Karnataka Crime : హత్యాచార కేసును ఛేదించి..నిందితుడిని పట్టించిన కుక్క

'తుంగ 777 చార్లీ' శునకం దావణగిరి జిల్లాలో జరిగిన హత్యాచారం కేసుని ఛేదించి నిందితుడిని పట్టించింది.

Karnataka Crime : హత్యాచార కేసును ఛేదించి..నిందితుడిని పట్టించిన కుక్క

Davangere Rape And Murder Case Accused Was Find Out By ‘tunga 777 Charlie (1)

Accused find out by dog: వాసన చూసి పసిగట్టేగలవు కుక్కలు. అటువంటి కుక్కలు నేరస్తుల్ని గుర్తించటంలో పోలీసులకు ఎంతగానో సహాయపడుతున్నాయి. ఎక్కడన్నా నేరం జరిగింది అంటూ పోలీసులు డాగ్స్ తో సహా వచ్చేస్తారు. నేరాలకు సంబంధించిన ఆధారాలను గుర్తించటంలో కుక్కలు పోలీసులకు ఓ వరం అనే చెప్పాలి. పోలీసులు తమ విచారణలో గుర్తించనివాటిని కుక్కలు ఇట్టే పసిగట్టేస్తాయి. అదే జరిగింది కర్ణాటక రాష్ట్రంలోని దావణగిరి జిల్లాలో. ఓ అత్యాచారం కేసులో నిందితుడికి క్షణాల్లో పసిగట్టేసింది పోలీసు జాగిలం.

‘తుంగ 777 చార్లీ’ శునకం దావణగిరి జిల్లా పోలీసులకు వెన్నెముకలా నిలుస్తోంది. అనేక కేసుల్లో నిందితులను పట్టించిన ఈ ‘తుంగ 777 చార్లి’ తాజాగా హొన్నాలి తాలుకాలో జరిగిన హత్యాచార కేసును ఛేదించింది. జూన్​ 22న హొన్నాలి తాలుకాలోని ఓ గ్రామానికి చెందిన మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంది. అది గమనించిన హరీశ్​ అనే యవకుడు ఆమెపై అత్యాచారం చేశాడు. అది బయటపడకుండా బాధితురాలిని అత్యంత దారుణంగా హతమార్చాడు. తరువాత పారిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసిన హొన్నాలి పోలీసులు.. విచారణ చేపట్టారు.

ఈ క్రమంలోనే నిందితుడి పట్టుకోవటానికి దావణగిరి జిల్లా పోలీసు బ్రిగెడ్​ ‘తుంగ 777 చార్లీ’ రంగంలోకి దింపారు. ఘటనా స్థలానికి వచ్చిన శునకం నేరుగా నిందితుడు హరీశ్​ ఇంటికి వెళ్లి ఆగింది. హత్య చేసిన తరువాత హరీశ్​.. ఆ ఇంట్లోనే స్నానం చేసి బట్టలు మార్చుకున్నాడు. తుంగ.. నిందితుడు స్నానం చేసిన ప్రదేశానికి కూడా వెళ్లింది. అలా నిందితుడిని పట్టించి జిల్లా పోలీసులకు అత్యాచారం కేసుని ఛేధించటంలో సహాయపడింది. ‘తుంగ 777 చార్లీ’ 2009 నుంచి పోలీసు శాఖలో పనిచేస్తోంది. ఈ పన్నెండేళ్లలో 70 హత్యలు, 35 దొంగతనాల కేసులను ఛేదించింది.

కొత్త కన్నడ చిత్రం చార్లీ తర్వాత తుంగ పేరును మార్చాలని సైన్యం నిర్ణయించింది. చార్లీ సినిమాలో కేసును నిరూపించడానికి కుక్క కూడా సహాయం చేస్తుంది. ఇది కర్ణాటక పోలీసుల సొంత తుంగా లాంటిదని ఆర్మీ పేర్కొంది. కుక్క సినిమా తర్వాత ఇప్పుడు స్టార్ అయిపోయింది.