Bhabanipur : టీఎంసీ-బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ..దిలీప్ ఘోష్ పై దాడి

వెస్ట్ బెంగాల్ లోని భవానీపూర్ లో బీజేపీ-టీఎంసీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. సీఎం మమతా బెనర్జీ పోటీకి దిగిన భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల 30న ఉప ఎన్నిక జరగనున్న

Bhabanipur : టీఎంసీ-బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ..దిలీప్ ఘోష్ పై దాడి

Bengal

Bhabanipur వెస్ట్ బెంగాల్ లోని భవానీపూర్ లో బీజేపీ-టీఎంసీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. సీఎం మమతా బెనర్జీ పోటీకి దిగిన భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల 30న ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఇవాళ ఆ నియోజకవర్గంలో టీఎంసీ-బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇవాళ భవానీపూర్ లో క్యాంపెయినింగ్ కి చివరి రోజు కావడంతో..నియోజకవర్గంలోని 8 వార్డులలోని 80 లొకేషన్స్ లో 80మంది బీజేపీ నేతలు క్యాంపెయిన్ చేస్తున్నారు.

ఈ సమయంలో భవానీపూర్ లో  బెంగాల్ బీజేపీ మాజీ చీఫ్ దిలీప్ ఘోష్ భవానీపూర్ లో నిర్వహించిన ర్యాలీపై టీఎంసీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ దాడిలో దిలీప్ ఘోష్ తో పాటు పలువురు బీజేపీ కార్యకర్తలుగా గాయపడ్డారని తెలిపారు. ఘర్షణ వాతావరణం నేపథ్యంలో దిలీప్ ఘోష్ క్యాంపెయిన్ ని ముగించి వెనుదిరిగారు.

దిలీప్ ఘోష్ ప్రచారం ప్రారంభమైన వెంటనే టిఎంసీ మద్దతుదారులు అతని చుట్టూ నిరసన వ్యక్తం చేయడం ప్రారంభించారని, ఆ తర్వాత ఉద్రిక్తత పెరిగిందని బీజేపీ పేర్కొంది. బీజేపీ కార్యకర్తలను కొట్టారని,ఈ క్రమంలో దిలీప్ ఘోష్ ని టీఎంసీ కార్యకర్తలు తొసిసేశారని బీజేపీ ఆరోపించింది. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అందులో ఓ వ్యక్తి చేతిలో తుపాకీ కనిపించటం కలకలం రేపింది. ఆందోళనకారులను అదుపు చేసేందుకు దిలీప్​ ఘోష్​ భద్రతా విభాగంలోని ఓ అధికారి.. తన సర్వీస్​ పిస్టల్​ను​ బయటకు తీసి.. తృణమూల్ కాంగ్రెస్​ కార్యకర్తల వైపు గురిపెట్టారు.  ఇంత జరుగుతున్నా పోలీసులు మౌనంగా చూస్తూ ఉండిపోయారని కమలదళం ఆరోపించింది. భవానీపూర్ లో ఓటమి తప్పదన్న భయంతోనే తనను టీఎంసీ ఈ విధంగా ఆపాలని ప్రయత్నించిందని..ఎన్నికల కమిషన్ కు దీనిపై ఫిర్యాదు చేస్తానని దిలీప్ ఘోష్ తెలిపారు. మేడమ్ ముఖ్యమంత్రి సొంతూరు అయిన భవానీపూర్‌లో ప్రజా ప్రతినిధిపై దాడి జరుగుతున్నప్పుడు ఈ రాష్ట్రంలో సామాన్యుడి జీవితం ఎంత సురక్షితం అని దిలీప్ ఘోష్ ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. ఈరోజు భవానీపూర్‌లోని జగుబాబర్ బజార్‌లో జరిగిన ప్రణాళికాబద్ధమైన దాడి నన్ను TMC గూండాలు మరియు దుండగులు చంపడానికి పన్నాగం అని దిలీప్ ఘోష్ మరో ట్వీట్ లో తెలిపారు.

ALSO READ  చైనాకు చెక్ పెట్టి.. తైవాన్ తో ఒప్పందం చేసుకున్న భారత్

తమ నేతలను టీఎంసీ క్యాంపెయినింగ్ చేసుకోనివ్వడం లేదని..సీఎం మమతా బెనర్జీ అసహనంతో ఉన్నారని బీజేపీ నాయకురాలు అగ్నిమిత్ర పాల్ తెలిపారు. టీఎంసీ గూండాలు తమ కార్యకర్తలను వేధించారని..కొట్టారని తెలిపారు. పరిస్థితి చాలా దారుణంగా ఉందని,ఎన్నికల కమిషన్ ఏం పట్టించుకోవట్లుదని బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువెందు అధికారి అన్నారు. ఇక,భవానీపూర్ ఘర్షణలపై ఎన్నికల కమిషన్..రాష్ట్రప్రభుత్వాన్ని ఓ నివేదిక కోరింది. సాయంత్రం నాలుగు గంటల్లోగా నివేదికగా సమర్పించాలని ప్రభుత్వాన్ని కోరింది.

కాగా,ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్ లోని నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మమతా బెనర్జీ..బీజేపీ నేత సువెందు అధికారి చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఆమె సీఎం బాధ్యతలు చేపట్టారు. అయితే రూల్స్ ప్రకారం ఆమె ఆరు నెలల్లోగా శాసనసభ లేదా శాసనమండలికి ఎన్నిక కావాల్సి ఉంది. అయితే బెంగాల్ లో శాసనమండలి లేదు. ఈ నేపథ్యంలో భవానీపూర్ ఎమ్మెల్యే మమత కోసం తన శాసనసభ సభ్యత్వాన్ని రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. భవానీపూర్ ఉపఎన్నికల్లో మమత పోటీకి దిగారు. మరోవైపు,భవానీపూర్ లో మమతా బెనర్జీపై..ప్రియాంక టిబ్రేవాల్ ని పోటీకి దింపింది బీజేపీ. సీపీఐ నుంచి శ్రిజిబ్ బిశ్వాస్ పోటీ చేస్తున్నారు. ఇక,కాంగ్రెస్ ఎవ్వరినీ పోటీకి దించలేదు. అయితే భవనీపూర్ లో మమతకి మంచి పట్టు ఉంది. 2011 నుంచి రెండు పర్యాయాలు భవానీపూర్ నుంచే మమత శాసనసభ సభ్యురాలిగా కొనసాగిన విషయం తెలిసిందే.