కన్నడ సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ సంచలనం: హీరోయిన్ సంజనా అరెస్ట్

  • Published By: sreehari ,Published On : September 8, 2020 / 02:42 PM IST
కన్నడ సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ సంచలనం: హీరోయిన్ సంజనా అరెస్ట్

Sandalwood drug scandal: కన్నడ సినీపరిశ్రమలో డ్రగ్స్ కేసు కలకలం రేపుతోంది. శాండిల్ వుడ్ లో డ్రగ్స్ కేసులో సినీ నటి సంజనను అరెస్ట్ చేశారు. ఈ కేసును సీసీబీ విచారిస్తోంది.. డ్రగ్స్ కేసులో ఇంకా ఎంతమందికి సంబంధం ఉందనే కోణంలో సీసీబీ దర్యాప్తు సాగుతోంది.



విచారణలో భాగంగా మంగళవారం నటి సంజనా గల్రానిని బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం ఇందిరా నగర్ లోని ఆమె ఇంట్లో సీసీబీకి చెందిన అధికారులు సోదాలు జరిపారు. అనంతరం నటి సంజనాను అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు.

https://10tv.in/news-reader-devi-nagavalli-entered-into-biggboss-show/



ముందుగా న్యాయస్థానం నుంచి సెర్చ్ వారెంట్ పొందిన తర్వాత సంజన ఇంట్లో సోదాలు జరిపామని పోలీసు ఉన్నతాధికారి సందీప్ పాటిల్ తెలిపారు. డ్రగ్స్ కేసులో సంజన స్నేహితుడు రాహుల్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే పలువురి ఇళ్లలో సోదాలు జరిపారు.. కొంతమందిని అరెస్ట్ చేశారు.



డ్రగ్స్ అక్రమ రవాణా ఆరోపణలపై ఇప్పటివరకూ 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.. వారిలో ఆరుగురిని అరెస్ట్ చేశారు.. అంతకుముందు కన్నడ నటి రాగిణి ద్వేవేదితో పాటు డిజైనర్ మోడల్ నియాజ్ ను సీసీబీ అధికారులు అరెస్ట్ చేశారు..

దక్షిణాది సినిమాల్లో SANJANA GALRANI క్రేజ్ ఉంది. తెలుగులోనూ యాక్ట్ చేసింది. బోల్డ్ గా మాట్లాడుతుందన్న పేరుంది. ఇప్పుడు ఈ యాక్టర్ డ్రగ్స్ వ్యవహారాల్లో ఇరుక్కొని జైలుపాలయ్యింది.