ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం మెడకు చుట్టుకున్న అక్రమ విదేశీ కరెన్సీ తరలింపు కేసు

మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న టైమ్‌లో.. కేరళ సీఎం పినరయి విజయన్‌కు భారీ షాక్‌ తగిలింది. బంగారం స్మగ్లింగ్ కేసులో ఆయన పేరుతో పాటు క్యాబినేట్‌ హస్తం తెరపైకి రావడం సంచలనంగా మారింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ సీఎం పినరయ్ విజయన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం మెడకు చుట్టుకున్న అక్రమ విదేశీ కరెన్సీ తరలింపు కేసు

Kerala Gold smuggling case : CM Pinarayi Vijayan’s involved, Customs cites accused Swapna statement in HC : మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న టైమ్‌లో.. కేరళ సీఎం పినరయి విజయన్‌కు భారీ షాక్‌ తగిలింది. బంగారం స్మగ్లింగ్ కేసులో ఆయన పేరుతో పాటు క్యాబినేట్‌ హస్తం తెరపైకి రావడం సంచలనంగా మారింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ సీఎం పినరయ్ విజయన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు.

బంగారం స్మగ్లింగ్ కేసు అటుతిరిగి ఇటు తిరిగి చివరకు ఆయన మెడకే చుట్టుకుంది. ఈ కేసులో సంచలన విషయాలను వెల్లడించింది ప్రధాన నిందితురాలిగా ఉన్న స్వప్నా సురేశ్. ముఖ్యమంత్రి పినరయి విజయన్ అక్రమంగా కరెన్సీ తరలించాడంటూ కస్టమ్స్ అధికారులకు తెలిపిందామె.

సీఎం విజయన్ ఒక్కడే కాదు ఆయన క్యాబినేట్లో ఉండే ముగ్గురు మంత్రులతో పాటు స్పీకర్‌కు కూడా అక్రమ కరెన్సీ కేసులో సంబంధం ఉందని తెలిపింది ప్రధాన నిందితురాలు.

బంగారం స్మగ్లింగ్ కేసు కాస్తా.. కరెన్సీ తరలింపు వ్యవహారంగా మారడం సంచలనం రేపుతోంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు వ్యతిరేకంగా హైకోర్టులో ఆధారాలను సమర్పించారు కస్టమ్స్ అధికారులు. బంగారం స్కామ్ నిందితురాలు స్వప్న సురేశ్ ఇచ్చిన వాంగ్మూలాన్ని అందులో జతచేశారు.

పినరయ్ తో పాటు ముగ్గురు మంత్రులు, స్పీకర్ శ్రీరామ్‌ కృష్ణన్‌ అక్రమంగా కరెన్సీ తరలించినట్టు అభియోగాలు మోపారు కస్టమ్స్‌ అధికారులు. దీంతో ఒక్కసారిగా కేరళలో రాజకీయ దుమారం చేలరేగింది.

అక్రమంగా ఫారెన్ కరెన్సీ తరలింపు వ్యవహారమంతా సీఎం పినయర్ విజయన్ కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపిస్తున్నాయి విపక్షాలు. UAE కాన్సులేట్ ఉద్యోగిగా ఉన్న తనను ఈ అవినీతి వ్యవహరంలోకి బలవంతంగా నెట్టారని స్వప్న ఆరోపించారు. అరబ్‌ భాష వచ్చిన తాను ఈ అవినీతి వ్యవహరంలో కేరళ ప్రభుత్వ పెద్దలు, UAE ప్రతినిధులకు మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించానని విచారణలో ఒప్పుకున్నారు.

తిరువనంతపురంలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ కాన్సులేట్‌కు చెందిన పార్శిల్లో.. 15 కోట్ల రూపాయల విలువైన 30 కిలోల బంగారాన్ని జులై 4న విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

కాన్సులేట్‌కు సంబంధించిన పార్శిల్లో భారీగా బంగారం పట్టుబడటం కేరళలో అప్పడు కలకలం సృష్టించింది. ఈ కేసు విచారణలో కస్టమ్స్, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలతో పాటు మొత్తం ఐదు కేంద్ర దర్యాప్తు సంస్థలు పాల్గొన్నాయి. తాజాగా ఇందులో అక్రమ నగదు తరలింపు కోణం రావడం పెను సంచలనంగా మారింది.