లాక్ డౌన్ లో ఆశ్రయం కల్పిస్తే.. ఫ్రెండ్ భార్యతో పరారైన ప్రబుధ్ధుడు 

  • Published By: murthy ,Published On : May 21, 2020 / 01:55 PM IST
లాక్ డౌన్ లో ఆశ్రయం కల్పిస్తే.. ఫ్రెండ్ భార్యతో పరారైన ప్రబుధ్ధుడు 

ప్రపంచ వ్యాప్తంగా వేలాది మందిని బలిగొని, కోట్లాది మంది ప్రజలను ఇళ్లకే పరిమితం చేసిన కరోనా వైరస్  కుటుంబాల్లో వైవాహిక సంబంధాలను కూడా  దెబ్బ తీస్తోంది. అక్రమ సంబంధాల మోజులో వివాహా బంధాలను, కట్టుబాట్లను కాలదన్ని తాత్కాలిక సుఖం కోసం… మోజుపడిన వాళ్లతో పలాయనం చిత్తగిస్తున్నారు. దీంతో కుటుంబాల పరువు బజారున పడుతోంది. కొందరైతే అక్రమ సంబంధాల కోసం ఆశ్రయం ఇచ్చిన వారికే మోసం చేస్తున్నారు.

కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్నాడని చిన్ననాటి స్నేహితుడికి ఆశ్రయం కల్పించాడో వ్యక్తి. కాగా సహాయం పొందిన వ్యక్తి స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఆమెను పిల్లల్ని తీసుకుని పరారయ్యాడు.

 
కేరళలోని  ఇడుక్కి జిల్లాలోని మున్నార్ గ్రామానికి చెందిన లోథారియో (32) అనే వ్యక్తి టూరిజం డిపార్ట్ మెంట్ లో ఎర్నాకుళంలో ఉద్యోగం చేస్తున్నాడు. మార్చి 24 న లాక్ డౌన్ ప్రకటించటంతో మున్నార్ గ్రామానికి తిరిగి వెళ్తుండగా మువట్టుపుజ అనే  పట్టణంలో చిక్కుకుపోయాడు. రెండు, మూడు రోజులు అక్కడ ఉన్న టూరిజం ఆఫీసులో తలదాచుకున్నాడు. రాను రాను తినటానికి తిండిలేక ఇబ్బంది పడ్డాడు. ఈలోగా తన కుటుంబ సభ్యుల ద్వారా మువట్టుపుజ లో నివాసం ఉండే తన చిన్ననాటి స్నేహితుడి నెంబరు సంపాదించాడు.  

దాదాపు 20 ఏళ్ల తర్వాత అతడికి ఫోన్ చేసి లాక్ డౌన్ పూర్తయ్యేంతవరకు తనకు ఆశ్రయం కల్పించాలని లోథారియో కోరటంతో ఆ మిత్రుడు సరేనన్నాడు. లోథారియోను తన కారులో ఇంటికి  తీసుకెళ్లి ఆశ్రయం కల్పించి రోజు భోజనం పెట్టేవాడు ఆ మిత్రుడు. ఈ క్రమంలో లోథారియో, స్నేహితుడి భార్యపై కన్నేశాడు. అవకాశం చూసుకుని ఆమెకు మాయమాటలు చెప్పి ఆమెను లోబరుచుకున్నాడు. తనతో వచ్చేస్తే పెళ్లి చేసుకుని మంచిగా చూసుకుంటానని ఆశలు కల్పించాడు.

కాలక్రమంలో మే1న ఎర్నాకుళం జిల్లాను గ్రీన్ జోన్ గా ప్రకటించారు.  గ్రీన్ జోన్ గా ప్రకటించినా లోథారియో మిత్రుడు ఇంటి నుంచి వెళ్లటం లేదు. అనుమానం వచ్చిన స్నేహితుడు తన భార్య ఫోన్ చెక్ చేశాడు. అందులో లోథారియో తన భార్యతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు కనపడ్డాయి. ఈ విషయంలో భార్యా, భర్తల మధ్య వాగ్వాదం జరిగింది. మర్నాడు లోథారియో స్నేహితుడి భార్యను, అతడి ఇద్దరు పిల్లల్ని తీసుకుని మున్నార్ పరారయ్యాడు.  

షాక్ కు గురైన స్నేహితుడు వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలెట్టారు. వారు ఆటోరిక్షాలో పరారైన సంగతి గమనించిన పోలీసులు  ఆటోరిక్షా డ్రైవర్ కు  ఫోన్ చేసి  ఎక్కడున్నారో తెలుసుకుని  వెనక్కి రమ్మన్నారు. ఆటోవాలా లోథారియోతో పాటు స్నేహితుడు భార్యా పిల్లల్ని తీసుకుని స్టేషన్ కు తీసుకువచ్చాడు. కానీ భార్య, తన భర్త వద్దకు వెళ్లటానికి నిరాకరించింది. పరిస్ధితి గమనించిన పోలీసుల చాకచక్యంగా వ్యవహరించారు. లోథారియో పై చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసిన కేసు పెడతామని బెదిరించటంతో ఆమె భర్త వెంట వెళ్లింది. 

తిరిగి కొన్ని రోజులకు  ఆమె పిల్లల్ని తీసుకుని మళ్లీ లోథారియో వద్దకు వెళ్లిపోయింది. ఆమె భర్త మళ్లీ పోలీసులను ఆశ్రయించాడు.  పోలీసు స్టేషన్ తన లాయర్ తో వచ్చిన మహిళ భర్తతో కలిసి జీవించటానికి నిరాకరించింది.  పిల్లలపై భర్తకు హక్కులుంటాయని పోలీసులు చెప్పగా పిల్లలను భర్తకు అప్పగించి..కారు బంగారు నగలు తీసుకుని లోథారియో తో కలిసి జీవించేందుకు ఎర్నాకుళం వెళ్లిపోయింది.