Kidnap Murder : కిడ్నాప్‌కు గురైన జ్యూయలరీ షాపు ఉద్యోగి హత్య

గుంటూరు జిల్లా నరసరావుపేట లో నిన్న కిడ్నాప్ కు  గురైన జ్యూయలరీ షాపు ఉద్యోగి రామాంజనేయులును దుండగులు హత్య చేశారు. అతని మృతదేహాన్ని పత్తిపాడు మండలం తుమ్మలపాలెం వద్ద  గుర్తించారు. 

Kidnap Murder  : కిడ్నాప్‌కు గురైన జ్యూయలరీ షాపు ఉద్యోగి హత్య

Kidnap Murder

Kidnap Murder :  గుంటూరు జిల్లా నరసరావుపేట లో నిన్న కిడ్నాప్ కు  గురైన జ్యూయలరీ షాపు ఉద్యోగి రామాంజనేయులును దుండగులు హత్య చేశారు. అతని మృతదేహాన్ని పత్తిపాడు మండలం తుమ్మలపాలెం వద్ద  గుర్తించారు.

కళ్యాణ్ జ్యుయలర్స్‌లో రామాంజనేయులు (31) అనే వ్యక్తి ఉద్యోగం చేస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో షాప్ లోంచి బయటకు రమ్మని ఫోన్ రావడంతో రామాంజనేయులు బయటకి వచ్చాడు. అప్పటికే అక్కడ మాటు వేసిన దుండగులు రామాంజనేయులును కొట్టుకుంటూ తీసుకువెళ్లి ఆటో ఎక్కించారు.
Also Read : USA Road Accident : అమెరికాలో రోడ్డు ప్రమాదం- ఇద్దరు తెలుగు విద్యార్ధులతో సహా ముగ్గురు మృతి
సమాచారం తెలుసుకున్నరామాంజనేయులు భార్య ప్రసన్న లక్ష్మి(26) వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజి ఆధారంగా దర్యాప్తు చేసి మృతదేహాన్ని కనుగొన్నారు.  అన్నవరపు కిషోర్, జంగం బాజి కిడ్నాప్ చేసి ఉంటారని ప్రసన్న లక్ష్మి   పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అనుమానం వ్యక్తి చేసింది.  దీంతో పోలీసులు అనుమానితులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.  వారు ఇచ్చిన సమాచరంతో  రామాంజనేయులు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కాగా… ఈకేసుకు గజదొంగ రాయపాటి వెంకన్న కేసుకు సంబంధం ఉన్నట్లుపోలీసులు గుర్తించి ఆదిశగా విచారణ చేపడుతున్నారు. కేరళలో దొంగతనాలు చేయటంలో రాయపాటి వెంకన్న దిట్టగా పేరు పొందాడు. అక్కడ భారీగా బంగారు ఆభరణాలు దొంగిలించినట్లు వెంకన్నపై ఆరోపణలు రుజువుకావటంతో ప్రస్తుతం జైలుశిక్ష అనుభవిస్తున్నాడు.బంగారు ఆభరణాల కోసం రాయపాటి వెంకన్న అనుచరులు ఎత్తుకు పైఎత్తులు వేస్తుంటారని వినకిడి.

ఇలా ఉండగా  వెంకన్న అనుచరుడు చంటి ఆరునెలలుగా కనిపించటంలేదు. చంటి కనిపించకుండా పోవటానికి రామాంజనేయులు హస్తం ఉండి ఉంటుందని భావించిన చంటి సోదరుడు బాజీ నిన్న రామాంజనేయులును మరి కొంతమందితో కలిసి కిడ్నాప్ చేసి హత్య చేశారు. పోలీసు విచారణలో మరికొన్నివిషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది.