుంచి అతని ఫోన్ స్విచాఫ్ ఉండడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయమై ఆర్మీ అధికారులకు ఫోన్ చేసి నవీన్ వచ్చాడా లేదా అని ఆరా తీశారు. అయితే ఆర్మీ అధికారులు నవీన్ కుమార్ చేరుకోలేదని సమాధానం రావడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది.

నవీన్ ఫోన్ స్విచాఫ్ చేసి ఉండడంతో ఎక్కడికైనా వెళ్లి ఉంటాడేమో అని స్నేహితులు, బంధువుల కు ఫోన్ చేసి వాళ్ళ దగ్గరికి వచ్చి ఉన్నాడేమోనని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఎక్కడా కూడా రాలేదని సమాధానం రావడంతో ఈ నెల 4న కుటుంబ సభ్యులు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పట్టణ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. జవాన్ నవీన్ అదృశ్యంతో తిమ్మక్ పల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.