ఖమ్మం లేబర్ ఆఫీసర్ ఆనంద్ రెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు, 8 నెలల క్రితమే మర్డర్ స్కెచ్, తమ్ముడిని కూడా చంపేయాలని వ్యూహం

ఖమ్మం అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ఆనంద్ రెడ్డి హత్య.. తెలంగాణలో సంచలనం రేపింది. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణం అని తేలింది. ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు

  • Published By: veegamteam ,Published On : March 11, 2020 / 02:24 PM IST
ఖమ్మం లేబర్ ఆఫీసర్ ఆనంద్ రెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు, 8 నెలల క్రితమే మర్డర్ స్కెచ్, తమ్ముడిని కూడా చంపేయాలని వ్యూహం

ఖమ్మం అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ఆనంద్ రెడ్డి హత్య.. తెలంగాణలో సంచలనం రేపింది. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణం అని తేలింది. ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు

ఖమ్మం అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ఆనంద్ రెడ్డి హత్య.. తెలంగాణలో సంచలనం రేపింది. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణం అని తేలింది. ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు స్నేహితుడే దారుణంగా చంపేశాడు. పక్కా పథకం ప్రకారం మర్డర్ జరిగింది. డబ్బుకి బదులు భూమి ఇస్తానని చెప్పి చంపేశాడు. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆనంద్ రెడ్డి తమ్ముడు శివకుమార్ రెడ్డి హత్యకు కూడా కుట్ర జరిగిన విషయం పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అన్నదమ్ములు ఇద్దరినీ లేపేస్తే.. తమకు అడ్డు ఉందని, రుజువు ఉండదని ప్రదీప్ రెడ్డి అండ్ గ్యాంగ్ భావించింది. అయితే శివకుమార్ రెడ్డి తృటిలో తప్పించుకుని బతికిపోయాడు. 

8 నెలల క్రితమే మర్డర్ స్కెచ్:
ఖమ్మం లేబర్ అసిస్టెంట్ ఆఫీసర్ గా పని చేస్తున్న మోకు ఆనంద్ రెడ్డి హత్య.. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో కలకలం రేపింది. జనగామ జిల్లాకు చెందిన ఆనంద్ రెడ్డి హన్మకొండలోని ఆశోకా కాలనీలో నివాసం ఉంటున్నాడు. చిన్నప్పటి నుంచి అక్క, బావల దగ్గర పెరిగాడు. వారి దగ్గరే చదువుకున్నాడు. ఆ తర్వాత ఉద్యోగం వచ్చింది. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పని చేశాడు. ఆనంద్ రెడ్డి స్నేహితుడే ప్రదీప్ రెడ్డి. అతడిది వరంగల్ జిల్లా. నాలుగేళ్ల క్రితం ఇద్దరూ కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగారు. ఈ క్రమంలో మహారాష్ట్రంలోని ఇసుక క్వారీ వ్యాపారం చేయాలని నిర్ణయించారు. కోటి రూపాయలకు పైగా పెట్టుబడిని ప్రదీప్ రెడ్డికి ఆనంద్ రెడ్డి ఇచ్చారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో తన డబ్బు వెనక్కి ఇవ్వాలని ఆనంద్ రెడ్డి.. ప్రదీప్ రెడ్డిపై ఒత్తిడి తెచ్చాడు. డబ్బు వెనక్కి ఇవ్వడం ఇష్టం లేని ప్రదీప్ రెడ్డి.. ఆనంద్ రెడ్డిని చంపేయాలని డిసైడ్ అయ్యాడు. 8 నెలల క్రితమే మర్డర్ స్కెచ్ కూడా వేశాడు. 

గొంతుకోసి దారుణ హత్య:
ఇందులో భాగంగా ప్రదీప్ రెడ్డి మరో ఆరుగురితో కలిసి పథకం వేశాడు. డబ్బు బదులు భూమి ఇస్తానని ఆనంద్ రెడ్డిని నమ్మించిన ప్రదీప్.. మార్చి 7న భూమి చూపిస్తానని తీసుకెళ్లాడు. హన్మకొండలోని ఆశోకా హోటల్ లో బ్రేక్ ఫాస్ట్ చేశారు. ఆ తర్వాత సమీపంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా రాంపూర్ సమీపంలో తనకు వ్యవసాయ భూమి ఉందని, దాన్ని ఇస్తానని ప్రదీప్ రెడ్డి నమ్మించాడు. భూమి చూపిస్తానని మార్చి 7న ఉదయం 8 గంటలకు ఆనంద్ రెడ్డిని తీసుకెళ్లాడు. 70 కిలోమీటర్లు ప్రయాణించి 11గంటల ప్రాంతంలో భూపాలపల్లికి చేరుకున్నారు. రాంపూర్ గ్రామం సమీపంలోని దట్టమైన అడవుల్లో ఆనంద్ రెడ్డి మర్డర్ కు ప్రదీప్ స్కెచ్ వేశాడు. ముందుగానే అడవుల్లో ముగ్గురిని సెట్ చేశాడు. భూపాలపల్లి చేరుకున్న తర్వాత అంతా విందు చేసుకున్నారు. ఆ తర్వాత ప్రదీప్ రెడ్డి మరో ఆరుగురు కలిసి ఆనంద్ రెడ్డి కాళ్లు, చేతులు కట్టేశారు. ఆనంద్ ను హత్య చేసేందుకు అడవి లోపలికి లాక్కెళ్లారు. అక్కడ ఆనంద్ రెడ్డి గొంతు కోసి అతి దారుణంగా చంపేశారు. 

దారి తప్పడంతో బతికిపోయిన తమ్ముడు:
కాగా, హత్యకు ముందు ఆనంద్ రెడ్డి.. ఏటూరు నాగారంలో బీట్ ఆఫీసర్ గా పని చేస్తున్న తన సోదరుడు శివకుమార్ రెడ్డికి ఫోన్ చేశాడు. ప్రదీప్ రెడ్డి డబ్బుకి బదులుగా భూపాలపల్లి సమీపంలో వ్యవసాయ భూమి ఇస్తానని చెప్పాడు, ఆ భూమి చూసేందుకు నేను వచ్చాను, నీవు కూడా రా.. అని ఫోన్ లో తమ్ముడికి చెప్పాడు. దాదాపు 11.45 గంటలకు ఫోన్ లో ఆనంద్ రెడ్డి తన తమ్ముడితో ఫోన్ లో టచ్ లో ఉన్నాడు. అన్న ఫోన్ చేయడంతో తమ్ముడు శివ, ఏటూరు నాగారం నుంచి భూపాలపల్లికి వచ్చాడు. అక్కడికి వచ్చాక ప్రదీప్ కి ఫోన్ చేశాడు. భూపాలపల్లికి 15 కిమీ దూరంలో ఉన్నాను, అక్కడికి రావాలని శివకుమార్ తో ప్రదీప్ రెడ్డి చెప్పాడు. ఆనంద్ రెడ్డితో పాటు శివకుమార్ ని కూడా చంపేయాలని ప్రదీప్ రెడ్డి స్కెచ్ వేశాడు. ఇద్దరినీ చంపేస్తే రుజువు ఉండదని అనుకున్నాడు. అయితే శివకుమార్ రెడ్డి దారి తప్పాడు. దీంతో అతడు బతికిపోయాడు.