రూ.400 కోట్ల స్కాం నిందితుడు, ఐఏఎస్ అధికారి ఆత్మహత్య

10TV Telugu News

నాలుగు వందల కోట్ల రూపాయల ఐఎంఏ స్కాంలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కోంటున్న కర్ణాటకకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి  బీఎం విజయశంకర్ ఆత్మహత్య చేసుకున్నారు. బెంగుళూరు జయనగర్లోని తన ఫ్లాట్ లో జూన్ 23 మంగళవారం, రాత్రి ఆయన ఉరి వేసుకున్నట్లు కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

రాష్ట్రంలో సంచలనం కలిగించిన రూ.400కోట్ల ఐ మానెటరీ అడ్వైజరీ కుంభకోణంలో  లంచం తీసుకుని నిబంధనలు విరుధ్ధంగా క్లీన్ చిట్ ఇచ్చినట్లు ఆయన ఆరోపణలు ఎదుర్కోంటున్నారు.  ఈ స్కాంలో ప్రధాన నిందితుడైన మన్సూర్ ఖాన్ నుంచి విజయ్ శంకర్ కోటిన్నర లంచం తీసుకున్నారని సీబీఐ చేసిన ప్రధాన అభియోగం.  2019 జులై 8న ఈకేసులో విజయ్ శంకర్‌ను సిట్ అరెస్టు చేసింది. పరప్పణ అగ్రహార జైలులో విచారణ ఖైదీగా ఉన్న విజయ్ శంకర్‌కు జులై 27న ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో పాటు మరో ఇద్దరు నిందితులకు కూడా బెయిల్ మంజూరైంది.

కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కేసును సీబీఐకి అప్పగించారు. ఈ కేసులో ఐఏఎస్ విజయశంకర్ తో పాటు మరో ఇద్దరిని విచారించేందుకు రెండువారాల క్రితం  కర్ణాటక ప్రభుత్వం సీబీఐ కి అనుమతిచ్చింది. ఈ సమయంలో విజయశంకర్ ఆత్మహత్య చేసుకోవటం కలకలం రేపుతోంది. కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా ఉన్న విజయ శంకర్… ఆ తరువాత ఐఏఎస్ అధికారిగా పదోన్నతి పొందారు. ఐఎంఎ స్కాం వెలుగు చూసిన సమయంలో విజయ శంకర్ బెంగళూరు అర్బన్ జిల్లా డిప్యూటీ కమిషనర్‌గా ఉన్నారు.

కుటుంబ సభ్యులు బయటకు వెళ్లిన సమయంలో దాదాపు రాత్రి గం.7-15 నిమిషాల సమయంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. రాత్రి 8 గంటలకు ఆయన భార్య ఇంటికి తిరిగి వచ్చి  భర్త సూసైడ్ చేసుకున్నవిషయం గమనించారు. వెంటనే ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న సీబీఐ అధికారులు… ఆయన నివాసానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. విజయశంకర్ కు భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.  విజయశంకర్ జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత మానసికంగా బాగా కుంగిపోయారని

ఐఎంఏ జ్యూయలర్స్ పేరుతో  నిందితుడు మన్సూర్ ఖాన్  భారీ మొత్తంలో వడ్డీలు చెల్లిస్తానని  ఆశ చూపి ప్రజలనుంచి సుమారు రూ.400 కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించాడు. అనంతరం బోర్డు తిప్పేశాడు.  దాదాపు 50 వేలమంది డిపాజిట్ దారులు మన్సూర్ ఖాన్, సంస్ధపై ఫిర్యాదు చేయటంతో దర్యాప్తు జరుగుతోంది.  ఈ సమయంలో ఐఏఎస్ అధికారి ఆత్మహత్య పలు అనుమానాలకు తావిస్తోంది.

Read: బాలుడి రేప్ కేసులో టీచర్ కు 10 ఏళ్ల జైలుశిక్ష