Kannada Actress Shanaya Katwe : ప్రేమకు అడ్డుగా ఉన్నాడని సోదరుడ్ని హత్య చేయించిన నటి

కర్ణాటకలో ఈ నెల 12న జరిగిన దారుణ హత్య వెనక ఓ వర్ధమాన నటి ప్రమేయం వెలుగు చూసింది. తన ప్రేమకు అడ్డుగా ఉన్నాడని ప్రేమికుడితో కలిసి సోదరుడి హత్యకు ప్లాన్ చేసిందా నటి.  కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు శుక్రవారం నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేయటంతో ఈవాస్తవం బయట పడింది.

Kannada Actress Shanaya Katwe : ప్రేమకు అడ్డుగా ఉన్నాడని సోదరుడ్ని హత్య చేయించిన నటి

Kannada actress Shanaya Katwe

Kannada Actress Shanaya Katwe held for brother’s murder : కర్ణాటకలో ఈ నెల 12న జరిగిన దారుణ హత్య వెనక ఓ వర్ధమాన నటి ప్రమేయం వెలుగు చూసింది. తన ప్రేమకు అడ్డుగా ఉన్నాడని ప్రేమికుడితో కలిసి సోదరుడి హత్యకు ప్లాన్ చేసిందా నటి.  కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు శుక్రవారం నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేయటంతో ఈవాస్తవం బయట పడింది.

శాండల్ ఉడ్ లో అప్ కమింగ్ ఆర్టిస్ట్ షయన కాట్వే, నియాజ్ అనే వ్యక్తితో  ప్రేమలో పడింది. వీరి ప్రేమను ఆమె తమ్ముడు రాకేష్ తీవ్రంగా వ్యతిరేకించాడు. షయన  ఇటీవలే ఒకటి, రెండు కన్నడ సినిమాల్లో నటించింది. వీరి ప్రేమను షయన  సోదరుడు తరచూ వ్యతిరేకించటంతో, నియాజ్ తమ ప్రేమకు అడ్డుగా ఉన్నరాకేష్ ను అంత మొందిస్తానని షయన  వద్ద ప్రస్తావించాడు. అందుకు ఆమె అంగీకరించి ..నిజమే ఆ పని చేస్తే మన ప్రేమను అడ్డుకునే వారెవరూ ఉండరు అని ప్రోత్సహించింది.   ప్రేయసి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన నియాజ్ సమయం కోసం వేచి ఉన్నాడు.

కాగా… ఈనెల 12న హబ్బళ్లి నగర శివారులోని దేవరహళ్లి లోని కంప చెట్లు, వ్యర్ధాలు పడేసే దిబ్బల దగ్గర తలకాయ లేని గుర్తు తెలియని మృతదేహాన్ని స్ధానికులు గమనించారు. ఆనోటా ఈ నోటా ఈ వార్త పోలీసులకు చేరింది.

ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు తలకాయ లేని మొండాన్ని చూసి అవాక్కయ్యారు. దుండగులు యువకుడిని హత్యచేసి తల వేరు చేసి తీసుకు వెళ్ళారు. తలలేని మొండాన్ని ఆస్పత్రికి తరలించి.. గుర్తుతెలియని మృతదేహం గా కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు.

దర్యాప్తు మొదలెట్టిన కొద్ది గంటల్లోనే నగరంలో వేరోక చోట మొండెం లేని తలను కొందరు గుర్తించారు. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని మొదట దొరికిన మొండానికి ఈ తలను అమర్చారు. ఉదయం గుర్తించిన మొండెం తాలుకా యువకుడిదే తల అని నిర్ధారణకు వచ్చారు.

నగరానికి చెందిన రాకేష్ అనే వ్యక్తి రెండురోజుల క్రితం కనిపించకుండా పోయాడని కేసు నమోదైంది. ఇప్పుడు ఈమృతదేహం దొరకటంతో ఆ కేసులో కొంత పురోగతి కనిపించింది. ఇప్పడు రాకేష్ ను హత్యచేసిన దుండగుల కోసం పోలీసులు గాలింపు చేప్టటారు.

రాకేష్ ను హత్యచేయాల్సిన అవసరం ఎవరికుంది అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు షాకింగ్ విషయం తెలిసింది. రాకేష్ సోదరి షయన  ను విచారించే సరికి హత్యకు ఆమె ప్రోద్భలం ఉందన్న విషయం తెలుసుకున్నారు.

షయన ఇచ్చిన వాంగ్మూలంతో పోలీసులు ఆమె ప్రియుడు నియాజ్ అతని మిత్రులు తవసీఫ్, అల్తాఫ్, అమన్ అనే నలుగురిని అరెస్ట్ చేశారు. స్నేహితుల సహకారంతో నియాజ్ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. షనయ ను  గురువారం అరెస్ట్ చేసిన పోలీసులు  జ్యుడిషియల్ కస్టడీకి పంపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.