కేరళలో రెండు పార్టీల మధ్య ఘర్షణ – ఆర్ఎస్ఎస్ కార్యకర్త మృతి

కేరళలో రెండు పార్టీల మధ్య ఘర్షణ – ఆర్ఎస్ఎస్ కార్యకర్త మృతి

Kerala RSS worker died in clash with SDPI members in Alappuzha, 6 arrested, BJP Calls bandh : కేరళలోని అలప్పుజ జిల్లాలో బుధవారం రాత్రి రెండు పార్టీల మధ్య జరిగిన ఘర్షణలో ఓ ఆర్ఎస్ఎస్ కార్యకర్త మరణించాడు.

అలప్పుజ జిల్లాలోని చెర్తాల సమీపంలోని నాగముకుళంగర లో … పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పార్టీకి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్‌ (ఎస్‌డీపీఐ) కి చెందిన కార్యకర్తలు బుధవారం రాత్రి విరాళాలు సేకరిస్తున్నారు. ఈ సమయంలో ఆర్ఎస్ఎస్,ఎస్డీపీఐ కార్యకర్తలకు మధ్య ఘర్షణ చెలరేగింది. ఈఘర్షణలో ఓ ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాహుల్ కృష్ణ అలియాస్ నందు మరణించగా, ఇరు పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి.

ఈఘటనకు సంబంధించి ఆరుగురు ఎస్‌డీపీఐ కార్యకర్తలను వలయార్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ కార్యకర్త మృతిచెందటంతో ఆర్ఎస్ఎస్ ఈరోజు జిల్లా వ్యాప్తంగా బంద్ పాటిస్తోంది. దీనికి బీజేపీ తో సహా పలు హిందూ సంస్ధలు మద్దతు తెలిపాయు. కాగా….గతంలో కాసర్ గోడ్ నుంచి తిరువనంతపురంవరకు బీజేపీ చేపట్టిన విజయ యాత్ర ప్రారంభోత్సవానికి విచ్చేసిని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పర్యటనపై అప్పట్లో ఎస్‌డీపీఐ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేసారు.

ఈ నేపథ్యంలోనే బుధవారం రెండు వర్గాల మధ్య మధ్య ఘర్షణ జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. గతంలో తమ పార్టీ నిరిసన వ్యక్తం చేసిన విషయాన్ని దృష్టిలో పెట్టుకునే …..ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తమ కార్యకర్తలపై దాడి చేయాటానికి ముందుగానే ప్లాన్ వేసుకున్నారని ఎస్‌డీపీఐ ఆరోపించింది. అందులో భాగంగానే గురువారం ఎస్‌డీపీఐ కర్యకర్తలతో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు గొడవకు దిగారని మండిపడింది.

కాగా తమ కార్యకర్తను చంపాలని ఎస్‌డీపీఐ ముందుగానే ప్లాన్ చేసిందని ఆర్ఎస్ఎస్ ఆరోపిస్తోంది. కాగా తీవ్ర గాయాలపాలైన రెండు వర్గాల కార్యకర్తలలో ఇద్దరి పరిస్ధితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా రాష్ట్రంలో ఎస్డీపీఐపై నిషేధం విధించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.